
అన్ని రంగాల్లోనూ చాట్‌జీపీటీ హవా కొనసాగుతోంది. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానం చెప్పే చాట్‌బాట్.. ఉద్యోగానికి అవసరమైన రెజ్యూమె (Resume) కూడా రూపొందింస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమెతో లెక్కలేనన్ని ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేను చాట్‌జీపీటీని ఉపయోగించాను. నేను ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నానో.. దానికి సరిపోయేలా చాట్‌జీపీటీ ద్వారా ఒక రెజ్యూమె రూపొందించుకున్నాను. మొత్తం మీద ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేను అనుకున్న దాని కంటే చాలా అద్భుతంగా ఉంది.
నా రెజ్యూమె చూసి.. చాలా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే నా స్థాయికంటే ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించిన కాల్స్ వచ్చాయి. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే.. నేను ఇంటర్వ్యూ అంటే భయపడతాను. అయితే ఇప్పుడు గందరగోళానికి గురయ్యాను అని పోస్టులో పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. నేను కూడా చాట్‌జీపీటీ సాయంతో రెజ్యూమె క్రియేట్ చేసుకున్నాను అని ఒక వ్యక్తి అన్నారు. చాట్‌జీపీటీని మాత్రమే ఉపయోగించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదని నేను అనుకుంటున్నానని మరొక వ్యక్తి అన్నారు. అవసరమైన సమాచారం కోసం చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుందని మూడో వ్యక్తి అన్నారు.