అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్‌విల్లే రైజర్స్ | ATA Women’s Short Cricket Tournament Winner Nashville Risers | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్‌విల్లే రైజర్స్

Published Tue, Apr 11 2023 12:59 PM | Last Updated on Tue, Apr 11 2023 1:13 PM

ATA Women Short Circket Tournament Winner Nashville Risers - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2023 వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లే నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. 

9 జట్ల మధ్య పోరు
ఈ కార్యక్రమంలో 9 మహిళా జట్లు పాల్గొనగా.. సుమారు 300 మంది ప్రేక్షకులు వారి ఆటను తిలకించారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కో-ఆర్డినేటర్లు క్రిష్ నూకల,  సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్‌విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు.

రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్‌ చందా (విద్యాకమిటీ చైర్‌) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 

విజేత ఎవరంటే
ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌ విజేతగా నాష్‌విల్లే రైజర్స్ నిలిచింది. పవర్ గర్ల్స్ రన్నరప్‌, TNMM రెండో రన్నరప్‌గాన నిలిచాయి. విజేతలకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి, క్రీడ పట్ల నిబద్ధతను  ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందజేశారు.

ఆటా నాష్‌విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన  ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా  సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement