సాక్షి, న్యూఢిల్లీ: మూడునెలల విరామం తరువాత కేంద్ర ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ (65) తిరిగి బాధ్యతల్లో చేరారు. మూత్రపిండ మార్పిడి కోసం ఇటీవల ఆసుపత్రిలో చేరిన జైట్లీ కోలుకున్న అనంతరం గురువారం కార్యాలయానికి హాజరయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే నార్త్ బ్లాక్ మొదటి-అంతస్తులోని జైట్లీ కార్యాలయాన్ని ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా పూర్తిగా పునరుద్ధించినట్టు తెలుస్తోంది.
జైట్లీ ఆగస్టు9 న జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తన ఓటు వేశారు. అలాగే సోషల్‌మీడియాలోచురుకుగా వుంటూ జీఎస్‌టీసహా ఇతర ఆర్థిక రాజకీయ, సామాజిక అంశాలపై తన స్పందనను తెలియజ్తేసున్నారు. సీనియర్ జర‍్నలిస్టు కుల్‌దీప్ నయ్యర్ మృతిపై ఆయన సంతాపాన్ని తెలుపుతూ గురువారం ట్వీట్ చేశారు.
దీర్ఘకాలికంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడ్డారు. వ్యాధి తీవ్రం కావడంతో వైద్య అవసరాల రీత్యా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెలవులో ఉన్నారు. మే14న ఆయనకు మూత్రి పిండ మార్పడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఆర్థికమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు సమాయత్తమయ్యారు. ఈ విరామ సమయంలో జైట్లీ స్థానంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Saddened by the death of the veteran Journalist Sh. Kuldip Nayar. His contribution to the cause of free speech is unparalleled. He is credited with breaking some of the most exclusive news stories. Will be best remembered for his struggle against the emergency.
— Arun Jaitley (@arunjaitley) August 23, 2018
Comments
Please login to add a commentAdd a comment