నాష్‌విల్లే : అమెరికాలోని నాష్‌విల్లే డౌన్‌టౌన్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. దట్టమైన నల్లటి పొగ వ్యాప్తించిందని స్థానికులు చెప్పారు. పేలుడు ఘటనలో కొన్ని ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కిటికీలు పగిలిపోయాయి. ముగ్గురు గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు భావిస్తున్నామని అధికారులు చెప్పారు. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. నాష్‌విల్లే డౌన్‌టౌన్ ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడ బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయి. క్రిస్మస్ పండుగ రోజే పేలుడు జరగడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment