Kidney Transplantaition
-
కిడ్నీ మార్పిడి కేసులో NRI ఆసుపత్రి కీలక పాత్ర
-
జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి
బోస్టన్: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్ ‘రిక్’ స్లేమాన్‌కు మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లోనే స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. -
అరుదైన సర్జరీ.. ఒక వ్యక్తిలో ఐదు కిడ్నీలు!!
ఆయనకి శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నాయి. యస్.. తనవి రెండు.. దాతలు ఇచ్చినవి మూడు. గతంలో రెండుసార్లు అవయవ మార్పిడి చికిత్సలు నిర్వహించిన వైద్యులు.. ఈమధ్యే విజయవంతంగా మరో కిడ్నీని శరీరంలోకి ఎక్కించారు. ఇంతకు ముందు సర్జరీలు ఫేయిల్ కావడానికి కారణం.. ఆయనకు ఉన్న హైపర్‌టెన్షన్(అధిక రక్తపోటు) సమస్య. దీంతో మరోసారి ప్రయత్నించిన డాక్టర్లు.. సంక్లిష్టమైన సర్జరీ ద్వారా ఐదో కిడ్నీని విజయవంతంగా అమర్చారు. తద్వారా వైద్య చరిత్రలో అరుదైన ఈ ఘటనకు చెన్నై వైద్యులు కారణం అయ్యారు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల సదరు వ్యక్తికి ఇదివరకే రెండుసార్లు రెనల్ (మూత్రపిండం)కు సంబంధిచిన సర్జరీలు జరిగాయి. పేషెంట్‌కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. దీంతో 1994లో తొలిసారి.. 2005లో రెండోసారి కిడ్నీలను మార్చారు. ఆయనకు ఉన్న అధిక రక్తపోటు సమస్య వల్ల ఈ రెండూ సర్జరీలు విఫలం అయ్యాయి. దీంతో coronary artery disease బారినపడ్డాడు. ఈ పరిస్థితుల్లో మరో కిడ్నీ అమర్చే విషయంపై ఆయనతో చర్చించారు మద్రాస్ మెడికల్ మిషన్ డాక్టర్లు. కానీ, అప్పటికే శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండడంతో ఐదవది అమర్చడం సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ పేషెంట్ ఉన్న కండిషన్‌కి ఆ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించలేదు. ఇది చదవండి: పాములే ఇక సైంటిస్టులకు దిక్కు ఎక్కడ అమర్చారంటే.. సాధారణంగా దాతల కిడ్నీలను.. పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ, ఈ పేషంట్‌కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. పైగా ఇంతకు ముందు జరిగిన సర్జరీల వల్ల పేషెంట్ నుంచి యాంటీబాడీస్ రిలీజ్ అయ్యే రిస్క్ ఏర్పడొచ్చు. కాబట్టి, జాగ్రత్తగా కిడ్నీని అమర్చాలని ఫిక్స్ అయ్యారు. చివరకు పొత్తికడుపు కుహరం దగ్గర ఆ కిడ్నీని అమర్చి.. ఇక్కడే గుండెకు సంబంధించిన రక్తనాళాలకు కనెక్ట్ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు. పాతవి తీయకపోవడానికి కారణం ఇదే కొత్త కిడ్నీ అమర్చేప్పుడు.. పాత కిడ్నీలను ఎందుకు తొలగించలేదని చాలామందికి అనుమానం కలగవచ్చు. ఒకవేళ పాతవి గనుక తొలిగిస్తే.. రక్తస్రావం జరగొచ్చు. అదే టైంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి.. కొత్త కిడ్నీ అమర్చడానికి పరిస్థితి ప్రతికూలంగా మారొచ్చు. అందుకే ఆ పాత కిడ్నీలను అలాగే వదిలేశారు. ఇక జులై 10న సర్జరీ విజవంతంగా జరగ్గా.. నెల తర్వాత (ఆగస్టు 10న) ఆ పేషెంట్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని, మరికొన్ని నెలలపాటు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. -
కవి మనసు ఖాళీగా ఉండదు
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను...’ (‘ఠాగూర్’ సినిమా) పాటతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రచయిత సుద్దాల అశోక్‌తేజ. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వాటి గురించి అశో క్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య మీడియాలో నేను పోయానని ఒకరు, విషమంగా ఉన్నానని మరొకరు మాట్లాడుతున్నారు. అవన్నీ పుకార్లే. నాకు ఆపరేషన్ జరిగి దాదాపు 47 రోజులైంది. చక్కగా కోలుకుంటున్నాను. నేను బావుండాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి మామూలు మనిషి అవ్వాలని ఎంతోమంది స్నేహితులు, బంధువులు కోరుకున్నారు. అనారోగ్యం శరీరానికే కానీ, కవి మనసుకు కాదు. అది ఖాళీగా ఉండలేదు. అందుకే నేను ఈ అనారోగ్యం, కరోనా టైమ్‌లో కూడా రాస్తూనే ఉన్నాను. గతంలో నేను ‘శ్రమకావ్యం’ అని రాశాను. ఇప్పుడు ‘అరణ్య కావ్యం’ రాస్తున్నా. 70 నుండి 80 అధ్యాయాలు ఉండే పెద్ద కవిత ఇది. దాని పేరు ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’. అడవి వల్ల ప్రపంచానికి ఎంత మేలు జరిగింది? అలాంటి అడవిని ఎన్ని రకాలుగా హింసించారు? అనే విషయాలను ప్రస్తావిస్తూ అడవి తన గోడు వెళ్లబోసుకుంటుంది. అడవి హింసించబడటం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఆçస్పత్రిలో చేరకముందు, ఆపరేషన్ అయిన మూడో రోజు నుండే నేను ఈ కవితను రాస్తూ బిజీగా ఉన్నాను. ఇవికాకుండా నూతన నటీనటులతో వస్తున్న ‘సతి’ అనే సినిమాకి పాట రాశాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాపై ఏమైనా రూమర్స్ వస్తే నమ్మొద్దని అందరికీ తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు. -
మూడు నెలల విరామం తరువాత
సాక్షి, న్యూఢిల్లీ: మూడునెలల విరామం తరువాత కేంద్ర ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ (65) తిరిగి బాధ్యతల్లో చేరారు. మూత్రపిండ మార్పిడి కోసం ఇటీవల ఆసుపత్రిలో చేరిన జైట్లీ కోలుకున్న అనంతరం గురువారం కార్యాలయానికి హాజరయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే నార్త్ బ్లాక్ మొదటి-అంతస్తులోని జైట్లీ కార్యాలయాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా పూర్తిగా పునరుద్ధించినట్టు తెలుస్తోంది. జైట్లీ ఆగస్టు9 న జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తన ఓటు వేశారు. అలాగే సోషల్మీడియాలోచురుకుగా వుంటూ జీఎస్టీసహా ఇతర ఆర్థిక రాజకీయ, సామాజిక అంశాలపై తన స్పందనను తెలియజ్తేసున్నారు. సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ మృతిపై ఆయన సంతాపాన్ని తెలుపుతూ గురువారం ట్వీట్ చేశారు. దీర్ఘకాలికంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడ్డారు. వ్యాధి తీవ్రం కావడంతో వైద్య అవసరాల రీత్యా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెలవులో ఉన్నారు. మే14న ఆయనకు మూత్రి పిండ మార్పడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఆర్థికమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు సమాయత్తమయ్యారు. ఈ విరామ సమయంలో జైట్లీ స్థానంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. Saddened by the death of the veteran Journalist Sh. Kuldip Nayar. His contribution to the cause of free speech is unparalleled. He is credited with breaking some of the most exclusive news stories. Will be best remembered for his struggle against the emergency. — Arun Jaitley (@arunjaitley) August 23, 2018 -
స్వాప్ పద్ధతిలో ఒకేసారి ఇద్దరికి కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు ‘స్వాప్’పద్ధతిలో ఒకే సమయంలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు బ్లడ్ గ్రూపుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం దాతలు, స్వీకర్తలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు బుధ వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలు డెక్కన్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాయక్, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ పవన్‌కుమార్, కిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్‌లు వెల్లడించారు. సింగరేణి కాలరీస్ ఉద్యోగి బిల్ల మల్లయ్య జన్యు సంబంధ మూత్ర పిండాల సమస్యతో బాధపడు తున్నాడు. చికిత్స కోసం ఆయన ఇటీవల డెక్కన్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా, పరీక్షించిన వైద్యులు కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతిందని, మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కార మని సూచించారు. కిడ్నీ దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నా కిడ్నీ లభించలేదు. దీంతో మల్లయ్య(బ్లడ్ గ్రూప్–బి)కు కిడ్నీ ఇవ్వడానికి భార్య పద్మ(బ్లడ్ గ్రూప్–ఎ) అంగీకరించింది. అయితే, స్వీకర్త, దాతల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం చికిత్సకు అడ్డంకిగా మారింది. ఇదే సమయంలో కిమ్స్‌లో కరీంనగర్‌కు చెందిన బానోతు రాజు(బ్లడ్ గ్రూప్–ఎ)ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన భార్య సునీత బ్లడ్‌గ్రూప్–బిగా తేలింది. ‘స్వాప్’ (రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో ఇద్దరు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవమార్పిడి చికిత్స)పద్ధతిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు భావించారు. ఆ మేరకు జీవన్‌దాన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనికి సుమారు ఆరునెలలు పట్టింది. సునీత నుంచి సేకరించిన కిడ్నీని డెక్కన్ ఆస్పత్రిలోని మల్లయ్యకు అమర్చగా, పద్మ నుంచి సేకరించిన కిడ్నీని బానోతు రాజుకు కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా అమర్చారు. రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను స్వైప్‌లో వీక్షిస్తూ చేశారు. ఈ తరహా చికిత్స దక్షిణాదిలో ఇదే మొదటిదని డాక్టర్ నాయక్ వెల్లడించారు. -
