Resume
-
ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు
దాదర్: కుర్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బెస్ట్ బస్సు తిరిగి రోడ్డెక్కింది. గతవారం ప్రమాదం నేపథ్యంలో కుర్లా బస్ డిపోలో ఈ బస్సుకు గత ఐదారు రోజుల నుంచి మరమ్మతులు జరుగుతున్నాయి. పనులు పూర్తి, పరీక్షలు సఫలం కావడంతో తిరిగి ఈ బస్సు రాకపోకలు సాగించేందుకు అధికారులు అనుమతినిచ్చారు. గత సోమవారం రాత్రి 9.35 గంటల ప్రాంతంలో పశ్చిమ దిశలో కుర్లా రైల్వే స్టేషన్ నుంచి అంధేరీ దిశగా బయలుదేరిన ఏ–332 నంబరు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఎల్బీఎస్ రోడ్డుపై అదుపు తప్పింది. అడ్డువచ్చిన అనేక వాహనాలను ఢీ కొడుతూ వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెస్ట్ అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సును కుర్లా బస్ డిపోకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా మరుసటి రోజు అంటే మంగళవారం రోజున కుర్లా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే బస్సులన్నింటినీ నిలిపివేశారు. ఇప్పటికే బెస్ట్ సంస్ధలో బస్సుల కొరత తీవ్రంగా ఉండటంతో సాధారణ మరమ్మతుల నిమిత్తం డిపోకి వచ్చిన బస్సులను సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు తనిఖీల అనంతరం గత వారం రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బస్సును కూడా వెంటనే రోడ్డెక్కించారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది ప్రయాణికులు కుర్లా స్టేషన్ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును చూడడానికి గుమిగూడారు. గత సోమవారం రాత్రి ప్రమాడానికి గురైన బస్సు ఇదేనంటూ చర్చించుకున్నారు. కొందరైతే ఈ బస్సులో ఎక్కేందుకు ముఖం చాటేశారు. -
చాట్‌జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం సంపాదించడం కష్టమైపోతోంది. ఒకప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలంటే చదువు, నైపుణ్యాలు వంటివన్నీ చేర్చి రెజ్యూమ్ (సీవీ) క్రియేట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి కూడా చాట్‌జీపీటీ వాడేస్తున్నారు. ఇలా చాట్‌జీపీటీ సాయంతో రూపొందిన రెస్యూమ్ చూసి ఇటీవల ఓ కంపెనీ సీఈఓ ఖంగుతిన్నారు.ఢిల్లీలోని ఎంట్రేజ్ కంపెనీ సీఈఓ 'అనన్య నారంగ్'.. ఒక ఉద్యోగానికి వచ్చిన సీవీ చూసారు. అది చాట్‌జీపీటీ ద్వారా రూపొందించినట్లు తెలిసింది. చాట్‌జీపీటీ ద్వారా సీవీ క్రియేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందులో అన్నీ వివరణాత్మకంగా లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది.నిజానికి నువ్వు అడిగే ప్రశ్నకు తగినట్లుగా చాట్‌జీపీటీ ఓ సమాధానం ఇస్తుంది. అందులో కొన్ని మనమే పూరించాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థి చాట్‌జీపీటీ ఇచ్చిన సీవీను నేరుగా కంపెనీకి పంపించారు. అందులో పూరించాల్సిన విషయాలు కూడా అలాగే వదిలిపెట్టేసారు.ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!ఎక్స్పీరియన్స్ కాలమ్ దగ్గర ఉదాహరణ అని ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అనన్య నారంగ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇటీవల ఉద్యోగ దరఖాస్తును స్వీకరించారు. ఈరోజు మనకు నిరుద్యోగం ఎక్కువైందంటే ఆశ్చర్యం లేదు అని పేర్కొన్నారు.అనన్య నారంగ్ షేర్ చేసిన ఈ సీవీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌షాట్ చూస్తుంటే అభ్యర్థి సీవీను చదవకుండా.. కాపీ పేస్ట్ చేసినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత సమాచారానికి బదులుగా టెంప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. చాట్‌జీపీటీ వచ్చిన తరువాత ఇలాంటి సీవీలు సర్వ సాధారణం అయిపోయాయని కొందరు చెబతున్నారు.Just received yet another job application. No wonder we have so much unemployment today :’) pic.twitter.com/c0VaGWYrIJ— Ananya Narang (@AnanyaNarang_) October 15, 2024 -
కోల్‌కతా: విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో బెంగాల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె ద్వారా తమ నిరసనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిపిన చర్చల అనంతరం 42 రోజుల విరామం తర్వాత జూనియర్ డాక్టర్లు బెంగాల్ వ్యాప్తంగా శనివారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇక.. తమ డిమాండ్లలో కొన్నింటికి సీఎం మమత ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. కానీ, ఔట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఇంకా విధుల్లో చేరలేదు.చదవండి: కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!‘‘ఈరోజు తిరిగి విధుల్లో చేరడం ప్రారంభించాం. జూనియర్ ఈ ఉదయం నుంచి అవసరమైన, అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాల్లో తిరిగి సేవలు ప్రారంభించారు.కానీ ఔట్ పేషెంట్ విభాగాల్లో ఇంకా చేరలేదు. ఇది పాక్షికంగా విధులను ప్రారంభించడం మాత్రమే. నా తోటి ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు బయలుదేరారు. అక్కడ ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించడానికి ‘అభయ క్లినిక్‌లు’(వైద్య శిబిరాలు) ప్రారంభిస్తారు’’ అని సమ్మె చేసిన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో తెలిపారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. అయితే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. కానీ, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. చదవండి: కోల్‌కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు -
‘నాకీ ఉద్యోగం కావాలి సర్.. లేదంటే నా లవర్‌ను పెళ్లి చేసుకోలేను’ వైరల్ స్టోరీ
చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల వేటలో పడటం, ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా తెలిసిందే. ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సంపాదించడానికి రక రకాల ప్రయత్నాలు చేయడమూ కొత్తేమీ కాదు. కానీ ఒక యువకుడు ఉద్యోగం కోసం వెరైటీగా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఇది వార్తల్లో నిలిచింది.hiring can be fun too 🥲 pic.twitter.com/6RnKnOWhIM— Dipalie (@dipalie_) June 13, 2024విషయం ఏమిటంటే.. ఉద్యోగ యత్నాల్లో భాగంగా రెజ్యూమేను శ్రద్ధగా తయారు చేసుకుంటాం. ఇందులో మనకు సంబంధించిన అన్ని నైపుణ్యాలను పొందు పరుస్తాం. అలా ఉద్యోగం ఇచ్చే వ్యక్తులను, సంస్థలను ఇంప్రెస్ చేయడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ స్టోరీలోని వ్యక్తి మాత్రం రెజ్యూమ్‌లో తాను సంబంధిత ఉద్యోగానికి ఎలా అర్హుడినో చెబుతూనే... తన ప్రేమ సంగతిని కూడా చెప్పుకొచ్చాడు. తనకీ ఉద్యోగం రాకపోతే తన చిన్నప్పటిని స్నేహితురాల్ని పెళ్లి చేసుకోలేను అంటూ మొరపెట్టుకున్నాడు. ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అని ఎందుకు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘నాకు ఈ పొజిషన్‌కి కావాల్సిన అన్ని నైపుణ్యలు నాకు ఉన్నాయి. నేను దీనికి 100 శాతం పర్ఫెక్ట్ అని అనిపిస్తోంది’’ అని రాశాడు. అలాగే ‘‘ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను నా చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే వాళ్ల నాన్న నాకు ఉద్యోగం లేకపోతే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయను అంటున్నాడు’’ అని రాసుకొచ్చాడు. అర్వా హెల్త్ ఫౌండర్, సీఈవో డిపాలీ బజాజ్ ఇటీవల ఒక అభ్యర్థి ఉద్యోగ దరఖాస్తు స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ‘ఫైరింగ్ కెన్ మీ ఫన్ టూ’ అనే క్యాప్షన్‌తో ఆమె దీన్ని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కొంతమంది అతని పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ‘వారిద్దరి జీవితాలు ఈ జాబ్‌పైనే ఆధారపడి ఉన్నాయి’ అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. అతని నిజాయితీని గర్తించైనా అతనికి ఉద్యోగం ఇవ్వాలంటూ మరొకరు కమెంట్ చేశారు. -
రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!
చదువు పూర్తవ్వగానే అందరూ చేసే పని జాబ్ సర్చింగ్. ఉద్యోగం వెతుక్కునే క్రమంలో తప్పకుండా 'రెజ్యూమ్' తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఇది ఓ పెద్ద సవాలుగా అనిపిస్తుంది. చదువు, వ్యక్తిగత వివరాలు వంటి విషయాలతో ఒక డాక్యుమెంట్ రూపొందించుకోవాలి. అయితే చాలామందికి ఎక్కడ నుంచి మొదలెట్టాలి, ఎక్కడ ముగించాలి, అనే చాలా విషయాలు తెలియక పోవచ్చు. చాట్‌జీపీటీ సహాయంతో ఇప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేయడం చాలా సులభమైపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం. చాట్‌జీపీటీలో సైన్ ఇన్ అవ్వడం - రెజ్యూమ్ క్రియేట్ చేయాలనుకునే వ్యక్తి మొదట బ్రౌజర్లో 'ఓపెన్ఏఐ' సర్చ్ చేయాలి. సర్చ్ చేసిన తరువాత చాట్‌జీపీటీ హోమ్‌పేజీలో సైన్ ఇన్ చేసుకోవాలి. చాట్‌జీపీటీని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, కాబట్టి సైన్ ఇన్ చాలా సులభంగా ఉంటుంది. ఆధార్, పాన్ వంటి వివరాలు దీనికి అవసరం లేదు. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి టెక్స్ట్ యాడ్ చేయడం - మీరు రెజ్యూమ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటి నుంచి చాట్‌జీపీటీ సర్చ్ బాక్స్‌లో కావలసిన విషయాలను టైప్ చేసి అడగవచ్చు. ఉదాహరణకు నేను రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అని టైప్ చేయగానే.. మీకు చాట్‌జీపీటీ సమాధానం అందిస్తుంది. అలా మీరు అడిగినదానికి చాట్‌జీపీటీ సమాధానాలు అందిస్తుంది. చాట్‌జీపీటీ అందించే సమాధానాల్లో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న తరువాత మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. దీని కోసం చాట్‌జీపీటీ అందించిన విషయాలను కాపీ చేసి వర్డ్ డాక్యుమెంట్స్ వంటి వాటిలో పేస్ట్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ అందించిన విషయాలను కాపీ పేస్ట్ చేసుకున్న తరువాత మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని, మీ వివరాలను ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేస్తూ మీ రెజ్యూమ్ పూర్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ కథనంలో చూడవచ్చు. -
రతన్ టాటా తొలి రెజ్యూమ్, ఎలా సిద్ధం చేశారంటే..
155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా ప్రపంచంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చాలామంది మాదిరిగానే రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన సారధ్యంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపార సంస్థగా ఎదిగింది. రతన్ టాటా తొలినాళ్లలో ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను ఎలా సిద్ధం చేశారు? ఉద్యోగం ఎలా దక్కించుకున్నారు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రతన్ టాటా మొదటి రెజ్యూమ్ అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. అయితే అతని గురువు, బంధువు అయిన జేఆర్డీ టాటాకు ఇది సంతృప్తి కలిగించలేదు. నాటి రోజులను రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు, ‘అతను(జేఆర్డీ టాటా) ఒక రోజు నాకు ఫోన్ చేశారు. మీరు భారతదేశంలో ఉంటూ, ఐబీఎంలోనే ఎందుకు ఉద్యోగం చేయడం?’ అని అడిగారు. దీంతో టాటా గ్రూప్‌లో ఉద్యోగం చేసేందుకు రతన్ టాటా తన రెజ్యూమ్‌ను జేఆర్డీ టాటాకు అందజేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అతని వద్ద రెజ్యూమ్ లేదు. వెంటనే రతన్ టాటా తాను పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ సాయంతో తన రెజ్యూమ్‌ను రూపొందించారు. తాను ఐబీఎం ఆఫీస్‌లో ఉన్నానని, తనను జేఆర్డీ టాటా రెజ్యూమ్ అడిగారనే విషయం తనకు గుర్తుందని ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పనిచేస్తున్న ఆఫీసులో ఎలక్ట్రిక్ టైప్ రైటర్లు ఉండటంతో ఒక రోజు సాయంత్రం ఆ టైప్ రైటర్ సాయంతో రెజ్యూమ్ టైప్ చేసి అతనికి ఇచ్చానని తెలిపారు. 1962లో మొదటి ఉద్యోగం రెజ్యూమెను అందించిన తర్వాత రతన్ టాటాకు 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం తర్వాత, 1991లో జేఆర్డీ టాటా మరణానంతరం రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్లలో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. నాటిరోజుల్లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడాలని రతన్‌టాటా భావించారు. అయితే తమ అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా? -
గూగుల్ జాబ్ అంత ఈజీ కాదు గురూ.. రెజ్యూమ్ ఇలా ఉంటే మాత్రం..
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. ఈ సంస్థలో పని చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అక్కడ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. గూగుల్ జాబ్ కోసం ఏటా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించడం కంటే గూగుల్‌లో జాబ్ కొట్టడం చాలా కష్టమని భావిస్తుంటారు. గూగుల్ జాబ్ కోసం తీవ్రమైన పోటీతో పాటు నియామక ప్రక్రియ కూడా అంత ఆషామాషి కాదు. జాబ్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల రెజ్యూమ్‌లోని ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ కంపెనీ రిక్రూటింగ్ విభాగంలో పనిచేసిన ఓ మాజీ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు కొన్ని కిటుకులను తెలియజేశారు. ఈ రెండు తప్పులు చేయొద్దు.. బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. నోలన్ చర్చ్ 2012 నుంచి 2015 వరకు గూగుల్ రిక్రూటర్‌గా పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. రెజ్యూమ్‌లో నివారించాల్సిన రెండు పెద్ద తప్పులను తెలియజేశారు. కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలను ఇవి దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వీటిలో మొదటిది సూటిగా లేని సమాచారం. అంటే మీ సామర్థ్యం, నైపుణ్యాల గురించి అర్థం కాకుండా పేరాలు పేరాలు రాయడం. మీ రెజ్యూమ్ ఇలా కనిపిస్తే నియామక ప్రక్రియలో ముందుకు వెళ్లే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.వ ఇదీ చదవండి ➤ Advice to Job seekers: ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన.. ఇక రెండవది స్పష్టత లేకపోవడం. అంటే మీరు మీ నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వ్యక్తీకరించాలి. మీరు మీ రెజ్యూమ్‌లో అలా చేయలేకపోతే, ఆఫీస్‌లో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరని ఇది సూచిస్తుంది. వీటిని అధిగమించడానికి చాట్‌జీపీటీ, గ్రామర్లీ వంటి ఏఐ సాధనాలను ఉపయోగించుకోవచ్చని చర్చ్ సూచించారు. కాగా వ్యయ నివారణలో భాగంగా గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో నియామకాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియలో మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా, తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. -
భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం
అవంతిపురా/శ్రీనగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం పునఃప్రారంభమైంది. రాహుల్ గాంధీ ఉదయం 9.20 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. భద్రతాపరమైన లోపాలున్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం యాత్రను నిలిపేయడం తెలిసిందే. దాంతో శనివారం మూడంచెల భద్రత కల్పించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో ఉగ్రవాద దాడిలో మరణించిన 40 సీఆర్పీఎఫ్ జవాన్లకు రాహుల్ గాంధీ శనివారం నివాళులర్పించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో బస్సు ధ్వంసమైన చోట పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. యాత్రలో ప్రియాంకా గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. శనివారం లెథ్‌పురాలో సోదరుడు రాహుల్ గాంధీపాటు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని చుర్సూలో పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం రాహుల్ గాంధీతోపాటు జోడో యాత్రలో పాల్గొన్నారు. తాజా గాలి పీల్చుకున్నట్లే ఉంది: ముఫ్తీ కశ్మీర్లో జోడో యాత్ర జరగడం తాజా గాలి పీల్చుకున్నట్లుగా ఉందని మెహబూబా ముఫ్తీ శనివారం ట్వీట్ చేశారు. 2019 తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారని చెప్పారు. యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడవడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జోడో యాత్ర ఆదివారం ఉదయం పంథాచౌక్ నుంచి పునఃప్రారంభం కానుంది. శ్రీనగర్‌లో బోలివార్డ్ రోడ్డులోని నెహ్రూ పార్కు వరకూ యాత్ర సాగుతుంది. సోమవారం శ్రీనగర్ ఎంఏ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జెండా ఎగురవేస్తారు. అనంతరం ఎస్కే స్టేడియంలో విపక్ష పార్టీల నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షాకు మల్లికార్జున ఖర్గే లేఖ జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో యాత్రకు తగిన భద్రత కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యాత్రలో భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. -
మ్యాడ్స్కిల్స్కు మహర్దశ.. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే?
మీరు కబడ్డీలో మేటి కావచ్చు. సంగీతంలో ఘనాపాఠీ కావచ్చు. సాహసాలు చేయడంలో ‘వారెవా’ అనిపించవచ్చు... అయితే ఇవి మీ అభిరుచి, ఆసక్తికి మాత్రమే పరిమితం కావడం లేదు. మీరు మంచి ఉద్యోగంలో ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించే శక్తులు అవుతున్నాయి. కాలంతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రమాణాలలో కూడా మార్పు వస్తోంది. ఉద్యోగం రావడానికి ఉపకరించే హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ విభాగాలకు ఇప్పుడు మూడో విభాగం కూడా తోడైంది. అదే... మ్యాడ్ స్కిల్స్. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే? ఉద్యోగప్రయత్నాలు చేసేవారి రెజ్యూమ్ లేదా సీవీలలో హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ అని రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది జ్ఞానాన్ని సర్టిఫికెట్లతో తూచే విషయం. రెండోది మార్కులు, ర్యాంకులతో పాటు నైపుణ్యబలాన్ని అంచనావేయడం. ఇప్పుడు ఈ రెండు విభాగాలతో పాటు ‘మ్యాడ్ స్కిల్స్’ అనే మూడో విభాగం కూడా తోడైంది. మ్యాడ్ స్కిల్స్ అనగానే వ్యంగ్యం, వ్యతిరేకత ధ్వనించవచ్చుగానీ... ఇక్కడ మ్యాడ్ స్కిల్స్ అంటే ‘పనికిరాని వృథా స్కిల్స్’ అని అర్థం కాదు. ఉద్యోగుల ఎంపికకు సంబంధించి కంపెనీల నిర్ణయాలలో ‘మ్యాడ్ స్కిల్స్’ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ కంటే ‘మ్యాడ్ స్కిల్స్’ను అరుదైన, అవసరమైన స్కిల్స్గా భావిస్తున్నాయి కంపెనీలు. ఒక మేనేజర్ పోస్ట్ ఎంపికలో అభ్యర్ధి అభిరుచులపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది గతంలో అంతగా లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం అది ఒక అనివార్యమైన విషయం అయింది. రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌లు రెజ్యూమ్‌లోని ‘హాబీస్ అండ్ ట్రావెల్స్’ స్పేస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘మ్యాడ్ స్కిల్స్’ను కంపెనీలు తమ ప్రత్యేక ఆస్తిగా భావించుకోవడానికి కారణం అవి క్రియేటివ్ స్కిల్స్ రూపంలో తమ కంపెనీకి తోడ్పడతాయనే నమ్మకం. ఉదాహరణకు కీర్తి అనే అమ్మాయి ఒక కంపెనీలో ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది అనుకుందాం. కీర్తికి ‘ట్రెక్కింగ్’ హాబీ ఉంది. అయితే ఉద్యోగ ఎంపికలో అది ఆమె వ్యక్తిగత అభిరుచికి సంబధించిన గుర్తింపుకే పరిమితం కావడం లేదు. ఈ అభిరుచి ద్వారా కంపెనీలు తన వ్యక్తిత్వాన్ని అంచనావేయడానికి ఉపయోగపడుతుంది. ‘కొత్త ప్రదేశాలలో సర్దుకుపోగలదు’ ‘సవాళ్లను స్వీకరించగలదు’ ‘అందరితో కలిసిపోయే స్వభావం ఉంది’.. ఇలా కీర్తి గురించి కొన్ని అంచనాలకు రావడానికి వీలవుతుంది. ‘ఒక మేనేజర్ పోస్ట్‌కు పదిమంది వ్యక్తులు పోటీ పడితే, అందరి బలాలు సమానంగా ఉన్నాయనుకున్నప్పుడు మ్యాడ్ స్కిల్స్ కీలకం అవుతాయి. అభిరుచుల ఆధారంగా వ్యక్తిత్వంపై ఒక అంచనాకు రావడానికి ఇవి తోడ్పడతాయి. విభిన్నమైన అభిరుచులు, నైపుణ్యాలు, బలమైన వ్యక్తిత్వం, పర్సనల్ ప్రాజెక్ట్‌లకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటుంది ‘యూ విల్ బీ ఏ మేనేజర్ మై సన్’ పుస్తక రచయిత్రి సాండ్రిన్. ఆటలు (ఫుట్‌బాల్ నుంచి చెస్ బాక్సింగ్ వరకు), ఆర్టిస్టిక్ యాక్టివిటీస్(రచనలు చేయడం నుంచి పాటలు పాడడం వరకు), ప్రధాన స్రవంతికి భిన్నంగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం ... ఇలా ఎన్నో మ్యాడ్‌స్కిల్స్ (యూనిక్ క్రియేటివ్ స్కిల్స్) విభాగంలోకి వస్తాయి. ‘జాబ్ ఔట్లుక్ 2022’ సర్వే ప్రకారం ఉద్యోగ ఎంపికలో బడా కంపెనీలు ప్రాబ్లమ్ సాల్వింగ్–స్కిల్స్, ‘ ఇది మాత్రమే నా పని’ అని కాకుండా ఇతరత్రా విషయాలలో ‘చొరవ’ చూపించే నైపుణ్యం, రచన, కమ్యూనికేషన్ స్కిల్స్... మొదలైవాటికి అగ్రస్థానం ఇస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన వేర్లు ‘మ్యాడ్ స్కిల్స్’లోనే ఉన్నాయి! అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రతిధ్వనించిన ఎక్స్ప్రెషన్ మ్యాడ్ స్కిల్స్. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు ఉద్యోగ ఎంపికలో మ్యాడ్ స్కిల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌లో కూడా ఉద్యోగ ఎంపికలో ‘మ్యాడ్ స్కిల్స్’ ట్రెండ్‌గా మారింది. ‘మంచి మార్కులు, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిౖయెన సమాధానాలు చెప్పడం అనేవి ఉద్యోగ ఎంపికలో కీలక పాత్ర పోషించినప్పటికీ, మ్యాడ్‌స్కిల్స్ ప్రాధాన్యత వేరు. కంపెనీ అభివృద్ధి చెందాలంటే భిన్నంగా ఆలోచించేవారు ఉండాలి. వారి నుంచే కంపెనీ అభివృద్ధికి అవసరమైన సృజనాత్మక ఐడియాలు వస్తాయి. హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ద్వారా అభ్యర్థిని సులభంగా అంచనా వేయవచ్చు. అయితే మ్యాడ్‌స్కిల్స్ ద్వారా అది అంత సులభం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు’ అంటున్నారు విశ్లేషకులు. ‘సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు ఇష్టం. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి సేవాకార్యక్రమాలు కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి అనే విషయం తెలిశాక సంతోషం వేసింది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్. (క్లిక్ చేయండి: వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?) -
Papikondalu Tour: పాపికొండలు.. షికారుకు సిద్ధం
రంపచోడవరం: గోదావరి వరదలతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్దిరోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో చాలాకాలం పాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఏపీ టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గత ఏడాది డిసెంబర్ 18న అధికారికంగా పర్యాటకానికి అనుమతులు ఇచ్చారు. పోలవరం కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు. ► ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది. ►జూన్ నెలలోనే కాపర్‌డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు. ఉపాధిపై ప్రభావం పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి పట్టాలెక్కనుండటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బోట్లకు ఎన్వోసీ జారీ రాష్ట్ర పర్యాటకశాఖ జీఎం నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద 12 బోట్లను, వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లను తనిఖీ చేశారు. వీటికి ఎన్వోసీలను కూడా ఇటీవల జారీ చేశారు. 32 అడుగులకు అనుమతి ఇవ్వాలి గోదావరిలో నీటి మట్టం 32 అడుగుల లోపు వరకు పర్యాటక బోట్లు నదిలోకి తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఈమేరకు ఇరిగేషన్ అధికారులను కోరాం. 30 అడుగుల వరకు అనుమతి ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. మరో కొద్దిరోజుల్లో పాపికొండల పర్యాటకానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. –కొత్తా రామ్మోహన్రావు, బోట్ యజమానుల సంఘ ప్రతినిధి అనుకూలంగా నీటిమట్టం గత మూడు నెలలుగా నిలిచిన పాపికొండలు పర్యాటకం మరో వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనమతులు మాత్రమే రావాల్సి ఉంది. పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటకులు బోట్ ఎక్కేందుకు అనువుగా ఉంటే సరిపోతుంది. కాపర్ డ్యామ్ వద్ద బోట్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది. –పి నాగరాజు, ఇన్చార్జి, టూరిజం కంట్రోల్ రూమ్ -
Interview Tip: ఆమె థింకింగ్ వేరె లెవల్.. జాబ్ కోసం ఇలా కూడా చేస్తారా?
ఒక పనిని ఒకే విధంగా చేయాలి అనే రూలేమీ లేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు తమ వినూత్న ఆలోచనతో పనిచేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చాలా స్మార్ట్‌గా ఆలోచించింది. అందులో భాగంగానే కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసి.. కంపెనీకి పంపించింది. ఆమె చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. నార్త్ కరోలీనాకు చెందిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్బర్న్ అనే మహిళ సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసింది. అనంతరం, ఆ కేక్‌ను ప్రముఖ సంస్థ ‘నైకీ’కి పంపించింది. ఈ సందర్భంగా ఆమె.. ఎందుకు ఇలా చేశానో సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కొన్ని వారాల క్రితం తాను కేక్‌పై రాసిన రెజ్యూమ్ని నైకీ కంపెనీకి పంపినట్లు పేర్కొంది. నైకీ కంపెనీ టీం ప్రస్తుతం ఎలాంటి పోస్ట్‌లకు రిక్రూట్ చేసుకోవడం లేదని తెలిపింది. అయితే, తన గురించి నైకీ కంపెనీలో ఉద్యోగం సాధించడమే తన టార్గెట్ అని పేర్కొంది. ఈ విషయం నైకీ టీంకి తెలియజేయడం కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఇలా చేసినట్టు చెప్పింది. అందుకే కేక్‌పై రెజ్యూమ్ ప్రింట్ చేసి పంపినట్లు వివరించింది. నైకీ కంపెనీ హెడ్ ఆఫీసులో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని తనను తాను సమర్ధించుకుంది. కాగా, ఆమె చేసిన కేక్ రెజ్యూమ్ ఆలోచన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొంతమంది ఆమె ఆలోచనను మెచ్చుకున్నారు. కంపెనీ యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు అద్భుతమైన కాన్సెప్ట్ అని అన్నారు. మరికొంత మంది మాత్రం ఆమె జిమ్మిక్స్ చేస్తుందంటూ కామెంట్స్ చేశారు. Did you like Karly's idea?https://t.co/tr4SAmwLD6 — IndiaToday (@IndiaToday) September 27, 2022 -
Bill Gates Resume: రెజ్యూమ్ అంటే అట్లుంటది: బిల్‌గేట్స్ పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం విశేషంగా ఆకట్టుకుంటోంది. 48 ఏళ్ల పాత రెజ్యూమ్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన రెజ్యూమ్‌ను శుక్రవారం సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేశారు. ‘‘మీలో ఎవరైనా ఇటీవల గ్రాడ్యుయేట్ అయినా లేదా కాలేజీ డ్రాపౌట్ అయినా, మీ రెజ్యూమ్ 48 సంవత్సరాల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన తన పోస్ట్‌లో చెప్పారు. 1973 నాటి విలియం హెన్రీ గేట్స్ (బిల్ గేట్స్) రెజ్యూమ్ చూసి మంచి రెజ్యూమ్ కోసం వెబ్సైట్లు కన్సల్టెంట్లను వెతుక్కునే యూత్ అంతా వావ్ అంటోంది. సుమారు 48 ఏళ్ల క్రితం తాను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అప్పటి రెజ్యూమ్‌ను మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.1973లో బిల్‌గేట్స్ హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై లింక్డిన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక-పేజీ రెజ్యూమ్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది. మన జీవితంలో మనం ఎంత సాధించామో చాలాసార్లు మర్చిపోతాం. అందుకే అలాంటి జ్ఞాపకాలం కోసం గత రెజ్యూమ్‌ల కాపీలను దాచుకోవాలని ఒకరు, అది రెజ్యూమ్‌లా లేదు ప్రామిసరీ నోట్‌గా ఉందని మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. -
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
-
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
సాక్షి,ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మంచిరోజులు రానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచే దేశీయ విమాన సర్వీసులను పున:ప్రారంభించనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని జలాన్ కల్రాక్ కన్సార్షియం వెల్లడించింది. నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని మురళీ జలాన్ ఇటీవల వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్నాయి. చదవండి : Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే -
రాణె యాత్ర పునఃప్రారంభం త్వరలో
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం తరువాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తన జన్ ఆశీర్వాద్ యాత్రను మళ్లీ ప్రారంభించనున్నారని బుధవారం ఆయన అనుచరులు తెలిపారు. త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందని వారు పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాణె అనుచరుడు రజన్ తెలి తెలిపారు. గతంలో ప్రకటించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చదవండి: Shiv Sena-Narayan Rane: రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం, పరిస్థితి ఉద్రిక్తం ఇటీవలే కేంద్ర కేబినెట్లోకి చేరిన రాణె ఆగస్ట్ 19వ తేదీన ముంబైలో తన జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడు రోజులు పాటు సాగే ఈ యాత్ర సింధుదుర్గ్‌లో ముగియాల్సి ఉంది. అయితే, సోమవారం రాయ్‌గఢ్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియనందుకు ఉద్ధవ్ చెంప పగలకొడతానని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపింది. ఆయనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. శివసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆయనకు మహాడ్‌లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చదవండి : నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె -
స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు వేలం.. ఎంతో తెలుసా?
లండన్: స్టీవ్ జాబ్స్ అంటే తెలియనివారు ఉండరు. స్టార్టప్ కంపెనీలను స్ధాపించే వారికి స్టీవ్ ఏంతో ఆదర్శం. ప్రారంభంలో అతను కూడా ఒక కంపెనీలో ఉద్యోగిగా చేరి, ఆపిల్ కంపెనీ స్థాపించడంలో ఎంతగానో కృషి చేశారు. అమెరికాలోని పోర్ట్ ల్యాండ్‌కు చెందిన రీడ్ కాలేజీ నుంచి తప్పుకున్న తరువాత ఉద్యోగం నిమిత్తం స్టీవ్ ఓ ఉద్యోగానికి చేశాడు. కంప్యూటర్ డిజైన్ టెక్నీషియన్‌తో పాటు, ఇంగ్లీష్ లిటరేచర్ను తన నైపుణ్యంగా అప్లికేషన్లో పేర్కొన్నాడు. 1973లో చేసిన ఈ దరఖాస్తును యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేయగా భారీ ధరకు అమ్ముడైంది. స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ. 1.6 కోట్లకు వేలంలో విక్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన బిడ్డింగ్ మార్చి 24న ముగిసింది. కాగా, స్టీవ్ అప్లికేషన్ వేలంలో ఇంత ధరకు అమ్ముడవడం ఇదే మొదటిసారి కాదు, గతం లో 2018 లో ఓ ఐటీకంపెనీ వ్యవస్థాపకుడు కొనుగోలు చేశాడు. ఆ ఇద్దరూ కలుసుకుంది అక్కడే.. 1974 లో అటారీ కంపెనీలో చేరిన స్టీవ్ జాబ్స్ తన ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌ను అక్కడే కలిశాడు. జాబ్స్, వోజ్నియాక్ 1976 లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో జాబ్స్ గ్యారేజీలో ఆపిల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. స్టీవ్ జాబ్స్ 2011లో కాన్సర్‌తో మరణించారు. చదవండి: ఆపిల్ సంస్థకు భారీ జరిమానా -
‘జులై నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9000కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి. చదవండి : క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు.. -
అనేకచోట్ల టికెట్ బుకింగ్ కౌంటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో శుక్రవారం నుంచి రైలు టికెట్ల బుకింగ్ పునఃప్రారంభం కానుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ రెండు, మూడు రోజుల్లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రారంభం కానున్నాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కౌంటర్ల వద్ద జనం గుమికూడరాదన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. త్వరలోనే మరిన్ని రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 ఏసీ, నాన్ ఏసీ రైళ్ల కోసం గురువారం బుకింగ్స్ ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే 4 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి దాకా 2,050 శ్రామిక్ రైళ్ల ద్వారా 30 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు తమ కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు సహకరించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటిదాకా 225 స్టేషన్లలో ఉన్న 5 వేల బోగీలను కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చిందని తెలిపారు. -
25న దేశీయ విమాన సర్వీసులు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ విమాన సర్వీసులు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కట్టడికి మార్చి 25న దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవనున్నాయి. మే 25 సోమవారం నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్‌కు సమాచారం అందించామని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ట్వీట్ చేశారు. ఇక విమాన ప్రయాణీకులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలు, మార్గదర్శకాలను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుందని ట్వీట్లో తెలిపారు. విమానాల్లో తక్కువ సీట్లను అమర్చడంతో పాటు మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా పలు చర్యలు చేపడతారు. చదవండి : విదేశాల నుంచి భారత్‌కు విమానాల రాక -
ఒక్క ఆలోచన.. వంద అవకాశాలు
ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో దాదాపు ప్రతి ఒక్కరికి అనుభవమే. అలాంటిది.. ఓ కంపెనీ తీసేసిన తర్వాత మరో చోట ఉద్యోగం పొందడం అంటే మాటలు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే పాట్రిక్ హోగ్లాండ్ అనే వ్యక్తికి ఎదురయ్యింది. రెజ్యూమ్ పట్టుకుని ఎన్నో చోట్ల తిరిగాడు. ఫలితం లేదు. తీవ్ర నిరాశకు లోనైన సమయంలో అతనికి వచ్చిన ఓ వినూత్న ఆలోచన అతడిని తిరిగి ఉద్యోగస్తుడిగా మార్చింది. ఆ వివరాలు ఏంటో అతడి మాటల్లోనే.. ‘గతంలో నేను పని చేస్తున్న కంపెనీ నన్ను ఉద్యోగంలోంచి తీసేసింది. నెల రోజులు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. నాకు ఓ కుమారుడు. ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. దాంతో తిరిగి ఉద్యోగాన్వేషణలో పడ్డాను. ఆన్లైన్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయడం.. కంపెనీల చుట్టూ తిరగడం ఇలా చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ప్రతి చోట నిరాశే ఎదురయ్యింది. ఏం చేయాలో పాలుపోలేదు. అలా ఉన్న సమయంలో నాకొక వినూత్న ఆలోచన వచ్చింది’ అన్నారు పాట్రిక్. ‘దాని ప్రకారం పదుల సంఖ్యలో రెజ్యూమ్‌లను ప్రింట్ తీయించాను. తర్వాత ‘నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. దయచేసి ఓ రెజ్యూమ్ తీసుకొండి’ అని రాసి ఉన్న ఓ ప్ల కార్డు పట్టుకుని రద్దీగా ఉండే ప్రాంతంలో నిలబడే వాడిని. వచ్చి పోయే వారిని ఆపి నా గురించి చెప్పేవాడిని. తొలుత జనాలు నన్ను చూసి నవ్వేవారు. కానీ తర్వాత నా ప్రయత్నం గురించి ఆలోచించేవారు. ఈ క్రమంలో మెలిస్సా డిజియాన్ఫిలిప్పో అనే ఓ వ్యక్తి ద్వారా నా ప్రయత్నం సోషల్ మీడియాకు ఎక్కడం, ఉద్యోగం పొందడం జరిగాయి’ అన్నాడు పాట్రిక్. ఈ విషయం గురించి మెలిస్సా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ‘ఓ రోజు నేను ఆఫీస్‌కు వెళ్తుండగా.. పాట్రిక్ కనిపించాడు. ఎర్రటి ఎండలో.. చెరగని చిరునవ్వుతో రోడ్డు మీద వచ్చిపోయే వారిని ఆపి.. తన ప్రయత్నం గురించి చెప్తూ.. రెజ్యూమ్ ఇస్తున్నాడు. అతని ఆలోచన నాకు నచ్చింది. దాంతో రెజ్యూమ్ తీసుకుని.. నాకు తెలిసిన వారి కంపెనీలకు పంపించాను. మీరు కూడా తనకు సాయం చేయండి’ అంటూ మెలిస్సా తన ఫేస్బుక్లో పాట్రిక్ రెజ్యూమ్ని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు ఊహించనంత స్పందన వచ్చింది. చాలా మంది పాట్రిక్ ప్రయత్నాన్ని మెచ్చుకోవడమే కాక.. తమకు తెలిసిన చోటల్లా పాట్రిక్ గురించి చెప్పడం ప్రారంభించారు. చాలా కొద్ది రోజుల్లోనే పాట్రిక్‌కు ఉద్యోగం ఇస్తామంటూ చాలా మంది ముందుకు వచ్చారు. ప్రస్తుతం పాట్రిక్ ఓ మహిళా కాంట్రక్టర్ దగ్గర ఉద్యోగంలో చేరాడు. తనకు సాయం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు పాట్రిక్. ప్రస్తుతం ఈ స్టోరి ఫేస్బుక్లో తెగ ట్రెండ్ అవుతోంది. -
వైరల్.. ఇలాంటి రెజ్యూమ్ చూస్తే ఇక అంతే
లండన్ : రెజ్యూమ్ అనేది మన ప్రతిభ గురించి అవతలి వారికి తెలియజేసి, మన గురించి ఒక సదాభిప్రాయాన్ని ఏర్పర్చడం కోసం తయారుచేసేది. అందుకే రెజ్యూమ్‌లో ఎవరి గురించి వారు కాస్తా డబ్బా కొట్టుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ తండ్రి రాసిన రెజ్యూమ్ని చూస్తే జాబ్ మాట దేవుడెరుగు.. కనీసం ఇంటర్వ్యూకు కూడా పిలవరు. అంత దారుణంగా ఏం రాశాడా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి. బ్రిటన్‌కు చెందిన ఒక యువతి తన కోసం రెజ్యూమ్ రాసివ్వమని తన తండ్రిని అడిగింది. అందుకు తండ్రి కూతురు కోసం అద్భుతమైన రెజ్యూమ్ని తయారు చేసిచ్చాడు. ఆ తండ్రి రాసిన రెజ్యూమ్ కూతురుకు జాబ్ తెచ్చిపెడుతుందో లేదో తెలీదు కానీ నెటిజన్లను మాత్రం కడుపుబ్బ నవ్విస్తోంది. అయ్యో కూతురు గురించి నలుగురు నవ్వుకునేలా రాస్తాడా అంటూ కోప్పడకండి. ఎందుకంటే ఆ తండ్రి తన కూతురు గురించి చాలా నిజాయితీగా.. నిజాలు మాత్రమే రాసాడు. దాంతో సదరు రెజ్యూమ్ ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇంతకూ ఆ రెజ్యూమ్‌లో ఏం ఉందంటే.. క్వాలిఫికేషన్ వివరాల దగ్గర కూతురుకి ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయనేది మాత్రమే కాక, ఎన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్ అయ్యిందనే విషయాన్ని కూడా రాశాడు. బాధ్యతల దగ్గర.. చెప్పిన మాట వినకపోవడం, ఫేస్బుక్లో బ్రౌజ్ చేయడం, ముఖ్యమైన పత్రాలను పోగొట్టడం, విలువైన సమాచారాన్ని శత్రువులకు చేరవేయడం అని తెలిపాడు. ఇక విధుల్లో భాగంగా బంగారం గురించి అన్వేషిస్తూ.. తవ్వకాలు జరపడం, తల ఎగరేయడం, ఇతరుల పట్ల దారుణంగా ప్రవర్తించడం అని రాశాడు. ఇక వ్యక్తిగత నైపుణ్యాల్లో బద్దకస్తురాలు, మొద్దు, జగమొండి, గర్వంగా ప్రవర్తిస్తుంది అని తెలిపాడు. అయితే తండ్రి తన గురించి ఇంత నిజాయితీగా రెజ్యూమ్ని తయారు చేయడంతో కూతురు కూడా అంతే నిజాయితీగా ఆ రెజ్యూమ్ని ఇంటర్నెట్లో షేర్ చేసింది. దాంతో నెటిజన్లు ఈ రెజ్యూమ్ని గోల్డ్ అంటూ, ఆమె తండ్రిని ఫాదర్ ఆఫ్ ద ఇయర్‌గా కీర్తిస్తూ కామెంట్ చేస్తున్నారు. -
మూడు నెలల విరామం తరువాత
సాక్షి, న్యూఢిల్లీ: మూడునెలల విరామం తరువాత కేంద్ర ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ (65) తిరిగి బాధ్యతల్లో చేరారు. మూత్రపిండ మార్పిడి కోసం ఇటీవల ఆసుపత్రిలో చేరిన జైట్లీ కోలుకున్న అనంతరం గురువారం కార్యాలయానికి హాజరయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే నార్త్ బ్లాక్ మొదటి-అంతస్తులోని జైట్లీ కార్యాలయాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా పూర్తిగా పునరుద్ధించినట్టు తెలుస్తోంది. జైట్లీ ఆగస్టు9 న జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తన ఓటు వేశారు. అలాగే సోషల్మీడియాలోచురుకుగా వుంటూ జీఎస్టీసహా ఇతర ఆర్థిక రాజకీయ, సామాజిక అంశాలపై తన స్పందనను తెలియజ్తేసున్నారు. సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ మృతిపై ఆయన సంతాపాన్ని తెలుపుతూ గురువారం ట్వీట్ చేశారు. దీర్ఘకాలికంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడ్డారు. వ్యాధి తీవ్రం కావడంతో వైద్య అవసరాల రీత్యా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెలవులో ఉన్నారు. మే14న ఆయనకు మూత్రి పిండ మార్పడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఆర్థికమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు సమాయత్తమయ్యారు. ఈ విరామ సమయంలో జైట్లీ స్థానంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. Saddened by the death of the veteran Journalist Sh. Kuldip Nayar. His contribution to the cause of free speech is unparalleled. He is credited with breaking some of the most exclusive news stories. Will be best remembered for his struggle against the emergency. — Arun Jaitley (@arunjaitley) August 23, 2018 -
బార్కోడ్లో రెజ్యూమ్! వీడియోలో ఇంటర్వ్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా, ఉబర్ వంటి రెంటల్ కార్ల బుకింగ్ ఎలా చేయాలో మనకందరికీ తెలిసిందే! అచ్చం అలాగే కంపెనీల ఉద్యోగ నియామకాలూ ఉంటే! ఖాళీగా ఉన్న జాబ్స్ వివరాలు అభ్యర్థులకు.. అలాగే విద్యార్హతలతో కూడిన అభ్యర్థుల వివరాలు కంపెనీలకూ గూగుల్ మ్యాప్స్‌లో దర్శనమిస్తుంటే? ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. బెంగళూరుకు చెందిన హలోజాబ్స్ అనే స్టార్టప్ ఈ నియామక టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉందని, ఏడాదిలో విపణిలోకి విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు హలోజాబ్స్ ఫౌండర్ శ్రీనివాస్ వరాహగిరి. మరిన్ని వివరాలను ఆయన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా చింతలపల్లి గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తయ్యాక... పలు ప్రైవేట్ కంపెనీల్లో హెచ్ఆర్, ఫైనాన్స్ విభాగంలో కీలక స్థాయిల్లో పనిచేశా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడిని కూడా. హెచ్ఆర్లో పని చేయటం వల్లే కావొచ్చు... ఉద్యోగ నియామక ప్రక్రియలోని సమస్యలను క్షుణ్నంగా తెలుసుకునే వీలు కలిగింది. టెక్నాలజీతో మానవ వనరుల విభాగం అవసరాలను సులభతరం చేయాలని నిర్ణయించుకొని.. రూ.25 లక్షల పెట్టుబడితో 2016 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా హలోజాబ్స్ను ప్రారంభించా. బార్కోడ్లో రెజ్యూమ్.. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. పేజీలకు పేజీలు రెజ్యూమ్‌లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా హలోజాబ్స్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఏటీఎం కార్డు తరహాలో ఉచితంగా క్యూఆర్ కోడ్‌తో విజువల్ రెజ్యూమ్ (వీఆర్) గుర్తింపు కార్డును అందిస్తాం. ఇందులో అభ్యర్థి విద్యా సంబంధమైన వివరాలతో పాటు, నైపుణ్యం, అనుభవం వంటి కీలక సమాచారాన్ని సులువుగా గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. పైగా అభ్యర్థుల సర్టిఫికెట్స్, వ్యక్తిగత వివరాలు ధ్రువీకరణ ప్రక్రియ అంతా హలోజాబ్స్ చేసి బార్కోడ్లో నిక్షిప్తం చేస్తాం. కంపెనీలు తమ మొబైల్ ఫోన్‌తో ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేసినా లేదా ఫొటో తీసినా సరే వెంటనే అభ్యర్థి రెజ్యూమ్ ఫోన్ లేదా డెస్క్‌టాప్‌లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురించి మళ్లీ కంపెనీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముండదు. వీడియోలోనే ఇంటర్వ్యూలు.. విజువల్ రెజ్యూమ్‌తో పాటూ వీడియో ఇంటర్వ్యూ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. త్వరలోనే విపణిలోకి విడుదల చేయనున్నాం. ఇదేంటంటే... అభ్యర్థులు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా నేరుగా ఇంటర్వ్యూ కు హాజరయ్యే అవకాశముంటుంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నైల్లో సేవలందిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, పుణె, అహ్మదాబాద్ నగరాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం హలోజాబ్స్లో 3 లక్షల మంది అభ్యర్థులు, 140 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో ప్రణవ హెల్త్‌కేర్, కాన్కార్డ్ ఆటోమేషన్, డిజిటల్ అకాడమీ వంటివి కొన్ని. ఏపీ, తెలంగాణ నుంచి 40 వేల అభ్యర్థులుంటారు. ఇప్పటివరకు హలోజాబ్స్ వేదికగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయి. రూ.5 కోట్ల ఆదాయం లక్ష్యం.. మా ఆదాయ మార్గం రెండు విధాలుగా ఉంటుంది. ఒక ఉద్యోగ నియామక ప్రకటనకు రూ.250 ఉంటుంది. అలా కాకుండా నమోదైన అభ్యర్థుల డేటాబేస్ పొందాలంటే లక్ష రూపాయల వరకు ఉంటుంది. డేటాబేస్‌తో కంపెనీలు వాళ్లకు కావాల్సిన అభ్యర్థిని ఎంచుకునే వీలుంటుంది. కంపెనీల తరఫున ఇంటర్వ్యూ హలోజాబ్స్ చేసి పెడుతుంది. ఎంపికైన అభ్యర్థికిచ్చే ప్యాకేజ్‌లో 5–8.3 శాతం కంపెనీ నుంచి కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 5 వేల మంది అభ్యర్థులు నమోదవుతున్నారు. 2,500 జాబ్ పోస్టింగ్స్ అవుతున్నాయి. సుమారు 100 ఇంటర్వ్యూలు చేస్తున్నాం. రూ.25 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం నెలకు రూ.15 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. 15% వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.5 కోట్ల టర్నోవర్, 2020 నాటికి రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 25 లక్షల మంది అభ్యర్థులకు, సింగపూర్, మలేషియా దేశాలకు విస్తరించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం మా కంపెనీలో 36 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.25 కోట్ల నిధులను సమీకరిస్తామని’’ శ్రీనివాస్ వివరించారు. -
నాణేల ముద్రణను పునరుద్ధరించండి: కేంద్రం
కోల్‌కతా: నాణేల ముద్రణ నిలిపేయాలంటూ దేశంలోని నాలుగు నాణేల ముద్రణ కేంద్రాలకు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాణేల ముద్రణను తిరిగి ప్రారంభించాలని, అయితే ముద్రణ వేగాన్ని తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)కు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీఎంసీఐఎల్ పరిధిలో ఉన్న 4 ముద్రణా కేంద్రాల్లో గతంలో లాగా 2 షిఫ్టుల్లో కాకుండా ఒక్క షిఫ్టులోనే ముద్రణ కొనసాగించాలని తెలిపింది. 2017–18కి గాను 7,712 మిలియన్ల నాణేలు ముద్రించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు తమకు జారీ చేసిన ఇండెంట్లో పేర్కొంది. బ్యాంకుల్లో స్థలం లేనికారణంగా నాణేల ముద్రణ నిలిపేయాలంటూ ఈ నెల 9న కేంద్రం ఎస్పీఎంసీఐఎల్కు ఆదేశాలిచ్చింది. -
ఉద్యోగం కోసం రెజ్యూమ్ ఫన్నీ వీడియో
-
సెహ్వాగ్ రెజ్యూమ్.. బిత్తరపోయిన బీసీసీఐ!
