
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న సమయంలో గూగుల్, మెటా, ఓపెన్ఏఐ వంటివి సొంత చాట్‌బాట్స్ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే.. మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) గ్రోక్ ప్రవేశపుట్టింది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఇతర ఏఐ చాట్‌బాట్ల కంటే భిన్నమైన సమాధానాలు ఇస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
గ్రోక్ ఏఐ కొంత దురుసుగా ప్రవర్తించడం చేత.. సోషల్ మీడియాలో నెటిజన్లు గ్రోక్ vs చాట్‌జీపీటీలను పోలుస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో హాస్యాస్పద చిత్రాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.
చాట్‌జీపీటీ ప్రతి అంశానికి.. సామరస్యమైన సమాధానాలు ఇస్తుంటే, గ్రోక్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు బూతులు తిడుతోంది. ఆ బూతులు కాస్త నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఎక్కువమంది గ్రోక్‌ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ChatGPT Grok pic.twitter.com/LmuyqO0gsV
— Dr Gill (@ikpsgill1) March 15, 2025
ChatGPT Grok pic.twitter.com/CcqPZA2PDt
— rozgar_CA (@Memeswalaladka) March 15, 2025
చాట్‌జీపీటీ (ChatGPT)
చాట్‌జీపీటీ అనేది ఓపెన్ఏఐ రూపొందించిన.. చాట్‌బాట్. ఇది ప్రాంప్ట్‌ల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, కవిత్వం రాయడం, రెజ్యూమె రూపొందించడం, కొన్ని ఆరోగ్య సలహాలను ఇవ్వడం వంటివి చేస్తోంది. దీంతో ఎక్కువమంది దీనిని ఉపయోగిస్తున్నారు. అంటే ఇది ఒక పద్దతి ప్రకారం సమాధానాలు ఇస్తూ.. ఉపయోగకరంగా ఉంది.
గ్రోక్ (Grok)
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) అభివృద్ధి చేస్తున్న చాట్‌బాట్ 'గ్రోక్'. ఇది కూడా అంశం ఏదైనా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంది. ఎవరైనా తిడితే.. గ్రోక్ సైతం వెనకాడకుండా తిడుతుంది. దీంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్శిస్తులవుతున్నారు.
ChatGPT Grok pic.twitter.com/yVZeBCafBd
— Narundar (@NarundarM) March 15, 2025
Grok to Indian people pic.twitter.com/AIfrdngY2x
— Sajcasm (@sajcasm_) March 15, 2025
Comments
Please login to add a commentAdd a comment