Vanderbilt University
-
నాష్‌విల్లేలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నాష్విల్లే : అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు చల్లా కవిత హాజరయ్యారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఆటా, ఐసీఓఎన్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా మహిళలు తమ ప్రతిభకు పదును పెడుతూ పోటాపోటీగా ఆటపాటలతో అలరించారు. షాపింగ్ మేళాను నిర్వహంచారు. ఇండియన్ స్పెషల్ వంటకాలు, డ్యాన్స్‌లు, పాటలతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇండియన్ రిజినల్ లాంగ్వేజస్, కమ్యూనిటీ సర్వీస్‌లో కృషి చేసిన మహిళలు గ్రీష్మా బినోష్, హారిక కనగాల, కిరుతీగ వాసుదేవన్, శ్యామలి ముఖర్జీ, రచన కెడియా అగర్వాల్, డాక్టర్ అరుందతి రామేష్లను ఆటా సన్మానించింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు సభ్యులు జయంత్ చల్లా, అనిల్ బోడిరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆళ్ల, శివ రామడుగు, సుశీల్ చందా, శ్రీహాన్ నూకల, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూమిపై మొట్టమొదటి జీవులపై క్లారిటీ..
⇔ స్పాంజీలు కాదని తేల్చిన అమెరికా శాస్త్రవేత్తలు వాషింగ్టన్: సముద్ర జెల్లీలు భూమిపై ఉద్భవించిన మొట్టమొదటి జీవులని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. చాలా సంవత్సరాలుగా మరుగునపడి ఉన్న ఈ విషయాన్ని ఈ అధ్యయనాలు బయటపెట్టాయి. అమెరికాలోని వండర్బిల్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ భూ ప్రపంచ ప్రారంభజీవులు స్పాంజీలు కాదని, జెల్లీలేననే విషయాన్ని తమ పరిశోధన ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయంటున్నారు. ఇందుకోసం వారు ఫైలో జెనిటిక్ ట్రీని రూపొందించి... తద్వారా 18 రకాల జంతువులు, మొక్కలు, శిలీంద్రాలపై పరిశోధన చేశారు. మొదట కలుపు మొక్కల జన్యువులను ఒక్కొక్కటిగా పరిశీలించి తరువాత ఇతర జన్యులతో సరిపోల్చి చూశారు. ఇందులోభాగంగా వారు వేల సంఖ్యలో జన్యువులను విశ్లేషించారు. దీనిలో వారు జీవి పరికల్పనకు జన్యువులు ఎంతవరకు కారణమవుతున్నాయనే విషయాన్ని గమనించారు. అయితే అవన్నీ ఒకే వర్గ వికాసాన్ని నిలకడగా చూపిస్తున్నాయి. అయితే జెల్లీలలో మాత్రం పరిణామ క్రమం భిన్నంగా ఉంది. దీనికోసం జెనిటిక్ డేటా తీసుకుని వాటితో సరిపోల్చి జెల్లీలు మొదటి జీవులనే విషయాన్ని తేల్చారు. దాదాపు 95 శాతం పరిశోధన బాగా జరిగిందని, మిగతా ఐదు శాతంలో మాత్రమే కొన్ని భేదాలు ఉన్నాయన్నారు. -
ఘనంగా ఆటా-నాష్విల్లే మహిళా దినోత్సవ వేడుకలు
అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కేటర్‌పిల్లర్స్ ఉపాధ్యక్షులు మేరీ క్లెమెన్స్ ప్రత్యేక అతిథిగా హాజరు కాగా, మేరీ బేత్, రచనా అగర్వాల్, తనూజా రెడ్డి, ప్రమోద్, మోనికా కూలే తదితర పలువురు ప్రముఖ స్ధానిక మహిళా నేతలు కూడా హాజరయ్యారు. కార్యక్రమమంతా ప్రేరణాత్మక స్పీచ్‌లతో ఉల్లాసభరితంగా సాగింది. వక్తలందరూ తమ అనుభవాలను కార్యక్రమానికి విచ్చేసిన 400 మందికిపైగా మహిళల(ఇండియన్స్, నాన్‌ఇండియన్స్)తో పంచుకున్నారు. ఆటా నాష్విల్లే రీజినల్ కో-ఆర్డినేటర్ నరేందర్ రెడ్డి నూకల, ఆటా కమ్యూనిటీ సర్వీసెస్ స్టాండింగ్ కమిటీ చైర్ రామకృష్ణా రెడ్డి అల, ఆటా వ్యవస్ధాపక ప్రాజెక్టుల స్టాండింగ్ కమిటీ కో-చైర్ సుశీల్ చందా, ఆటా స్టాండింగ్ కమిటీ కో-కమిటీ కో-చైర్ కిషోర్ రెడ్డి గూడూరు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. -
చేప కన్నుతో చికిత్స!
-
చేప కన్నుతో చికిత్స!
వాషింగ్టన్: రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయిన వారు తిరిగి చూడగలిగేలా చేయగలమని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. జీబ్రా ఫిష్ మెదడులోని రసాయనిక చర్యల కారణంగా అది తన రెటీనాను కేవలం 28 రోజుల్లో పునరుత్పత్తి చేసుకోగలదని వండర్బిల్ట్ వర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. చేపలోని న్యూరోట్రాన్స్మీటర్ ‘గాబా’ వల్ల ఇది సాధ్యమవుతుందని వారు తేల్చారు. చేపతో పాటు క్షీరదాల్లో రెటీనాను పునరుత్పత్తి చేయగల శక్తి గాబాకు ఉందని, దీనివల్ల దెబ్బతిన్న రెటీనాను కన్ను తనంతట తానుగా పునరుత్పత్తి చేసుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ జేమ్స్ ప్యాటన్ తెలిపారు. రెటీనాకు గాయమైనప్పుడు అందులోని ముల్లర్గ్లియా అనే మూలకణాలు పూర్తిగా వ్యాప్తి చెంది దెబ్బతిన్న నాడీకణాలను పునరుద్ధరిస్తాయి. ఈ మూలకణాలు క్షీరదాల్లోనూ ఉన్నప్పటికీ వాటికి పునరుత్పత్తి శక్తి ఉండదని జేమ్స్ తెలిపారు. ఈ పరిశోధనా వివరాలు ‘స్టెమ్ సెల్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
వ్యక్తిగత సమాచారంతో మహిళలకు ఉద్యోగాలు!
న్యూయార్క్: మహిళలు ఉద్యోగాలు పొందడంలో వారి వ్యక్తిగత సమాచారం కీలక పాత్ర పోషిస్తుందనే ఆసక్తికర విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగాన్ని ఆశించే మహిళలు తమ రెజ్యూమ్ లో ఉండే ఖాళీల విషయంలో స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సి వస్తోందని, వ్యక్తిగతమైన కారణాలను కూడా ఇంటర్వ్యూ చేసేవారికి తెలిపాల్సి వస్తోందని ఈ అధ్యయనం చెబుతోంది. దీనికి సమ్మతి తెలిపే మహిళలకు ఉద్యోగాలు పొందే అవకాశాలు 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన జోని హెర్ష్ అన్నారు. వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు 3 వేల మంది కంపెనీ యజమానుల్ని ప్రశ్నించి ఈ వివరాలు వెల్లడించారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమతో నిజాయతీగా ఉండటా న్ని ఇష్టపడతామని యజమానులు తెలిపారు. మహిళా అభ్యర్థుల రెజ్యూమ్ లో పదేళ్ల పాటు ఖాళీ ఉంటే.. ఆ సమయంలో వారేం చేశారో, తిరిగి ఎందుకు పనిలోకి చేరాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాయి.