america telugu association
-
హైదరాబాద్ : ఆప్త బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
‘నైటా’ అధ్యక్షురాలిగా ఏనుగు వాణి
ఆత్మకూరు(ఎం): అమెరికాలోని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. ఏనుగు వాణి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని సిద్దాపురం. న్యూయార్క్ నగరంలోని రాడిసన్ హోటల్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కార్యవర్గాన్ని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. నైటాలో మొత్తం వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షురాలిగా ఏనుగు వాణితో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి చైర్మన్‌తో సహా 12 మందితో కార్యవర్గం ఎన్నికైంది. నలుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఏనుగు వాణి భర్త ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి ‘నైటా’ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఏనుగు వాణి పుట్టినిల్లు యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామం కాగా.. ఇదే జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురం మెట్టినిల్లు. 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ‘నైటా’ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు న్యూయార్క్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. -
న్యుజెర్సీలో గ్రాండ్‌గా మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ 2024
అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ‘మాటా’ అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా క్యారం బోర్డు.. ఈ పోటీలను నిర్వహించటం విశేషం.పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యారమ్ పోటీల్లో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయస్థాయి క్రీడాకారులూ పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రతి జట్టు కేవలం డబుల్స్‌లోనే పాల్గొనగా, ప్రథమ బహుమతిగా 1,116 డాలర్లు, రెండో బహుమతిగా 516 డాలర్లు, మూడవ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి.. సత్కరించారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని గ్రాండ్ స్పాన్సర్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈవో, ప్రెసిడెంట్ రఘు వీరమల్లు అన్నారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆదిత్య లోధా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ సెనేటర్ పాట్ డిగ్నాన్, అసెంబ్లీమన్ స్టెర్లే స్టాన్లీ, మిడిల్సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్, ఎడిసన్ కౌన్సిలర్ అజయ్ పాటిల్, డా. ఉపేంద్ర చివుకులా, చీఫ్ కంప్లేన్స్ ఆఫీసర్ ఉదయ్ కులకర్ణి, తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ పోటీ నిర్వహణకు మాటా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సురేష్ బాబు కజానా ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మాటా వ్యవస్థాపకులు, అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాటా సంస్థ తరుపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. -
డాలస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్‌లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు అయినా గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు.ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయులు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు... మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కల్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు. -
ATA Convention 2024: అదరహో అన్నట్టుగా సాగుతున్న ‘ఆటా’ ఆటల పోటీలు
కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తుల సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహం. ఈ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు మామూలు వాళ్ళు కాదండోయ్.. ఆటపాటలతో పాటు ఆరోగ్యమే మహా భాగ్యమన్న రీతిలో అమెరికాలోని పలు నగరాలలో మెగాఆటా కన్వెన్షన్(18వ) నిర్వహించనుంది.యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న వారికి.. అదే విధంగా ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కన్వెన్షన్ ఈవెంట్ జూన్ 7న మొదలుకానుంది. అందరూ ఆహ్వానితులే, మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.org ని సందర్శించాలని ఆటా తెలిపింది.కాగా ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏబిసి సెంటర్లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో పోటీ తీవ్రంగా ఉండటం క్రీడాస్ఫూర్తిని మరింత పెంచింది.ఇక షేఖరాగ్ పార్క్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సరే సరి.. అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొనడం.. మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అదే విధంగా... పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొన్న చదరంగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రోనిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్‌లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్లలోకి హైలైట్ అని చెప్పవచ్చు. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీమ్ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్లకు జరిగాయి.ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకచోట చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభ మరియు మధ్య స్థాయిలలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలను కలిగి ఉంది, పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా, జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది.స్పోర్ట్స్ కమిటీ ఛైర్ అనంత్ చిలుకూరి, ఉమెన్స్ స్పోర్ట్స్ ఛైర్ నీతూ మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలి స్పోర్ట్స్ ఈవెంట్ల విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాళ్ల ప్రతిభ, క్రీడాస్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఈవెంట్లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి మున్ముందు మరిన్ని జరగబోతున్నాయి’’ అని తెలిపారు.కాగా స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు అనంత్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సికాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, , శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి అవుతు, దివ్య నెట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతో మంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది.ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో, భారీ జనసందోహం ముందు జరగబోతున్నది. అలానే, ఆటా వారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనం అందించారు. అందరూ తప్పకుండా రండి, కలిసి మెలిసి మన ఆటా కన్వెన్షన్ ని ఆడుతూ, పాడుతూ జరుపుకుందామని ఆటా పిలుపునిస్తోంది. -
అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !
పెళ్లిళ్ల విషయాల్లో మనకూ వాళ్లకున్న స్పష్టమైన తేడా , మనవి చాలావరకు పెద్దలు నిశ్చయించిన అరేంజ్డ్ మ్యారేజెస్ కాగా వాళ్ళవి ప్రేమ వివాహాలు. అమెరికన్ల వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడమంటే ఒక తేనె తెట్టెను కదిల్చినట్లే. వివాహం ఒక జీవితకాల బంధంగా భావించేవారు ఆ దేశంలో దినదినం తగ్గిపోతున్నారు. పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం రెండూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావడంతో అసలు పెళ్లెందుకు ? అని ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు . పెళ్ళైనా కాకున్నా తప్పవు చికాకులు అందుకే పెళ్ళి.. బెటర్ విందువినోదాలు బెల్లమైనా పెళ్ళామైనా కొత్తలో చాలాతీపి పాతబెల్లం మందులకు.. పెళ్ళాం పిల్లలకు నచ్చినవాడే కాదు మెచ్చినవాడు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడే కళ్యాణం కలిసివుండడం గుడ్.. కుదరనప్పుడు నిత్యకలహాలకన్నా విడిపోవడం వెరీగుడ్ఇందులో మొదటి రెండు భారతీయుల మనస్తత్వాన్ని , చివరి రెండు అమెరికా వాళ్ళ ఆలోచనా ధోరణిని తెలిపే కవితలు. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే యువతీ యువకులు , సేమ్ సెక్స్ ( స్వలింగులు ) జంటలు ఆ దేశంలో పెరిగిపోతున్నాయి. వీళ్లను అదుపు చేయగలగిన కుటుంబ పెద్దల వ్యవస్థ అక్కడ బలహీనమై పోయింది. పేరెంట్స్ డే నాడు కలుసుకోడానికి వచ్చినప్పుడే పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటున్నారో పెద్దలకు తెలిసే పరిస్థితులు. మన దేశంలో పొద్దున్నుండి రాత్రి వరకు స్త్రీ చేసిన ఇంటి వంట పనులు, పిల్లల పోషణ లెక్కలోకి రావడం లేదు. కులాలు, మతాలు ప్రాతిపదికనళ్లు పెళ్లిళ్లే ఉండవు..ఆమె భర్త చాటు అబల మాత్రమే, సమవుజ్జి కాలేని పరిస్థితులు ఇప్పటికీ నెలకొనివున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. బయటకు వెళ్లి మగవాడు చేసిందే సంపాదన , ఆయనే కుటుంబ యజమాని. అమెరికాలో పరిస్థితి భిన్నం. మహిళ సబల, భర్త వెనక నడిచే భార్య కాదు. ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ షాపింగ్, జిమ్, బ్యూటీ పార్లర్, సినిమా షికార్లకు వెళ్లి రాగలదు. అక్కడ భార్యభర్తలు ఇద్దరూ ఏదో ఓ ఉద్యోగం చేసేవారే. తండ్రి మాత్రమే బ్రెడ్ విన్నర్, తల్లి గృహ సంరక్షకురాలు మాత్రమే అనడానికి లేదు. ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసివున్నా ఎవరి సంపాదన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికెవరు భయపడాల్సిన పనిలేదు.తేడాలు వస్తే , కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల పెంపక బాధ్యతలు పంచుకుంటున్నారు. అమెరికాలో కులాలు, మతాల ప్రాతిపదికన పెళ్లిళ్లు ఉండవుఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు ఎంచుకోవచ్చుపెళ్లికి ముందే తప్పనిసరిగా పరిచయం అయి ఉంటుందిఒకరి గురించి మరొకరికి సంపూర్ణంగా అవగాహన కలిగే వారకు కలిసి ఉంటారుఇద్దరి అభిప్రాయాలు ఒక్కటై.. కలిసి ఉంటామన్న నమ్మకం ఏర్పడ్డ తర్వాతే పెళ్లి చేసుకుంటారుఅమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెళ్లికి సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పద్ధతులున్నాయివయస్సులో భర్త పెద్దగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం, ఇష్టం ఉంటే చాలుఅమెరికాలో పెళ్లిళ్లకు ముందే చాలా మంది కౌన్సిలర్లను కలుస్తారు. భాగస్వామితో కలిసి ఒకరి గురించి మరొకరు చర్చిస్తారు. బంధం ధృడమయ్యేందుకు చర్చలు జరుపుతారుఆడ-మగ అనే కాదు, స్వలింగ వివాహాలు కూడా ఇక్కడ చట్టబద్ధమేపెళ్లికి ఎంతో విలువ ఇస్తారు. చట్ట ప్రకారం ఇద్దరికి అన్ని హక్కులు సమానంగా ఉంటాయిభారతదేశంతో పోలిస్తే విడాకులు ఇక్కడ సర్వసాధారణంవిడాకుల విషయంలో కోర్టులు విధించే భారీ పరిహారమే భయపెట్టేలా ఉంటుందిభారత్లో జరిగినట్టుగా పెళ్లిళ్లు భారీ హడావిడితో జరగవు.డెస్టినేషన్ వెడ్డింగ్‌లు కూడా జరుగుతాయి. మంచి పర్యాటక ప్రాంతాల్లో పెళ్లి చేసుకోవడమంటే అమెరికన్లకు ఇష్టంపెళ్లి ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. వర్చువల్‌గా విషెస్ చెబుతారు.చాలా వరకు పెళ్లిల్లు వీకెండ్లోనే జరుగుతాయి.మన దగ్గర పెళ్లి చీరకు ఎంత విలువ ఉంటుందో.. అక్కడ వెడ్డింగ్ గౌన్‌కు అంత ప్రాధాన్యత.భారత్ నుంచి వెళ్లి సెటిలయ్యే వారిలో కొందరు అమెరికన్లను పెళ్లి చేసుకున్నవారున్నారు. అయితే ఈ పెళ్లిళ్ల వెనక కూడా లీగల్ పాయింట్లు లాగే వారున్నారు. పౌరసత్వం కోసం కొందరు పెళ్లికి ఆరాట పడ్డా.. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినమయ్యాయి. పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చే వాళ్లను కఠిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడ పరిచయం, ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు? పెళ్లికి ఇద్దరికి ఎప్పుడు ఒప్పందం కుదిరింది? ఇలాంటి ప్రశ్నలతో పాటు ఆధారాలు చూపించమంటున్నారు. పెరుగుతున్న విడాకులతో పాటు సహజంగానే పునర్వివాహాలు కూడా ఎక్కువవుతున్నాయి. అమెరికాలో సగానికి పైగా కుటుంబాలు పునర్వివాహాలు చేసుకున్నవారే. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆమె పిల్లలు, ఆయన పిల్లలు, వారి పిల్లలు ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెరిగిపోతున్న విడాకుల ప్రభావం పిల్లల మానసిక స్థితి పై పడుతుంది వాస్తవం. వీటికి తోడు పెళ్లికాని టీనేజ్ పిల్లలు గర్భం దాల్చడం, అసలు పెళ్లే చేసుకోకుండా కలిసివున్నవారు కన్న పిల్లలు ఇప్పుడు అమెరికా సమాజానికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు . నల్ల జాతీయుల్లోనైతే వివాహేతర జననాలు 25 శాతం వరకు ఉంటాయంటున్నారు !.వేముల ప్రభాకర్(చదవండి: టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?) -
