వ్యక్తిగత సమాచారంతో మహిళలకు ఉద్యోగాలు!
న్యూయార్క్: మహిళలు ఉద్యోగాలు పొందడంలో వారి వ్యక్తిగత సమాచారం కీలక పాత్ర పోషిస్తుందనే ఆసక్తికర విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగాన్ని ఆశించే మహిళలు తమ రెజ్యూమ్ లో ఉండే ఖాళీల విషయంలో స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సి వస్తోందని, వ్యక్తిగతమైన కారణాలను కూడా ఇంటర్వ్యూ చేసేవారికి తెలిపాల్సి వస్తోందని ఈ అధ్యయనం చెబుతోంది.
దీనికి సమ్మతి తెలిపే మహిళలకు ఉద్యోగాలు పొందే అవకాశాలు 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన జోని హెర్ష్ అన్నారు. వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు 3 వేల మంది కంపెనీ యజమానుల్ని ప్రశ్నించి ఈ వివరాలు వెల్లడించారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమతో నిజాయతీగా ఉండటా న్ని ఇష్టపడతామని యజమానులు తెలిపారు. మహిళా అభ్యర్థుల రెజ్యూమ్ లో పదేళ్ల పాటు ఖాళీ ఉంటే.. ఆ సమయంలో వారేం చేశారో, తిరిగి ఎందుకు పనిలోకి చేరాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాయి.