nashville
-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా టోర్నమెంట్
-
అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్విల్లే రైజర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2023 వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. 9 జట్ల మధ్య పోరు ఈ కార్యక్రమంలో 9 మహిళా జట్లు పాల్గొనగా.. సుమారు 300 మంది ప్రేక్షకులు వారి ఆటను తిలకించారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కో-ఆర్డినేటర్లు క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేత ఎవరంటే ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నాష్విల్లే రైజర్స్ నిలిచింది. పవర్ గర్ల్స్ రన్నరప్, TNMM రెండో రన్నరప్గాన నిలిచాయి. విజేతలకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి, క్రీడ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందజేశారు. ఆటా నాష్విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్ -
నాష్విల్లే స్కూల్లో దురాగతం..మాజీ విద్యార్థి పనే
నాష్విల్లే: అమెరికాలోని నాష్విల్లే క్రిస్టి యన్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో తొమ్మిదేళ్ల ముగ్గురు చిన్నారులతోపాటు స్కూల్ హెడ్ కేథరిన్, ఒక సబ్‌స్టిట్యూట్ టీచర్, కస్టోడియన్ ఒకరు ఉన్నారు. అనంతరం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ల ఆడ్రే ఎలిజబెత్ హేల్ అనే ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తించారు. కాల్పుల గురించి పోలీసులకు 10.13 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే స్కూల్ వద్దకు చేరుకుని మొదటి అంతస్తులో ఉన్న విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. రెండో అంతస్తులో కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై హేల్ కాల్పులకు తెగించింది. వెంటనే జరిపిన ఎదురుకాల్పుల్లో హేల్ అక్కడికక్కడే హతమైంది. ఆమె వద్ద ఉన్న రెండు అసాల్ట్ రైఫిళ్లు, ఒక హ్యాండ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయింది. ఆమె స్కూల్లోకి కారులో వచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డయి ఉంది. షూటర్ హేల్ మాజీ విద్యార్థి అని అంటున్న పోలీసులు ప్రస్తుతం ఆమెకు స్కూల్‌తో గానీ స్కూల్ స్టాఫ్‌తో గానీ ఎటువంటి సంబంధాలున్నాయి? ఎవరిపై అయినా విరోధంతో ఈ ఘోరానికి పాల్పడిందా? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే, కోవెనంట్ స్కూల్‌పై ద్వేష భావం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీస్ చీఫ్ జాన్ డ్రేక్ అన్నారు. మరోచోట కూడా కాల్పులు జరిపేందుకు హేల్ పథకం వేసినట్లు భావిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్ ముగిసిన వెంటనే హేల్ ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు రెండు షాట్గన్లు దొరికాయి. ఇంకా స్కూల్‌కు సంబంధించిన మ్యాప్, ఇతర ప్రదేశాల మ్యాప్‌లు, కాల్పులకు ముందు రెక్కీ చేపట్టినట్లు ఆధారాలు దొరికాయి. ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు, అనూహ్య ఘటన జరగబోతోందంటూ కొద్ది నిమిషాలకు ముందే హేల్ తమకు మెసేజీలు పంపినట్లు స్నేహితులు చెబుతున్నారు. దారుణానికి వేదికైన కోవెనంట్ ప్రెస్బిటేరియన్ చర్చి స్కూల్ 2001లో ప్రారంభమైంది. ఇక్కడ ప్రి స్కూల్ నుంచి ఆరో గ్రేడ్ వరకు 200 మంది వరకు చిన్నారులు చదువుకుంటుండగా, 50 మంది సిబ్బంది ఉన్నారు. -
స్కూల్లో నరమేధం.. చిన్నారులు, సిబ్బంది మృతి
నాష్విల్లే: అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ మరోసారి ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. టేనస్సీ స్టేట్ రాజధాని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్లో సోమవారం ఘోరం జరిగింది. ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు(9 ఏళ్లలోపు వయసు వాళ్లే), ముగ్గురు సిబ్బంది(స్కూల్ హెడ్ సహా) ఉన్నారు. కాల్పులు జరిపింది అదే స్కూల్ పూర్వ విద్యార్థి కాగా, ఆమెను అక్కడిక్కడే కాల్చి చంపారు పోలీసులు. నాష్‌విల్లేకు చెందిన 28 ఏళ్ల ఆడ్రీ హేల్ ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు ప్రకటించారు. రెండు రైఫిల్స్ Assault Rifles, ఓ హ్యాండ్ గన్‌తో స్కూల్ సైడ్ డోర్ నుంచి ప్రవేశించిన దుండగురాలు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే కుప్పకూలారు. ఎమర్జెన్సీ కాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పదిహేను నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని దాడులకు ప్లాన్! మిగతా పిల్లలు, స్టాఫ్‌ను భద్రంగా బయటకు తీసుకొచ్చారు. కాల్పులకు దిగిన మహిళను అక్కడిక్కడే కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఆడ్రీ హేల్ అదే స్కూల్లో పూర్వ విద్యార్థి. ఆమెను ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని, బహుశా కోపంలోనే ఆమె అలా దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఆమె కాల్పులకు తెగబడింది. కేవలం స్కూల్‌ను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకోలేదు. ఆమె దగ్గర మరికొన్ని లొకేషన్లకు సంబంధించిన మ్యాప్‌లు దొరికాయి. అందులో ఈ స్కూల్ ఒకటి. బహుశా.. ఆమె మరిన్ని దాడులకు సిద్ధమై ఉందేమో అని ఓ అధికారి తెలిపారు. కోపంలోనే ఆమె కాల్పులకు దిగిందా? లేదా ఇంకా వేరే కారణం ఉందా? అనేది దర్యాప్తులో తేలుస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే కాల్పుల ఘటనపై వైట్‌హౌజ్ స్పందించింది. హృదయవిదారకరమైన ఘటన అని ఓ ప్రకటన విడుదల చేసింది. జో బైడెన్ ప్రభుత్వం చేస్తున్న ఆయుధ నిషేధ చట్టానికి Assault weapons Ban మద్దతు ఇవ్వాలంటూ రిపబ్లికన్లను వైట్‌హౌజ్ ఆ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి స్కూల్స్‌పై దాడుల్లో నరమేధం ఎప్పటికప్పుడు ఆయుధాల నిషేధ చట్టం గురించి చర్చ తీసుకొస్తోంది అక్కడ. కిందటి ఏడాది టెక్సాస్ రాష్ట్రంలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు చనిపోయారు. 2012లో.. కనెక్టికట్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది చనిపోగా.. అందులో 20 మంది పిల్లలే ఉన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా,నాష్విల్లే) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయబద్దంగా గణపతి, దుర్గమాతలకు పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరీమాతను ప్రత్యేకంగా అలంకరించారు. ఎన్నారై మహిళలంతా సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు పేర్చారు. అనంతరం ఆటపాటల మధ్య బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఆటా నాష్విల్లే మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాలతో పాటు మధు బొమ్మినేని, ఆలా రామకృష్ణారెడ్డి, నూకల నరేందర్‌రెడ్డి, గూడూరు కిశోర్, సుశీల్ చందా, రాధికారెడ్డి, లావణ్య నూకల, మంజు లిక్కి, శ్రీలక్ష్మీ, బిందు మాధవి, శిరీష కేస తదితరులు సహయ సహకారం అందించారు. చదవండి : లండన్‌లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు -
ఫేమస్ అవ్వాలని బాంబు పెట్టాడు!
వాషింగ్టన్: క్రిస్టమస్ పర్వదినం నాడు అమెరికా టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలో ఓ వాహనంలో అమర్చిన బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక దాడికి పాల్పడిన వ్యక్తిని ఆంథోనీ క్విన్ వార్నర్‌గా గుర్తించారు. అయితే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే క్విన్ వార్నర్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బాంబ్ బ్లాస్ట్ జరగడానికి వారం ముందు క్విన్ వార్నర్ ‘ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని’ ఇరుగుపొరుగు వారితో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా క్విన్ వార్నర్ ఇంటి పక్క నివసించే రిక్ లాడ్ అనే వ్యక్తి బాంబ్ బ్లాస్ట్‌కు వారం ముందు నిందితుడికి, తనకు మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు. ‘క్రిస్టమస్‌కు వారం రోజుల ముందు నేను, క్విన్ వార్నర్ కాసేపు పండగ గురించి ముచ్చటించుకున్నాం. మాటలో మధ్యలో క్విన్ వార్నర్ క్రిస్టమస్ సందర్భంగా శాంటా తన కోసం ఏదైనా మంచిది తీసుకురాబోతన్నాడు అని అన్నాడు. అంతేకాక ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని వ్యాఖ్యానించాడు. అయితే అతడి మాటల వెనక ఇంత దారుణమైన ఆలోచన దాగుందని నాకు ఆనాడు తెలియలేదు. అసలు అతడి మీద ఎలాంటి అనుమానం కలగలేదు’ అన్నాడు లాడ్. ప్రస్తుతం అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ వెనక గల ప్రధాన ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే క్విన్ వార్నర్ కంప్యూటర్, హార్డ్డ్రైవ్ని స్వాధీనం చేసుకున్నారు. (15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు) గత శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలింది. అయితే పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ రిక్రియేషనల్ వ్యాన్ నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన తమకు వచ్చినట్లు తెలిపారు. మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది అంటూ రికార్డు చేసి ఉంచిన సందేశం తమకు వినపడిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించామని, దీంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. -
అమెరికాలోని నాష్‌విల్లేలో బాంబు పేలుడు
నాష్విల్లే : అమెరికాలోని నాష్విల్లే డౌన్టౌన్లో శుక్రవారం పేలుడు సంభవించింది. దట్టమైన నల్లటి పొగ వ్యాప్తించిందని స్థానికులు చెప్పారు. పేలుడు ఘటనలో కొన్ని ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కిటికీలు పగిలిపోయాయి. ముగ్గురు గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు భావిస్తున్నామని అధికారులు చెప్పారు. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. నాష్విల్లే డౌన్‌టౌన్ ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడ బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయి. క్రిస్మస్ పండుగ రోజే పేలుడు జరగడం చర్చనీయాంశంగా మారింది. -
కరోనాతో హాలీవుడ్ నటుడు మృతి
లాస్ ఏంజిల్స్ : కరోనా మహమ్మారికి మరో సెలబ్రిటీ మృత్యువాతపడ్డారు. హాలీవుడ్ నటుడు అలెన్ గార్ఫిల్డ్(80) కరోనా సమస్యల కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అలెన్‌కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గొప్ప నటుడు, నాష్విల్లెలో నాకు భర్తగా నటించిన వ్యక్తి కరోనా వల్ల ఈ రోజు(మంగళవారం) మరణించారు. అతని కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అని ఫేస్బుక్లో రాశారు. (కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మృతి) నాష్విల్లే, ది స్టంట్ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్ బాక్సర్‌గా, స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1968 లో వచ్చిన 69 చిత్రంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఇక అలెన్.. విలన్ ప్రాత్రల్లోనే అధికంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వూడీ అలెన్, విమ్ వెండర్స్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన చివరిసారి 2016లో విడుదలైన చీఫ్ జాబులో కనిపించారు. ఈ సినిమా 1986లో రూపొందించారు. (నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం? ) -
టోర్నడో విధ్వంసం
నాష్విల్లే: అమెరికాలోని నాష్‌విల్లేలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం టెన్నెస్సీలో వచ్చిన టోర్నడోల కారణంగా 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది గల్లంతయినట్లు చెప్పారు. దాదాపు 40 భవనాలు నేలమట్టమయినట్లు చెప్పారు. నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాప్టర్ల ద్వారా సర్వే చేస్తున్నారు. స్కూళ్లు, కోర్టులు, విమానాశ్రయాలు మూతబడ్డాయి. -
నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కల్యాణం
టేనస్సీ : నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు కల్యాణ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కమిటీ సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, నరెందర్‌రెడ్డి నూకల, సుషీల్ చంద, కిషోర్‌రెడ్డి గూడూరు, ప్రకాశ్‌రెడ్డి ద్యాప, రాధిక రెడ్డి, లావణ్య నూకల, కళ ఉప్పలపాటి, ప్రశాంతి, మంజు లిక్కి, దీప, శిరీష కేస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
నాష్‌విల్లేలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నాష్విల్లే : అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు చల్లా కవిత హాజరయ్యారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఆటా, ఐసీఓఎన్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా మహిళలు తమ ప్రతిభకు పదును పెడుతూ పోటాపోటీగా ఆటపాటలతో అలరించారు. షాపింగ్ మేళాను నిర్వహంచారు. ఇండియన్ స్పెషల్ వంటకాలు, డ్యాన్స్‌లు, పాటలతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇండియన్ రిజినల్ లాంగ్వేజస్, కమ్యూనిటీ సర్వీస్‌లో కృషి చేసిన మహిళలు గ్రీష్మా బినోష్, హారిక కనగాల, కిరుతీగ వాసుదేవన్, శ్యామలి ముఖర్జీ, రచన కెడియా అగర్వాల్, డాక్టర్ అరుందతి రామేష్లను ఆటా సన్మానించింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు సభ్యులు జయంత్ చల్లా, అనిల్ బోడిరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆళ్ల, శివ రామడుగు, సుశీల్ చందా, శ్రీహాన్ నూకల, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
టెన్నెస్సీ : అమెరికాలోని నాష్విల్ నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. సుమారు 700 మందికి పైగా పాల్గొన్న ఈ సంబరాలకు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వం వహించారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజతో సంబరాలను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణలో గుడుల్లోలానే తులసి అమ్మవారి విగ్రహంతోపాటు బతుకమ్మ ముగ్గు వేసి మరీ చేసిన అందరంగా అలంకరించి వేడుకలను జరిపారు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు వేదిక ప్రాంగణానికి వన్నె తెచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తూ ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ లను భక్తిశ్రద్దలతో కొలిచారు. అలాగే స్థానిక కళా నివేదనం, కోలాటం మరియు ధీంతానా గ్రూప్స్ వారు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్థానిక వ్యాపారులు ఏర్పాటు చేసిన వెండర్ స్టాల్స్ లో అందరు కలియ తిరుగుతూ షాపింగ్ చేశారు. సభాప్రాంగణ సమర్పకులకు, ఫుడ్ వాలంటీర్లకు సర్ప్రైజ్ రాఫుల్ బహుమతులు అందజేశారు. బతుకమ్మ పోటీలలో రెండు కేటగిరీల్లోనూ రంగు రంగుల పూలతో ఎంతో అందంగా, క్రియేటివ్‌గా చూడ చక్కగా అలంకరించడంలో విజేతలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. విజేతలకు చీరలు బహుకరించారు. బతుకమ్మను తెచ్చినవారందరికి గుడీ బ్యాగ్స్ అందజేశారు. అలాగే స్టెమ్ బిల్డర్స్ వారు సమర్పించిన రాఫుల్ బహుమతులు కూడా అందజేశారు. మహిళలకు ఆహ్వానంలో భాగంగా మల్లె పూలు, జాజి పూలు అలాగే తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో తాంబూలం అందించారు. చివరిగా టెన్నెస్సీ తెలుగు సమితి బతుకమ్మ సంబరాలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాష్విల్ వాసులందరికి, రుచికరమైన తేనీయ విందునందించిన అమరావతి రెస్టారంట్, ప్యారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ వారికీ, ఈ కార్యక్రమ రూపకల్పనలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులకు, యూత్ కమిటీ సభ్యులకు, శ్రేయోభిలాషులకు దీప్తి రెడ్డి దొడ్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. -
నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
టేనస్సీ: నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కమిటీ సభ్యులు ఆల రామకృష్ణా రెడ్డి, నూకల నరేందర్ రెడ్డి, సుషీల్ చందా, గుడూరు కిశోర్ రెడ్డి, దయప ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రవి కిరణ్, రాధిక రెడ్డి, నూకల లావణ్య, మంజూ లిక్కి, బూస సునీత, అరమండ్ల రాధిక, రాచకొండ సాయిరాం, కేస సిరిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాష్‌విల్లేలోని గణేష్ ఆలయం విస్తరణ పనులను గత కొన్ని ఏళ్లక్రితమే ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి దాదాపు 4 మిలియన్ల డాలర్లను ఖర్చుచేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్) సభ్యులు పెద్ద మొత్తంలో ఆలయానికి విరాళాలు ఇచ్చారు. గత ఏడాది కూడా శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఘనంగా ఆటా-నాష్విల్లే మహిళా దినోత్సవ వేడుకలు
అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కేటర్‌పిల్లర్స్ ఉపాధ్యక్షులు మేరీ క్లెమెన్స్ ప్రత్యేక అతిథిగా హాజరు కాగా, మేరీ బేత్, రచనా అగర్వాల్, తనూజా రెడ్డి, ప్రమోద్, మోనికా కూలే తదితర పలువురు ప్రముఖ స్ధానిక మహిళా నేతలు కూడా హాజరయ్యారు. కార్యక్రమమంతా ప్రేరణాత్మక స్పీచ్‌లతో ఉల్లాసభరితంగా సాగింది. వక్తలందరూ తమ అనుభవాలను కార్యక్రమానికి విచ్చేసిన 400 మందికిపైగా మహిళల(ఇండియన్స్, నాన్‌ఇండియన్స్)తో పంచుకున్నారు. ఆటా నాష్విల్లే రీజినల్ కో-ఆర్డినేటర్ నరేందర్ రెడ్డి నూకల, ఆటా కమ్యూనిటీ సర్వీసెస్ స్టాండింగ్ కమిటీ చైర్ రామకృష్ణా రెడ్డి అల, ఆటా వ్యవస్ధాపక ప్రాజెక్టుల స్టాండింగ్ కమిటీ కో-చైర్ సుశీల్ చందా, ఆటా స్టాండింగ్ కమిటీ కో-కమిటీ కో-చైర్ కిషోర్ రెడ్డి గూడూరు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. -
అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా!
అమెరికన్ మ్యూజికల్ డ్రామా సిరీస్ 'నాష్ విల్లే' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా అతిధి పాత్రలో దర్శనివ్వనున్నారు. మే 7 తేదిన ప్రసారం కానున్న ఏబీసీ డ్రామా ఎపిసోడ్ లో యూఎస్ ప్రథమ పౌరురాలు మిచెల్లీ అతిధి పాత్రలో కనిపించనున్నారు. కోని బ్రిటన్ సరసన మిచెల్లీ నటించనున్నారని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఇకముందు ఇలాంటి పాత్రలు చేస్తానని అనుకోవడం లేదని, దేనికి వెనకంజ వేయడం తన నైజం కాదని మిచెల్లీ అన్నారు. ఏది మంచి అనుకుంటే దాన్ని మహిళలు స్వీకరించాలని మిచెల్లీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలోని ఓ క్యారెక్టర్ అఫ్ఘనిస్తాన్ లో గాయపడటంతో మిచెల్లీకి ఈ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఓ చారిటీ షోలో పాల్గొనాల్సిన మిచెల్లీ ఈ కార్యక్రమంలో నటించడానికి ఒప్పుకున్నారు.