రోబో సర్జరీ.. కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్ : మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముగ్గురికి యశోద ఆస్పత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. రోబోటిక్ సహాయంతో వీరికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేశారు. బాధితుల్లో ఒకరికి అతని తల్లి కిడ్నీ దానం చేయగా.. మరో ఇద్దరికి వారి సతీమణులు కిడ్నీలను ఇచ్చారు. ప్రస్తుతం కిడ్నీ స్వీకర్తలు, దాతలు ఇద్దరూ కోలుకున్నారని, వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌రావు, యూరాలజిస్ట్ డాక్టర్ సూరిబాబు, నెఫ్రాలజిస్టు డాక్టర్ ఊర్మిళా ఆనంద్ సర్జరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చిలో ప్రస్తుతం ఈ తరహా శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సర్జరీలు నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పారు. ఒక్కో సర్జరీకి ఎనిమిది గంటలు.. వరంగల్‌కు చెందిన రాజు కొంగ(35) మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడాది నుంచి దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధితో అతను బాధపడుతున్నాడు. చికిత్స కోసం రాజు ఇటీవల యశోద ఆస్పత్రికి వచ్చారు. అక్కడ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఊర్మిళా ఆనంద్‌ను సంప్రదించగా.. అక్టోబర్ 6న అతనికి రోబోటిక్ సహాయంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. రాజు తల్లి మల్లికాంబ(70) అతనికి కిడ్నీ దానం చేసింది. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ఇలాంటి సమస్యతోనే బాధపడుతూ యశోద ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అజయ్ కుర్రే(38)కు అక్టోబర్ 7న సర్జరీ చేశారు. అజయ్ భార్య జ్యోత్రి తన కిడ్నీని భర్తకు దానం చేసింది. ఇక ఢిల్లీలోని హోటల్ మేనేజ్మెంట్ అధ్యాపకుడు(40) కూడా ఇలాంటి సమస్యతో ఆస్పత్రిలో చేరగా ఆయనకు అక్టోబర్ 16న శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయనకు కూడా భార్యే కిడ్నీ దానం చేశారు. ఒక్కో సర్జరీకి డాక్టర్ సూరిబాబు, డాక్టర్ సురేశ్‌బాబు నేతృత్వంలోని బృందం ఎనిమిది గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరంతా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పారు. చిన్న గాటే.. నో ఇన్ఫెక్షన్ రోబో సహాయంతో చేసే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను శరీరంపై కేవలం 3 అంగుళాల చిన్న గాటుతో పూర్తి చేయవచ్చని డాక్టర్ సూరిబాబు చెప్పారు. రోబోటిక్ సాయం తీసుకోవడంతో శరీరం లోపల ఉండే చిన్నచిన్న భాగాలు కూడా పది రెట్లు పెద్దవిగా కనిపిస్తాయని, అందువల్ల ముఖ్యమైన శరీర భాగాలకు నష్టం వాటిల్లకుండా శస్త్రచికిత్స పూర్తి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. తక్కువ రక్తస్రావం, నొప్పి ఉంటాయని, శస్త్రచికిత్స తర్వాత ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం చాలా తక్కువని చెప్పారు. సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ ఖర్చు కూడా తక్కువని తెలిపారు. -
జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం
గుంటూరు మెడికల్: స్థానిక ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో సోమవారం విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించి ఇప్పటికి ఐదు పూర్తి చేశారు. గుంటూరు బొంగరాలబీడు ఐదోలైన్కు చెందిన మరియమ్మకు తల్లి బెజవాడ విశ్రాంతమ్మ కిడ్నీ ఇవ్వటంతో ఆపరేషన్ విజయవంతమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆపరేషన్ జరిగింది. కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గొంది శివరామకృష్ణ, డాక్టర్ డేగల వాణి, యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ కేఎస్ఎన్చారి, బూసం ప్రకాశరావు, డాక్టర్ ఉప్పలపాటి సూర్యకుమారి, మత్తు వైద్యనిపుణులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శ్యామ్ కుమార్, డాక్టర్ వేణుగోపాల్ ఆపరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా సుమారు ఐదు లక్షల ఖరీదు చేసే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఉచితంగా చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినందుకు వైద్యులను అభినందించారు.