కోల్‌కతా: నాణేల ముద్రణ నిలిపేయాలంటూ దేశంలోని నాలుగు నాణేల ముద్రణ కేంద్రాలకు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాణేల ముద్రణను తిరిగి ప్రారంభించాలని, అయితే ముద్రణ వేగాన్ని తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)కు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్పీఎంసీఐఎల్ పరిధిలో ఉన్న 4 ముద్రణా కేంద్రాల్లో గతంలో లాగా 2 షిఫ్టుల్లో కాకుండా ఒక్క షిఫ్టులోనే ముద్రణ కొనసాగించాలని తెలిపింది. 2017–18కి గాను 7,712 మిలియన్ల నాణేలు ముద్రించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు తమకు జారీ చేసిన ఇండెంట్‌లో పేర్కొంది. బ్యాంకుల్లో స్థలం లేనికారణంగా నాణేల ముద్రణ నిలిపేయాలంటూ ఈ నెల 9న కేంద్రం ఎస్పీఎంసీఐఎల్‌కు ఆదేశాలిచ్చింది.
నాణేల ముద్రణను పునరుద్ధరించండి: కేంద్రం
Published Sun, Jan 14 2018 4:18 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment