
వ్యాధులను కనిపెట్టే ‘ఈ- ముక్కు’
హోస్టన్: శ్వాసని విశ్లేషించి ఆరోగ్య పరిస్థితిని తెలిపే ఈ-ముక్కుని పరిశోధకులు తయారుచేశారు. దీన్ని తయారుచేసిన బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. దీని ఖరీదు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందంటున్నారు. కొన్ని సెమీకండక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇలాంటి పరికరాలు శ్వాసని విశ్లేషించగలవు.
కానీ ఇవి బాగా ఖరీదైనవి. వీటిలో సీఎంఓఎస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను ఉపయోగించడం ద్వారా వీటి ధర భారీగా తగ్గనుందని తెలిపారు. సీఎంఓఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను ఉత్పత్తి చేసే ఓ సాంకేతిక పరిజ్ఞానం. దీన్ని స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఉపయోగిస్తారు. మనకు ఏదైనా వాసన వస్తుందంటే గాలిలో జరిగే రసాయన మార్పులు మనకు తెలుస్తున్నట్లే. ఈ-ముక్కు కూడా అదే పద్ధతిలో పనిచేస్తుంది.ఇది మనకు వచ్చే అనేక వ్యాధులను ముందుగా పసిగట్టగలదు. 2018నాటికి అందుబాటులోకి రానుంది.