సెహ్వాగ్ అంటే సెహ్వాగే. మైదానంలో చెలరేగి ఆడినా, ట్విట్టర్లో కితకితలు పెట్టే జోక్స్ పేల్చినా అతని స్టైల్ అతనిదే. అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. ప్రతిష్టాత్మకమైన భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి అతడు పంపించిన రెజ్యూమ్ చూసి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బిత్తరపోయింది. కేవలం రెండంటే రెండే లైన్లలో కోచ్ పదవి కోసం వీరేందర్ సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. ‘ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటర్, కోచ్‌గా ఉన్నాను. ఈ (టీమిండియా) బాయ్స్ అందరితో ఆడాను’ అంటూ సెహ్వాగ్ తన రెండు లైన్ల అప్లికేషన్లో పేర్కొన్నాడు. ఈ దరఖాస్తు చూసి విస్తుపోయిన బీసీసీఐ అధికారులు.. పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను, రెజ్యూమ్‌ను పంపించమంటూ అతన్ని బతిమిలాడుకొని ఒప్పించారు. ‘సెహ్వాగ్ రెండులైన్ల దరఖాస్తును పంపించాడు. దానికి అనుబంధంగా రెజ్యూమ్ కూడా పంపలేదు. దీంతో దరఖాస్తుతోపాటు రెజ్యూమ్ కూడా పంపాల్సిందిగా మేం అతన్ని అడిగాం. అతను ఈ పదవి కోసం తొలిసారి ఇంటర్వ్యూ హాజరవుతున్నాడు’ అని బీసీసీఐకి చెందిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రస్తుత కోచ్ అనిల్కుంబ్లేతోపాటు సెహ్వాగ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్, డొమెస్టిక్ వెటరన్ లాల్‌చంద్ రాజ్‌పుత్ తదితరులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కుంబ్లేతో సహా వీరంతా సీఏసీ ఎదుట ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. -
నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు
-
కశ్మీర్లో మళ్లీ రైలు సర్వీసు
-
రెజ్యూమ్ తో జాబ్ సంపాదించాడు!
ఉద్యోగం కోసం రెజ్యూమ్ లు పట్టుకుని ఇంటర్వూల కోసం కంపెనీల చుట్టూ నిరుద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్న ఈ రోజుల్లో బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడు కేవలం రెజ్యూమ్ ని క్రియేటివ్ గా తయారుచేసి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఇంటర్వూ లేకుండానే జాబ్ సంపాదించాడు. జైన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంబీఏ పూర్తి చేసిన సుముఖ్ మెహతా(21) తన రెజ్యూమ్ తో బ్రిటిష్ మ్యాగజైన్ జీక్యూలో జాబ్ సంపాదించాడు. దీనిపై మాట్లాడిన మెహతా నేటి పోటీప్రపంచంలో ప్రతి ఒక్క విషయాన్ని క్రియేటివ్ గా ఆలోచించడం చాలా కష్టమని అన్నారు. తాను క్రియేటివ్ గా ఆలోచించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. ఎంబీఏ చదివే రోజుల్లో ఎప్పుడూ బోర్ కొట్టించే రెజ్యూమ్ లతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చిందని, ఇన్ఫోగ్రాఫిక్స్ సాయంతో తయారు చేసిన వాటిని డిపార్ట్ మెంట్ డీన్ కు చూపించేవాడినని తెలిపారు. ఆయన బాగున్నాయని చెప్పి ఆ ఏడాది బీ-స్కూల్ విద్యార్థుల రెజ్యూమ్ లు అన్నీ తనతో చేయమన్నట్లు వివరించారు. కాగా, చివరిగా తనకోసం రెజ్యూమ్ తయారుచేసుకున్న'ఎక్స్-ఫ్యాక్టర్' రెజ్యూమ్ తో జీక్యూలో ఇంటర్వూ లేకుండా కొలువు సాధించాడు. -
మళ్లీ బడికి
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఏ ఏటికాయేడు కలగా మిగులుతున్న వసతుల కల్పన డీఎస్సీ నియామకాలు పూర్తయినా ప్రగతి శూన్యం యూనిఫాం పంపిణీపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం వచ్చినా స్కూళ్లకు చేరని 21లక్షల పాఠ్య పుస్తకాలు గుంటూరు ఎడ్యుకేషన్ : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు పుస్తకాలు చేతపుచ్చుకుని తిరిగి పాఠశాలకు వెళ్లాల్సిన సమయం ఇది. ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి పర్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, బెంచీలు, సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు కల్పన ఏ ఏటికాయేడు కలగానే మిగిలి పోతోంది. డీఎస్సీ-2014 నియామకాల ద్వారా జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని భావించినా అది సఫలీకృతం కాలేదు. 671 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లలో 322 మందికి పాఠశాలల్లో ఖాళీలు లేవని పోస్టింగ్స్ కల్పించకపోవడం అవరోధంగా మారింది. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని ఎంత వరకు నెరవేర్చుతుందనేది అనుమానమే. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న 6.50 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన 26,37,753 పాఠ్య పుస్తకాల్లో జిల్లాకు 21 లక్షలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. వచ్చిన పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు పాఠశాలలకు చేరలేదు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండు జతల ఉచిత యూనిఫాం పంపిణీ గతి తప్పింది. గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన యూనిఫాంను చివర్లో ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రణాళిక సిద్ధం చేయలేదు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం అధ్వానంగా మారింది. నిర్వహణకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్క దారి పట్టించింది. సురక్షిత తాగునీటి కల్పనలో ప్రగతి శూన్యంగా ఉంది. జిల్లాలోని 400 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మినహా, 3600 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తాగునీటి సరఫరాకు చేపట్టిన చర్యలు శూన్యం. నూతన తరగతి గదుల నిర్మాణాలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని 300 పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 641 కిచెన్ షెడ్లు నిర్మించాలనే లక్ష్యానికి ఒక్కటీ పూర్తి కాలేదు. -
వ్యక్తిగత సమాచారంతో మహిళలకు ఉద్యోగాలు!
న్యూయార్క్: మహిళలు ఉద్యోగాలు పొందడంలో వారి వ్యక్తిగత సమాచారం కీలక పాత్ర పోషిస్తుందనే ఆసక్తికర విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగాన్ని ఆశించే మహిళలు తమ రెజ్యూమ్ లో ఉండే ఖాళీల విషయంలో స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సి వస్తోందని, వ్యక్తిగతమైన కారణాలను కూడా ఇంటర్వ్యూ చేసేవారికి తెలిపాల్సి వస్తోందని ఈ అధ్యయనం చెబుతోంది. దీనికి సమ్మతి తెలిపే మహిళలకు ఉద్యోగాలు పొందే అవకాశాలు 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన జోని హెర్ష్ అన్నారు. వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు 3 వేల మంది కంపెనీ యజమానుల్ని ప్రశ్నించి ఈ వివరాలు వెల్లడించారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమతో నిజాయతీగా ఉండటా న్ని ఇష్టపడతామని యజమానులు తెలిపారు. మహిళా అభ్యర్థుల రెజ్యూమ్ లో పదేళ్ల పాటు ఖాళీ ఉంటే.. ఆ సమయంలో వారేం చేశారో, తిరిగి ఎందుకు పనిలోకి చేరాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాయి. -
టెక్ రెజ్యుమె ఎలా ఉండాలంటే..
ఇంజనీరింగ్ స్పెషల్ నేడు ఉద్యోగ సాధనలో రెజ్యుమె పాత్ర కీలకం. రెజ్యుమె ఏ మాత్రం సరిగా లేకున్నా రిక్రూటర్స్‌ను ఆకట్టుకోవడం కష్టం. దీంతోనే అభ్యర్థులపై ఒక అంచనాకు వచ్చేస్తాయి నియామక సంస్థలు. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఉద్యోగాలకు ఎలాంటి రెజ్యుమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం.. అన్ని ఉద్యోగాలకు ఒకటే రె జ్యుమె సరికాదు కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యుమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్లోని రెజ్యుమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు సంబంధిత రెజ్యుమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యుమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు టెక్నాలజీ రెజ్యుమె రూపకల్పనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యుమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు. పని అనుభవాలు మీ పని అనుభవాలను క్లుప్తంగా మూడు లేదా నాలుగు లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యుమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు.. ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్ లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్ డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ నెట్వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్. మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యుమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి. కీలక పదాలు ఐటీ రెజ్యుమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆయా పదాలు ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్స్ట్రేటెడ్, ఇన్స్టాల్డ్ వంటి పదాలను రెజ్యుమెలో సందర్భానుసారం ఉపయోగించాలి. జూనియర్, సీనియర్ జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యుమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా కెరీర్లో ప్రవేశించేవారు స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి. -
త్వరలో ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తి పునఃప్రారంభం!
న్యూఢిల్లీ: సిగరెట్ల ఉత్పత్తిని త్వరలో పునఃప్రారంభిస్తున్నట్లు ఐటీసీ ప్రకటించింది. పొగతాగడం హానికరమని సూచిస్తూ... సిగరెట్ కవర్‌పై 85 శాతం మేర ‘హెచ్చరిక చిత్రం’ ముద్రించాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ... టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ) నేతృత్వంలోని పలు కంపెనీలు ఏప్రిల్ 1 నుంచీ తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. టీఐఐలో ఐటీసీసహా గాడ్ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ వంటివి సభ్యత్వ సంస్థలుగా ఉన్నాయి. అసలు ఈ నిబంధనల్లో స్పష్టతలేదని కూడా ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఐటీసీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తమకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చినందువల్ల త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి సమర్పించిన ఒక ఫైలిం గ్లో తెలిపింది. కంపెనీకి ఐదు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. అయితే ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ స్పష్టమైన తేదీని తెలపలేదు. కోర్టు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలియరాలేదు. -
రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, రైళ్ళ పునరుద్ధరణ
ఎట్టకేలకు జాట్ల ఆందోళన ముగిసింది. హరియాణాలో వాతావరణం చల్లబడింది. రిజర్వేషన్లకోసం జాట్లు చేపట్టిన ఆందోళనలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్బంధం తొలగింది. నాలుగు రోజులపాటు నిర్బంధంలో ఉన్న ఢిల్లీ అంబాలా నేషనల్ హైవే ను మంగళవారం సాయంత్రంనుంచీ తెరిచారు. నిరసనకారులు ఆందోళన విరమించడంతో రైలు రోడ్డు మార్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ కు అంతరాయం తొలగినట్లు అధికారులు వెల్లడించారు. అంబాల ఢిల్లీ మార్గాల్లో రైల్వే ట్రాక్ ల తనిఖీలు, మరమ్మత్తులు నిర్వహించామని రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ అంబాల ఛండీగర్ మార్గాల్లో రైలు సర్వీసులను బుధవారం సాయంత్రంనుంచీ యధావిధిగా పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆందోళనలో దెబ్బతిన్న ట్రాక్ లపై అడ్డంకులు తొలగించి, మరమ్మత్తులు నిర్వహించామని చెప్పారు. ఢిల్లీనుంచి మొదలయ్యే అన్ని మార్గాల్లో భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టామని రైల్వే అధికారులు చెప్తున్నారు. హిసార్ నుంచి ఢిల్లీ సహా భివాని, రెవారి, జైపూర్, సదుల్ పూర్, గంగానగర్లకు రైళ్ళను పునరుద్ధరిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే హిసార్ నుంచి చండీగర్, ఢిల్లీ, రోటాక్ లకు బస్ సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు హర్యానా రోడ్ వేస్ హిసార్ జనరల్ మేనేజర్ రామ్ కుమార్ తెలిపారు. బుధవారం నుంచి హరియాణాలో పూర్తిశాతం కర్ఫ్యూ ను ఎత్తివేశారు. రోటాక్ నరంలో పరిస్థితి ప్రశాతంగా మారింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా మంగళవారం సాయంత్రం రోటాక్ లో పర్యటించి స్థానికుల సమస్యలను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు, షాప్ కీపర్లకు జరిగిన భారీ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై నగరంలో నివాసాలపై ఎక్కడైనా నల్లజెండాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలంటూ ఫిబ్రవరి 14న హరియాణాలో మొదలైన జాట్ల ఆందోళన తీవ్ర స్థాయికి చేరి సుమారు 200 మందిదాకా గాయపడగా... 19 మంది ప్రాణాలను కూడ పోగొట్టుకున్నారు. ఆందోళనలపై స్పందించిన కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ.. లిఖిత పూర్వక హామీని కోరుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. చివరికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటికి నాయకత్వం వహిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం హరియాణా ముఖ్యమంత్రి ఖత్తర్ సహా ఇద్దరు హౌస్ సభ్యులను పిలిపించి చర్చలు జరిపిన అనంతరం హరియాణాలో పూర్తిశాతం అల్లర్లు చల్లబడి, వాతావరణం సాధారణ స్థాయికి చేరింది. -
పచ్చ నేతలకు మళ్లీ ఉపాధి!
