జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతం | GGH doctors success in kidney Transplantation | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతం

Published Tue, Jul 19 2016 6:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

GGH doctors success in kidney Transplantation

గుంటూరు మెడికల్‌: స్థానిక ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో సోమవారం విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ నిర్వహించారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించి ఇప్పటికి ఐదు పూర్తి చేశారు. గుంటూరు బొంగరాలబీడు ఐదోలైన్‌కు చెందిన మరియమ్మకు తల్లి బెజవాడ విశ్రాంతమ్మ కిడ్నీ ఇవ్వటంతో ఆపరేషన్‌ విజయవంతమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆపరేషన్‌ జరిగింది. కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్‌ గొంది శివరామకృష్ణ, డాక్టర్‌ డేగల వాణి, యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ కేఎస్‌ఎన్‌చారి, బూసం ప్రకాశరావు, డాక్టర్‌ ఉప్పలపాటి సూర్యకుమారి, మత్తు వైద్యనిపుణులు డాక్టర్‌ షరీఫ్, డాక్టర్‌ సుధాకర్, డాక్టర్‌ శ్యామ్‌ కుమార్, డాక్టర్‌ వేణుగోపాల్‌ ఆపరేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా సుమారు ఐదు లక్షల ఖరీదు చేసే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ ఉచితంగా చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేసినందుకు వైద్యులను అభినందించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement