ఘనంగా ఆటా-నాష్‌విల్లే మహిళా దినోత్సవ వేడుకలు
Published Mon, Mar 13 2017 6:47 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్‌విల్లే(ఐసీఓఎన్)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కేటర్‌పిల్లర్స్ ఉపాధ్యక్షులు మేరీ క్లెమెన్స్ ప్రత్యేక అతిథిగా హాజరు కాగా, మేరీ బేత్, రచనా అగర్వాల్, తనూజా రెడ్డి, ప్రమోద్, మోనికా కూలే తదితర పలువురు ప్రముఖ స్ధానిక మహిళా నేతలు కూడా హాజరయ్యారు.
కార్యక్రమమంతా ప్రేరణాత్మక స్పీచ్‌లతో ఉల్లాసభరితంగా సాగింది. వక్తలందరూ తమ అనుభవాలను కార్యక్రమానికి విచ్చేసిన 400 మందికిపైగా మహిళల(ఇండియన్స్, నాన్‌ఇండియన్స్)తో పంచుకున్నారు. ఆటా నాష్‌విల్లే రీజినల్ కో-ఆర్డినేటర్ నరేందర్ రెడ్డి నూకల, ఆటా కమ్యూనిటీ సర్వీసెస్ స్టాండింగ్ కమిటీ చైర్ రామకృష్ణా రెడ్డి అల, ఆటా వ్యవస్ధాపక ప్రాజెక్టుల స్టాండింగ్ కమిటీ కో-చైర్ సుశీల్ చందా, ఆటా స్టాండింగ్ కమిటీ కో-కమిటీ కో-చైర్ కిషోర్ రెడ్డి గూడూరు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
Advertisement
Advertisement