నీరు-చెట్టు పనులు పునఃప్రారంభం గతంలో అక్రమంగా మట్టి అమ్మకాలు రూ.కోట్లు దండుకున్న టీడీపీ శ్రేణులు మళ్లీ అదే సీన్! మట్టిదొంగలకు మళ్లీ చేతినిండాపని దొరికింది. ఏడు నెలల పాటు నిలిచిన నీరు-చెట్టు పనులు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం ఊపందుకోవడంతో మట్టికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇంకా చెరువుల్లో నీరు ఉండగానే పనులకు శ్రీకారం చుట్టారు. ఏదో విధంగా మట్టిని వెలికి తీసి అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు అధికార టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. గతేడాది జరిగిన నీరు-చెట్టు పనుల్లో సుమారు 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీయగా.. దాంట్లో 80 శాతం మట్టి పచ్చ నేతల జేబులు నింపింది. మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది. విశాఖపట్నం: జిల్లాలో నీరు-చెట్టు కింద 100 ఎకరాలకు పైబడిన ఆయకట్టు ఉన్న మీడియం ఇరిగేషన్ టాంక్స్ (చెరువులు)లో పూడిక తీత పనులను ఇరిగేషన శాఖకు అప్పగించారు. ఈ విధంగా జిల్లాలో 236 చెరువులుంటే 2014 డిసెంబర్లో తొలి విడతలో రూ.4.97 కోట్ల అంచనాలతో 23 చెరువులకు, రెండో విడతలో రూ.18.30కోట్లతో మరో 69 చెరువుల్లో పూడికతీత పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇలా రెండు విడతల్లో 92 పనులు రూ.23.27కోట్లతో చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇరిగేషన్ శాఖాధికారుల నిర్లక్ష్య ఫలితంగా పనులు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగింది. నామమాత్రంగా జిల్లాలో కేవలం 73 చెరువుల పనులు ప్రారంభమైనప్పటికీ పది చెరువుల్లో కనీసం ఐదుశాతం పనులు కూడా జరగలేదు. మరో ఐదు చెరువుల్లో 20 శాతం పనులు మాత్రమే జరగడంతో వీటికి ఎలాంటి చెల్లింపులు చేయలేదు. మిగిలిన 58 చెరువుల్లో ఐదు చెరువుల్లో మాత్రం నూరు శాతం పనులు పూర్తయ్యాయి. 53 చెరువుల్లో 30 నుంచి 40 శాతం మేర పనులు జరగ్గా ఆ మేరకు చెల్లింపులు జరిపారు. ఈ విధంగా జిల్లాలో రూ.14.36కోట్లు 58 చెరువుల్లో పనులు చేపట్టగా పూర్తయిన పనులకు రూ.4.59కోట్ల మేర చెల్లింపులు జరిపారు. అధికారిక లెక్కల ప్రకారం 13.86 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక (మట్టి) వెలికితీసినట్టు లెక్కలు చెబుతుండగా అనధికారికంగా 18 నుంచి 20లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వేశారు. నిబంధనలు గాలికి.. ఈ మట్టిని పూర్తిగా స్థానిక అవసరాలకే ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, శ్మశానాలు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, రైతు పొలంగట్లు ఎత్తుచేసేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. స్థానిక సంస్థలకు సీనరేజ్ చెల్లించి వచ్చిన ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న స్థాయిలో మట్టిని ఇచ్చామని చెప్పు కొస్తున్నారు. జన్మభూమి కమిటీల పర్యవేక్షణలో జరిగిన ఈ పనుల్లో వెలికి తీసిన మట్టిలో 80 శాతం మట్టి టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మట్టిని ఎలా వినియోగించారో చెప్పాల్సిందిగా కోరితే మాత్రం అధికారులు లెక్కలు చూపలేకపోయారు. కాని మట్టి అంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు తరలిపోయింది. ఈ మట్టి, గ్రావెల్ అక్రమ అమ్మకాల ద్వారా రూ.10 కోట్లకు ైపైగా చేతులు మారినట్టు తెలుస్తోంది. జూన్‌లో కురిసిన వర్షాల నేపథ్యంలో నిలిచిన నీరుచెట్టు పనులు మళ్లీ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడు చెరువుల్లో పూడిక పనులు ప్రారంభమయ్యాయని ఎస్ఈ నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన చెరువుల్లో పూడిక తీత పనులను కూడా ఈ వారంలో పూర్తి స్థాయిలో పునఃప్రారంభిస్తామని చెప్పారు. -
పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి
భారత్, పాకిస్తాన్ల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరగాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ సిరీస్ జరగాలనే నేను కోరుకుంటాను. అయితే నిర్ణయం తీసుకోవడంలో అనేక ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది’ అని గంగూలీ అన్నారు. ఆటకు వయసుతో సంబంధం లేదని యువరాజ్, నెహ్రాలు జట్టులోకి రావడం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. -
ఫ్రెషర్స్ రెజ్యూమె రూపొందించేదెలా!
విద్యార్థులు కళాశాల/విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న తర్వాత కొలువు వేట ప్రారంభిస్తారు. అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగుతారు. ఇందులో ప్రధానమైంది.. రెజ్యూమె. ఉద్యోగాల గురించి తెలియగానే కంపెనీకి రెజ్యూమెను పంపించి, ఇంటర్వ్యూ పిలుపు కోసం ఎదురుచూస్తుంటారు. ఈ విషయంలో ఇప్పటికే ఉద్యోగానుభవం ఉన్నవారితో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. ఎలాంటి పని అనుభవం లేని మీరు అనుభవజ్ఞులను అధిగమించి మౌఖిక పరీక్ష దాకా వెళ్లాలంటే మీ రెజ్యూమె ప్రభావవంతంగా ఉండాలి. ఫ్రెషర్స్ రెజ్యూమె తయారీపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. ఉద్యోగానికి అవసరమైన అర్హతలు, నైపుణ్యాలను ముందుగా తెలుసుకోండి. మీలో ఉన్న అర్హతలు, స్కిల్స్‌ను వాటితో అనుసంధానిస్తూ రెజ్యూమెను తయారు చేసుకోండి. కెరీర్ ఆబ్జెక్టివ్ ఫ్రెషర్స్ రెజ్యూమెలో కెరీర్ ఆబ్జెక్టివ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మీ బలాలను తెలియజేయాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటే ఆ విషయం తప్పనిసరిగా ప్రస్తావించాలి. మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలిపే లక్షణం మీలో ఉంటే దాన్ని రెజ్యూమెలో హైలైట్ చేయాలి. మీరు ఎక్కువ స్కోర్ చేసిన సబ్జెక్టులను తెలియజేయండి. మీ ప్రతిభకు గుర్తింపుగా లభించిన సర్టిఫికెట్ల గురించి వివరించండి. ఇంటర్న్‌షిప్, కాలేజీ ప్రాజెక్ట్‌లో ఏయే అంశాలను నేర్చుకున్నారు, ఎంత అనుభవం సంపాదించారో తెలపండి. మీరు అందుకున్న ఉపకార వేతనాలు, నగదు బహుమతులను కూడా ప్రస్తావించండి. కీలకం.. తొలి అర్ధ భాగం రెజ్యూమె మొదటి అర్ధభాగంలో కెరీర్ ఆబ్జెక్టివ్ ప్రముఖంగా కనిపించాలి. ఎందుకంటే రెజ్యూమెను చదవడం ప్రారంభించిన మొదటి 30 సెకండ్లలోనే దాని భవితవ్యాన్ని రిక్రూటర్ తేల్చేస్తారు. మిగతా భాగం చదవాలో వద్దో మొదటి భాగాన్ని బట్టే నిర్ణయిస్తారు. కెరీర్ ఆబ్జెక్టివ్ సంతృప్తికరంగా ఉంటే రెజ్యూమెను పూర్తిగా చదువుతారు. లేకపోతే పక్కన పడేస్తారు. ప్రత్యేకమైన లక్షణాలు నేటి కార్పొరేట్ యుగంలో విజయవంతమైన ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలంటే మీలో ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. కంపెనీలు ఇలాంటి వాటినే కోరుకుంటున్నాయి. టీమ్ వర్క్, కమ్యూనికేషన్, ప్రజంటేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, వ్యాపారాత్మక ఆలోచనా ధోరణి, సృజనాత్మకత, టెక్నికల్, అనలిటికల్ స్కిల్స్.. వంటివి మీలో ఉంటే రెజ్యూమెలో పేర్కొనండి. మీ ఆధ్వర్యంలో కాలేజీలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే దాని గురించి ప్రస్తావించండి. బెస్ట్ స్పీకర్ అవార్డు అందుకొని ఉంటే మీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని అర్థం. విద్యార్హతలను, అకడమిక్ ఫెర్ఫార్మెన్స్‌ను ప్రారంభంలోనే తెలియజేయాలి. ఏయే సంస్థల్లో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేశారో చెప్పాలి. అభిరుచులు మీరేమిటో మీ అభిరుచులను బట్టే చెప్పొచ్చు. రీడింగ్, సింగింగ్, పెయింటింగ్ వంటి హాబీలు ఉంటే.. మీలో మంచి సృజనాత్మకత దాగి ఉందని తెలుస్తుంది. ఈత, నడక వంటి వాటిని హాబీలుగా మార్చుకుంటే ఆరోగ్య పరిరక్షణపై మీలో శ్రద్ధ ఉందని అర్థం చేసుకోవచ్చు. రెజ్యూమెలో మీ హాబీలను తప్పనిసరిగా రాయండి. వీటిని బట్టి రిక్రూటర్లు మీపై ఒక అంచనాకు వస్తారు. రెజ్యూమెను రెండు పేజీలకే పరిమితం చేయండి. తక్కువ పదాలు, వాక్యాల్లో మీ గురించి ఎక్కువ సమాచారం ఇవ్వండి. ఫ్రెషర్స్ రెజ్యూమె అనేది రీడర్ ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్త వహించండి. -
విజయాలను వివరించే రెజ్యూమె
ఉద్యోగ సాధనలో రెజ్యూమెదే కీలక పాత్ర. ఇది అభ్యర్థి గురించి రిక్రూటర్‌కు తెలియజేసే సాధనం. రెజ్యూమె ప్రభావవంతంగా ఉంటేనే కొలువు వేటలో విజయం సాధ్యమవుతుంది. రెజ్యూమెలో ఏయే అంశాలుండాలో తెలుసుకోవాలి. అప్పుడే జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న కొత్త అభ్యర్థులు, ఇప్పటికే ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థుల రెజ్యూమెలు వేర్వేరుగా ఉంటాయి. కొత్త అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రస్తావిస్తుంటారు. అనుభవజ్ఞులు మాత్రం తాము ఇప్పటిదాకా ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను, సంపాదించిన అనుభవాన్ని కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. రిక్రూటర్లు కూడా వీటినే ఎక్కువగా పరిశీలిస్తారు. అయితే, చాలామందికి రెజ్యూమెలో ఈ విషయాలను ఎలా పొందుపర్చాలో తెలియదు. అన్ని అంశాలను ఒక క్రమపద్ధతిలో వివరిస్తే రిక్రూటర్‌కు సులువుగా అర్థమవుతాయి. ఏయే పదాలను ఉపయోగించాలి, ఏయే పదాలను వాడకూడదో తెలుసుకోవడం మంచిది. కొందరు పాత సంస్థలో నిర్వర్తించిన బాధ్యతలనే విజయాలుగా పేర్కొంటారు. ఇది సరైంది కాదు. మీ కృషితో ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితే, సంస్థకు లాభాలు వస్తే.. వాటినే విజయాలంటారు. వాడాల్సిన పదాలు నేను ఫలానా పనికి బాధ్యత వహించాను(రెస్సాన్సిబుల్ ఫర్) అంటూ రెజ్యూమెలో వాక్యాలను ప్రారంభించొద్దు. మీరు సాధించిన సక్సెస్‌ను నొక్కి చెప్పే పదాలనే ఉపయోగించాలి. ఇందుకోసం.. ఫార్ములేటెడ్, యాక్సిలరేటెడ్, ఇన్స్టిట్యూటెడ్, గవర్న్‌డ్, మ్యాక్సిమైజ్డ్, లీవరేజ్డ్, రికగ్నైజ్డ్, నోటెడ్, ప్రెయిజ్డ్, క్రెడిటెడ్.. ఇలాంటి పదాలతోనే వాక్యాలను ప్రారంభించండి. వీటితో మీరు చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరేం సాధించారో సులువుగా తెలిసిపోతుంది. వాడకూడని పదాలు రెజ్యూమెలో అతిశయోక్తులకు చోటు కల్పించొద్దు. ఇవి రిక్రూటర్‌కు మీపై తేలికభావం కలిగేలా చేస్తాయి. మీ అవకాశాలను దెబ్బతీస్తాయి. కాబట్టి విజనరీ, ఎఫెక్టివ్, ఇన్నోవేటివ్, డైనమిక్ వంటి పదాలను రెజ్యూమెలో రాయకండి. మీరు నిజంగా డైనమిక్ అయితే ఉదాహరణల ద్వారా ఆ విషయం తెలియజేయండి. అంతేతప్ప పదాన్ని ఉపయోగించకండి. అంకెలతో ఆధారాలు మీరు పాత సంస్థలో ఎంతో సాధించి ఉండొచ్చు. భారీగా లాభాలు ఆర్జించి పెట్టొచ్చు. అదే విషయాన్ని బలంగా వివరించాలి. అంటే అంకెలతో ఆధారాలు చూపాలి. నేను సంస్థలో 20 శాతం అమ్మకాలు పెంచాను. వార్షిక సేల్స్ టార్గెట్‌లో 50 శాతం సాధించాను.. ఇలా రెజ్యూమెలో అంకెలను ఉపయోగిస్తే మీ విజయాలపై రిక్రూటర్‌కు నమ్మకం పెరుగుతుంది. తిరగేసిన పిరమిడ్ పద్ధతి తిరగేసిన(ఇన్వర్టెడ్) పిరమిడ్... దీన్ని ఎక్కువగా రచయితలు ఉపయోగిస్తుంటారు. మీరు కూడా రెజ్యూమె రచనలోఈ నిర్మాణాన్ని చేర్చండి. అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మొదట విపులంగా తెలియజేయాలి. అంటే ప్రాధాన్యత క్రమంలో పై నుంచి కిందికి క్రమపద్ధతిలో వివరించాలి.ఉత్తమమైన రెజ్యూమె రచనా పద్ధతి ఇదేనని నిపుణులు చెబుతున్నారు. రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించాలంటే తిరగేసిన పిరమిడ్ పద్ధతిని ఉపయోగించాలి. రిక్రూటర్లు రెజ్యూమెను కిందిదాకా పూర్తిగా చదవలేరు. ప్రారంభంలోనే ముఖ్యమైన సమాచారం ఉంటే... మీ గురించి వారికి పూర్తిగా తెలుస్తుంది. -
సోషల్ మీడియా.. అప్రమత్తతే రక్ష!
జాబ్ స్కిల్స్ సామాజిక మాధ్యమాలు... ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య దూరాన్ని చెరిపేస్తున్న ఆధునిక వేదికలు. ఈ మాధ్యమాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి, అదేస్థాయిలో నష్టాలూ ఉన్నాయి. సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే ఆశించిన ప్రయోజనం పొందొచ్చు. తెలియకపోతే నష్టపోవడం ఖాయం. జాబ్ సెర్చ్, రిక్రూట్మెంట్ అనేవి సామాజిక మాధ్యమాల ద్వారా కొనసాగుతున్నాయి. ఉద్యోగాల కోసం అభ్యర్థులు, తమకు తగిన అభ్యర్థుల కోసం రిక్రూటర్లు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. కొలువు వేట ప్రారంభించినవారు తమ ప్రొఫైల్‌ను, రెజ్యూమెను లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్+ వంటి సైట్లలో పోస్టు చేస్తున్నారు. రిక్రూటర్లు వీటిని పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థుల గుణగణాలను తెలుసుకొనేందుకు ఆయా సైట్లలో వారి అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. అకౌంట్లలో అవాంఛనీయ, అభ్యంతరకరమైన అంశాలుంటే వారిని తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే తమ సంస్థలో కొలువులో ఉన్నవారి అకౌంట్లను కూడా యాజమాన్యాలు గమనిస్తున్నాయి. కాబట్టి ఈ సామాజిక మాధ్యమాల్లో ఏయే అంశాలను పోస్టు చేయాలి, వేటిని చేయకూడదు అనే విషయంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రొఫైల్‌కు ముస్తాబు ఏదైనా విందుకు హాజరు కావాలంటే సాధ్యమైనంత వరకు చక్కగా ముస్తాబై వెళతాం. సోషల్ మీడియాలో ప్రొఫైల్‌ను పోస్టు చేసేముందు కూడా దాన్ని ఇలాగే ముస్తాబు చేయాలి. ప్రొఫైల్‌ను తప్పుల్లేకుండా ఆకర్షణీయంగా రూపొందించుకోవాలి. పోస్టు చేసిన తర్వాత తరచుగా పరిశీలిస్తూ అప్డేట్ చేస్తుండాలి. అర్హతలు, అనుభవం పెరిగితే వాటిని అందులో తప్పనిసరిగా చేర్చాలి. ప్రొఫైల్ అసంపూర్తిగా ఉండకూడదు. మీకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపర్చాలి. మీకు ప్లస్ పాయింట్‌గా భావిస్తున్న ప్రతి అంశానికి అందులో చోటు కల్పించాలి. మీరిచ్చే సమాచారం పూర్తి సత్యమైనదై ఉండాలి. గొప్పల కోసం అసత్యాలు, అర్ధ సత్యాలను నమ్ముకుంటే మిగిలేది అప్రతిష్టే. మీ తాజా ఫొటోను కూడా అప్లోడ్ చేయండి. ఇందులో మీరు ప్రొఫెషనల్‌గా కనిపించాలి. స్నేహితులతో కలిసి సరదాగా తీసుకున్న ఫొటో ఇలాంటి చోట పనికిరాదు. ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయండి. ఇది మీకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్స్‌ను హైలైట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. రిక్రూటర్లు ఇలాంటి వాటికి అధికా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ పనితీరు, విజయాలు నచ్చితే వారి నుంచి పిలుపు రావొచ్చు. చెప్పడానికేమీ లేదా? ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటే.. సోషల్ మీడియా అకౌంట్ల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సంస్థ, యాజమాన్యం, సహచరుల ప్రవర్తన, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయొద్దు. సంస్థ ప్రతినిధులు వీటిని గమనిస్తుంటారు. మీ కామెంట్లు సంస్థ పేరును దెబ్బతీసేలా ఉంటే.. మీకు ఉద్యోగం నుంచి ఉద్వాసన తప్పదు. పోస్టు చేయడానికి మంచి విషయం ఏదీ లేకపోతే మౌనంగా ఉండండి. అంతేతప్ప చెడు ప్రచారం మాత్రం చేయకండి. అది మీకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనివల్ల మరో కంపెనీలో కూడా కొలువు దొరకదు. మీరు మంచి ఉద్యోగి, మంచి వ్యక్తి అనే విషయం మీ సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే తెలిసిపోవాలి. కొన్ని జోక్‌లు ఫ్రెండ్స్‌తో చెప్పుకొని నవ్వుకోవడానికి పనికొస్తాయి కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టడానికి కాదు. అబద్ధాలు వద్దు కొందరు తమకు జ్వరమని చెప్పి, ఆఫీస్‌లో సెలవు తీసుకుంటారు. మరుసటి రోజు పార్కులోనో, పబ్బులోనో చిందులేస్తారు. ఆ ఫొటోలను, ఎంజాయ్మెంట్ను సోషల్ మీడియాలో గొప్పగా పోస్టు చేస్తారు. వాటిపై కామెంట్లను చూసుకొని ఆనందిస్తుంటారు. ఈ ఫొటోలను కంపెనీ యాజమాన్యం చూస్తే ఏం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాచేసి మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. బాస్‌తో అబద్ధాలు చెప్పకండి. ఒకవేళ చెప్పినా మీ నిర్వాకాన్ని బయటపెట్టే అవకాశం సోషల్ మీడియాకు ఇవ్వకండి. -
ఆర్థికఉద్యోగాలకు.. ఫైనాన్స్ రెజ్యూమె!
మీరు ఫైనాన్స్ ప్రొఫెషనలా? మీ రంగానికి సంబంధించిన కొలువులకు దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి రెజ్యూమెను జతచేస్తున్నారు? సాధారణ రెజ్యూమెను పంపితే ఫలితం ఉండదు. ఫైనాన్స్ రంగానికి ప్రత్యేకమైన రెజ్యూమె ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్‌తో పోలిస్తే ఇది భిన్నం. దాన్ని ఎలా రూపొందించుకోవాలో తెలుసుకుంటే కొలువు వేట విజయవంతమవుతుంది. ఆబ్జెక్టివ్: రెజ్యూమె ఫార్మాట్లో ముఖ్యమైనది.. ఆబ్జెక్టివ్. అంటే మీరు ఆర్థిక శాస్త్రం చదివిన అభ్యర్థి అనే విషయం రెజ్యూమెను చూడగానే తెలిసిపోవాలి. మీ అర్హతలు, అనుభవాలు రిక్రూటర్‌కు తెలియాలి. ఈ ఆబ్జెక్టివ్ సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండాలి. రెజ్యూమెలో పునరుక్తులు లేకపోతే రిక్రూటర్‌కు మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. నా నైపుణ్యాలను పెంచుకోవడానికి మీ సంస్థలో ఉద్యోగం కావాలి అంటూ రెజ్యూమెను సాధారణ శైలిలో రాయకుండా.. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడానికి సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లేదా ఫలానా స్థాయి కొలువును కోరుకుంటున్నాను అని సూటిగా పేర్కొనాలి. సంస్థ పేరు, కోరుకుంటున్న హోదాను ప్రస్తావించాలి. దీనివల్ల కొలువుపై మీలో స్పష్టత, ఆసక్తి ఉన్నాయని రిక్రూటర్ అంచనాకొస్తారు. సంస్థ మీకేం ఇవ్వాలో కాకుండా, సంస్థకు మీరేం ఇస్తారో చెప్పండి. అర్హతలు: ఫైనాన్స్ రెజ్యూమెలో విద్యార్హతలదే అగ్రస్థానం. రెగ్యులర్ రెజ్యూమెలో మొదట పని అనుభవాన్ని ప్రస్తావిస్తారు. కానీ, ఫైనాన్స్ రెజ్యూమెలో మాత్రం విద్యార్హతల తర్వాతే వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి పేర్కొనాలి. మీరు చదివిన పాఠశాల, కళాశాలలు, సాధించిన మార్కులు, గ్రేడ్లను వరుస క్రమంలో ఇవ్వాలి. మీరు ఛార్టెర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పూర్తిచేస్తే.. ఏ సంవత్సరంలో అర్హత సాధించారు? అది తొలి ప్రయత్నంలోనా? లేక రెండో ప్రయత్నంలోనా? అనేది తప్పనిసరిగా తెలియజేయాలి. పని అనుభవం: రిక్రూటర్లు అభ్యర్థుల విద్యార్హతలతోపాటు పని అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మధ్యస్థ, సీనియర్ లెవల్ ఉద్యోగాలకు పని అనుభవం ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేస్తారు. మీరు ఇప్పటికే ఏదైనా సంస్థలో పనిచేసి ఉంటే.. సదరు సంస్థ పేరు, అందులో మీ హోదాలు, నిర్వర్తించిన బాధ్యతలు, మెరుగుపర్చుకున్న అనుభవం, నైపుణ్యాలు, సాధించిన విజయాలను రెజ్యూమెలో పేర్కొనండి. దీనివల్ల మీరు ఎలాంటి కొలువుకు సరిపోతారు అనేదానిపై రిక్రూటర్‌కు అవగాహన వస్తుంది. ఉండాల్సిన పదాలు: ఒక్కో రంగానికి సంబంధించిన రెజ్యూమెలో ఉండాల్సిన సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. వీటితో రెజ్యూమె పరిపూర్ణమవుతుంది. వాటిని కచ్చితంగా ఉపయోగించాలి. ఫైనాన్స్ రెజ్యూమెలో ఫిక్స్డ్ అస్సెట్ అకౌంటింగ్, వాల్యూ యాడెడ్ అనాలిసిస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటెజిక్ ప్లానింగ్, బ్యాంక్ రికాన్సిలియేషన్స్, ఫైనాన్షియల్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, కలెక్షన్ స్పెషలిస్ట్ వంటి పదాలను మీ రెజ్యూమె రచనలో ఉపయోగించండి. -
టెక్ రెజ్యూమె రూపొందించేదెలా?
కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యూమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్లోని రెజ్యూమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు దరఖాస్తు చేస్తే.. సంబంధిత రెజ్యూమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్ రెజ్యూమె అనేది మీకు తెలిసిన ప్రోగ్రామ్ లాంగ్వేజ్ల ద్వారా కంటే ఎక్కువగా మీ గురించి వెల్లడించాలి. ఇది సక్రమంగా ఉంటే సగం పని పూర్తయినట్లే. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యూమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు: టెక్నాలజీ రెజ్యూమె రచనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యూమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు. అనుభవాలు: మీ అనుభవాలను క్లుప్తంగా 3, 4 లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యూమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు.. ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్ లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్ డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ నెట్వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్. మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యూమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి. కీలక పదాలు: ఐటీ రెజ్యూమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. వాటితో రెజ్యూమెకు నిండుదనం వస్తుంది. కాబట్టి ఆయా పదాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్స్ట్రేటెడ్, ఇన్స్టాల్డ్ వంటి పదాలను రెజ్యూమె రచనలో సందర్భానుసారంగా ఉపయోగించాలి. జూనియర్, సీనియర్: జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యూమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా టెక్ కెరీర్లోకి ప్రవేశించబోయేవారు రెజ్యూమెలో తమ స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం అవసరం. మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: టూల్ డిజైన్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. ఐదేళ్ల అనుభవం అవసరం. సీనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్) అర్హతలు: పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్/ ప్రొడక్షన్ లేదా క్యాడ్-క్యామ్ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.cttc.gov.in ఎయిమ్స్ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పీజీ ప్రోగ్రాములు ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్ విభాగాలు: క్లినికల్ సెన్సైస్, బేసిక్ క్లినికల్ సెన్సైస్, డెంటల్ మొదలైనవి. ఎంసీహెచ్ విభాగాలు: న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ. అర్హతలు: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉండాలి. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. పీహెచ్డీ ప్రోగ్రామ్ విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, సీటీసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ల్యాబ్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్ అంకాలజీ మొదలైనవి. అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఆన్లైన్ టెస్ట్), డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 16 వెబ్సైట్: www.aiimsexams.org జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. ఎంబీఏ ప్రోగ్రామ్ విభాగాలు: బిజినెస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, సస్టెయినబిలిటీ మేనేజ్మెంట్, గ్లోబల్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. గ్జాట్/ క్యాట్/ జీమ్యాట్‌లో అర్హత సాధించాలి. ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ (మేనేజ్మెంట్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. పీహెచ్డీ (మేనేజ్మెంట్) అర్హతలు: ఎంబీఏ లేదా మేనేజ్మెంట్లో పీజీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5 వెబ్సైట్: http://ximb.sify.net/ -
మార్కెటింగ్ రెజ్యూమె రాయడమెలా?
‘వన్ సైజ్ ఫిట్స్ ఆల్’.. మనలో చాలామంది నమ్మే సిద్ధాంత మిది. ఒకటే అన్నింటికీ పనికొస్తుందనుకోవడం పొరపాటు. రెజ్యూమె విషయంలో ఇది ఏమాత్రం వర్తించదు. ఒక్కో రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి రెజ్యూమె కూడా వేర్వేరుగా ఉంటుంది. ఒకదాని కోసం రూపొందించుకున్న రెజ్యూమెను మరో ఉద్యోగం కోసం పంపిస్తే ఫలితం ఉండదు. సాధారణంగా అభ్యర్థులు చేసే తప్పిదం ఏమిటంటే.. ఒక కామన్ ఫార్మాట్లో రెజ్యూమెను తయారు చేసుకొని, దాన్నే అన్ని కంపెనీలకు, అన్ని రకాల ఉద్యోగాలకు పంపిస్తుంటారు. కంపెనీల నుంచి పిలుపు రాక నిరాశ చెందుతుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు రెజ్యూమె ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఇది అభ్యర్థిపై యాజమాన్యానికి తొలి ప్రభావాన్ని కలిగిస్తుంది. అది సానుకూలమా? ప్రతికూలమా?.. ఎలాంటి ప్రభావమనేది రెజ్యూమెపై ఆధారపడి ఉంటుంది. నచ్చిన కొలువులో ప్రవేశించడానికి ఇది ఒక టికెట్ లాంటిది. ప్రస్తుతం మార్కెటింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి రెజ్యూమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం.. జాబ్ ఆబ్జెక్టివ్: సంస్థలో ఎలాంటి ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఒకటి రెండు వాక్యాల్లో తేలిగ్గా అర్థమయ్యేలా వివరించాలి. దీన్నే జాబ్ ఆబ్జెక్టివ్ అంటారు. రెజ్యూమెకు ఇది స్పాట్లైట్ లాంటిది. నా మార్కెటింగ్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి అవసరమైన ఉద్యోగం కావాలి అని రాయకుండా మార్కెటింగ్ రంగంలో నాకు ఒక స్థానాన్ని కల్పించే, సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి నా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలైన పోస్టు కావాలి అంటూ అభ్యర్థించాలి. కంపెనీ నుంచి మీరు ఆశించేదాన్ని కాదు, కంపెనీకి మీరు ఇచ్చేదాన్నే రెజ్యూమెలో ప్రస్తావించాలి. సంస్థలో ఉత్పత్తిని, తద్వారా లాభాలను పెంచడానికి నా అనుభవాన్ని, స్కిల్స్‌ను ఉపయోగించేందుకు పోస్టు కావాలి అని పేర్కొనాలి. మార్కెటింగ్ డెరైక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాన్ని కోరుకుంటున్నట్లు నేరుగా తెలియజేయాలి. రెజ్యూమె రైటింగ్‌లో ఇప్పుడు ఇదే ఆధునిక ధోరణి. పోస్టు గురించి ప్రస్తావిస్తే మీలో సీరియస్‌నెస్ ఉందని సంస్థ యాజమాన్యం భావిస్తుంది. పని అనుభవం: మార్కెటింగ్ రెజ్యూమెలో ఉండాల్సిన ప్రధాన అంశం.. పని అనుభవం. గతంలో ఏదైనా సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ మీ హోదా, నిర్వర్తించిన బాధ్యతలను, సాధించిన విజయాలను రెజ్యూమెలో తప్పనిసరిగా రాయాలి. వీలును బట్టి అంకెలు, సంఖ్యలను కూడా ప్రస్తావించాలి. ఇలాంటి రెజ్యూమెకు విలువ అధికంగా ఉంటుంది. చాలా సంస్థలు రెజ్యూమెలను డేటా బేస్‌లో భద్రపరుస్తుంటాయి. మొత్తం రెజ్యూమెను చదవకుండా సెర్చ్‌లో కొన్ని కీ వర్డ్స్‌ను ఉపయోగించి అందులో తమకు అవసరమైన అంశాన్ని చదువుతుం టాయి. ఈ పదాలు సాధారణంగా మార్కెటింగ్‌కు సంబంధించినవే ఉంటాయి. కాబట్టి బిజినెస్ డెవలప్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ కమ్యూని కేషన్, మార్కెట్ రీసెర్చ్, పీఆర్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి పదాలు రెజ్యూమెలో ఉండేలా జాగ్రత్తపడండి. అంతేకాకుండా యాక్సిలరేటెడ్, అడ్మినిస్టర్డ్, కన్వర్టెడ్, ఎక్స్పాండెడ్, జనరేటెడ్, ఇంక్రీజ్డ్, ట్రెయిన్డ్, ఇనిషియేటెడ్ వంటి పదాలను ఉపయోగిస్తూ వాక్యాలను ప్రారంభించండి. -
జాబ్ కన్సల్టెంట్లతో వ్యవహరించేదెలా?
జాబ్ స్కిల్స్ అభ్యర్థులు తమ అర్హతలకు తగిన ఉద్యోగం కోసం గాలిస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి జాబ్ కన్సల్టెంట్ల సహాయం కూడా తీసుకుంటూ ఉంటారు. కొలువు వేటలో కన్సల్టెంట్లతో ప్రయోజనం పొందొచ్చు. అయితే, వారి సేవలను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదాన్ని బట్టే అభ్యర్థుల విజయం ఆధారపడి ఉంటుంది. సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ కన్సల్టెంట్లను లేదా కన్సల్టెన్సీలను ఏర్పాటు చేస్తాయి. తమకు తగిన అభ్యర్థులను వాటి ద్వారా నియమించుకుంటాయి. కంపెనీ అవసరాలను, అభ్యర్థుల అర్హతలను క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసి, సంస్థకు అప్పగించడమే కన్సల్టెంట్ల ప్రధాన బాధ్యత. వీరితో సరిగ్గా వ్యవహరించగలిగితే ఇష్టమైన కొలువు సాధించడం సులువవుతుంది. కన్సల్టెంట్లను ఎలా ఉపయోగించుకోవాలో అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఓపెన్‌గా మాట్లాడాలి కన్సల్టెంట్ల దగ్గర మొహమాటం ఎంతమాత్రం పనికిరాదు. కొందరు అభ్యర్థులు పూర్తి సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతుంటారు. సరైన ఉద్యోగం కావాలంటే కన్సల్టెంట్లకు సమాచారం మొత్తం ఇవ్వాలి. వారిని శ్రేయోభిలాషులుగా భావించి ఓపెన్‌గా మాట్లాడాలి. మీ ఆశలు, ఆకాంక్షలను ఉన్నదున్నట్లుగా తెలియజేయాలి. దీనివల్ల మీ అవసరాలను వారు గుర్తించగలుగుతారు. మీకు తగిన ఉద్యోగాన్ని వెతికి పెడతారు. సులభంగా అర్థమయ్యేలా కన్సల్టెంట్లు సాధారణంగా మానవ వనరుల నిపుణులై(హెచ్ఆర్ ప్రొఫెషనల్స్) ఉంటారు. ఇతర రంగాల్లో వారి పరిజ్ఞానం తక్కువగా ఉండొచ్చు. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు క్లిష్టమైన టెక్నికల్ పదాలను వాడకుండా స్పష్టంగా అర్థమయ్యేలా సులభమైన భాషను ఉపయోగించాలి. సమాచార లోపం రాకుండా చూసుకోవాలి. పరస్పర అవగాహన కన్సల్టెంట్, అభ్యర్థి మధ్య ఉండే అనుబంధం.. అమ్మకందారు, కొనుగోలుదారులాంటిదే. ఇక్కడ ఉభయ పక్షాలూ లాభపడాలి. కాబట్టి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. కన్సల్టెంట్లతో పూర్తిగా సహకరించాలి. వారు అడిగిన వివరాలు ఇవ్వాలి. వారి సలహాలు, సూచనలను అభ్యర్థులు సాధ్యమైనంతవరకు పాటించాలి. రెజ్యుమె ఒక్కరికే పంపాలి ఒక కన్సల్టెన్సీలో ఒక్కరి కంటే ఎక్కువ మంది ఉండొచ్చు. వారందరి నుంచి మీకు ఫోన్‌కాల్స్, ఈ-మెయిల్స్ వస్తుంటాయి. అయితే, వారందరితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. దీనివల్ల గందరగోళం ఏర్పడుతుంది. కన్సల్టెన్సీలో ఒక్కరితోనే కమ్యూనికేషన్ జరపాలి. అభ్యర్థులు తమ రెజ్యుమెను ఆ ఒక్కరికే పంపించాలి. మిగిలినవారికి కూడా పంపిస్తే విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒకే సంస్థకు చెందిన పలువురు కన్సల్టెంట్లతో సంప్రదింపులు జరిపితే మిమ్మల్ని పక్కనపెట్టే అవకాశం ఉంది. ‘టచ్’లో ఉండాల్సిందే ఉద్యోగం వచ్చినా రాకున్నా కన్సల్టెంట్‌తో టచ్‌లో ఉండడం మంచిది. దీనివల్ల మీ అర్హతలకు తగిన మంచి కొలువు ఏదైనా వారి దృష్టికి వస్తే మీకు సమాచారం చేరవేస్తారు. అవకాశాలను కళ్లముందుంచే కన్సల్టెంట్‌కు సహకరిస్తే మంచి ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.