కట్టమూరులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. దీనిలో భాగంగా నాట్స్ తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి చొరవతో కాటూరు మెడికల్ కాలేజీ వారి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందికి పైగా రోగులకు శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, శ్వాస కోస, ఊపిరితిత్తులు, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఎముకలు, కీళ్లు ఇలా 12 విభాగాలకు చెందిన వైద్యులు.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే లక్ష్యంతోనే తాము ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సందర్భంగా తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, స్థానిక ప్రముఖులు మాగలూరి భాను ప్రకాష్, బొల్లు సురేశ్, హరి కొల్లూరు, కిరణ్ కుంచనపల్లి, గ్రామ పెద్దలు శివప్రసాద్, మల్లికార్జున రావు, నరేష్, శ్రీనివాస రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మందులు అందించడం అభినందనీయమని శ్రీ హరి మందాడిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందిన వారు తమ కోసం శ్రీ హరి మందాడి చూపిన చొరవ, సేవాభావాన్ని కొనియాడారు.(చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!
సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సందేశాన్ని భావితరానికి తెలియజేయడంతో పాటు వారిలో సామాజిక స్ఫూర్తిని రగిలించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ తాజాగా ప్లోరిడాలోని టంపాబే లో అనాథ పిల్లల కోసం పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మిడిల్ స్కూల్ పిల్లలు 10 మంది పెద్దలు కలిసి అనాథ పిల్లల కోసం శాండ్విచ్లను తయారు చేశారు.. ఇలా చేసిన వాటిని టంపా లోని అనాధశ్రమానికి అందించింది. నిరాశ్రయులైన అనాథ పిల్లలకు మనం కూడా సామాజిక బాధ్యతగా ఏదో ఒక్కటి చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, నాట్స్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ సేవాభావాన్ని చాటారు. నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ అచ్చిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమం నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు.(చదవండి: టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?) -
US: యూఎస్‌లో అసలైన అమెరికన్లు ఎంతమందంటే..!
భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అవడంతో, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అందరికీ ఉపాధి కల్పించడం, నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా సవాలు లాంటిదే. అందుకే బతుకు దెరువు వెతుక్కుంటూ అటు అరబ్బు దేశాలకో, ఇటు చదువుల పేర అమెరికా లాంటి దేశాలకో వెళ్లడం ఇప్పుడు మన యువతకు తప్పడంలేదు. మనదే మనదే మనదే.. ఈ ప్రపంచమంతా మనదే శక్తి యుక్తి సామర్థ్యాలకు.. సరిహద్దులతో పనిలే కష్టపడి పనిచేసే వారిని.. కాదనువారు లేరులే విశ్వాసంతో ముందుకు వెళితే.. అపజయమన్నది లేదులే గడప దాటితే ఒంటరివెట్లా.. బాటసారులే బంధుమిత్రులు కలిసి నడిస్తే మాట కలిపితే.. ప్రపంచమంతా మనదేలే ! మన NRIలను ఉద్దేశించి నేను రాసిన ‘వలస పక్షులు ’ అన్న ఒక చిన్న కవితలో. అయితే బయటి దేశాలు ఏవైనా వాళ్ళ అవసరాలను బట్టే విదేశీయులను అనుమతిస్తాయి, అందులో కూడా పైకి ఎన్ని చెప్పినా అంతరాంతరాల్లో కొంత వివక్ష ఉండనే ఉంటుంది. ఒక విధంగా చూస్తే అమెరికా పూర్తిగా వలసవాదుల దేశం. ఆ దేశ జనాభాలో నిజమైన భూమిపుత్రుల సంఖ్య నామమాత్రమే. చరిత్రలోకి వెళితే ఆ దేశంలో కొలంబస్ అడుగు పెట్టింది 1492 లో. అలా అమెరికా కు వచ్చిన సెటిలర్స్ రెడ్ ఇండియన్స్‌ను పూర్తిగా తొక్కిపెట్టి అక్కడి పాలకులయ్యారు. బ్రిటిష్ వారి నుంచి వారు స్వాతంత్య్రం ప్రకటించుకున్నది 1776 జులై 4 న. ఆఫ్రికా దేశాల నుంచి బానిసలుగా తెచ్చుకున్న నల్లవారి శ్రమశక్తితో వారు తమ వ్యవసాయాన్ని వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నది నిజం. ఆలస్యంగా నైనా తమ తప్పిదాన్ని గ్రహించి, బానిసత్వాన్ని నిషేధించి అమెరికా నాగరిక దేశం అనిపించుకున్నది 1807 లో మాత్రమే. కాని బానిస వ్యాపారం ఆ దేశంలో అంత సులభంగా పోలేదు, అదో అంతర్యుద్దానికి దారి తీసింది. అబ్రహం లింకన్ ఆ దేశాధ్యక్షుడు అయినాకనే ( 1860) అక్కడి జాత్యహంకారులపై విజయం సాధ్యమైంది. అదీ ఆ మహానుభావుని ప్రాణత్యాగంతో. ఎలాగైతేనేం అలా వచ్చిన వలసవాదులు, వారిచే బానిసలుగా తీసుకు రాబడ్డవారు, బతుకుదెరువు కోసం వచ్చినవారు అంతా కలిసి ఆ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళే మా దేశంలోకి అక్రమ వలసలు పెరిగిపోతున్నాయని బాధపడిపోవడం విశేషం. పక్కనే వున్న మెక్సికో లాంటి దేశాల నుండి చాలామంది దొంగచాటుగా ప్రాణాలకు తెగించి వచ్చి అమెరికాలో ఏ పని దొరికితే ఆ పని చేసుకొని బతుకుతున్నారు. నిర్మాణ రంగంలో, పారిశుద్ధ్య పనుల్లో, ఇంటి పనుల్లో అన్నింట్లో వాళ్ళే కనిపిస్తారు. తక్కువ వేతనం మీద ఎక్కువ శ్రమ చేస్తున్న వీరు ఒక్క రోజు పని మానేస్తే అక్కడి నగరాలు చెత్త కుప్పల్లా కనబడుతాయి మరి. కానీ ఇలాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రాంట్స్ ను కట్టడి చేయాలని, అమెరికాలో పుట్టినంతమాత్రానే వాళ్లకు పౌరసత్వం ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు కొన్ని. చైనా, పాకిస్థాన్, ఇండియా వంటి దేశాల నుంచి కూడా అక్రమ వలసలు పెరుగుతున్నాయంటారు. మన గుజరాతీలు, పంజాబీలు, దక్షిణాది రాష్ట్రాల వారు కూడా వ్యాపార రంగాల్లో బాగా స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ పుణ్యమా! అని ఇప్పుడు యూఎస్ లోని ఏ సిటీకి వెళ్లినా కనబడే NRIల్లో తెలుగు వారే ఎక్కువ, మంచి కమ్యూనిటీల్లో ఉంటున్నది కూడా మన వాళ్లే, ఎక్కువ కష్టపడే వాళ్లు కూడా మనవాళ్లే. సెలవులు, వీకెండ్లను కూడా త్యాగం చేసి శ్రమిస్తూనే కనిపిస్తారు. ఇక్కడికి చదువుల కోసమని వస్తున్న మన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇక్కడ ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్న పని అవడంతో, జేబు ఖర్చులకోసం మన పిల్లలు చిన్న చిన్న పనుల్లో కనబడుతున్నారు. వీటికి తోడు ఇటీవలి కాలంలో మనవారి గుళ్ళు గోపురాల హడావిడి ఎక్కువవడంతో దీన్ని కొందరు గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల భారత సంతతి వారిపై కొంత ఈర్ష్యాద్వేష భావాలు పెరుగుతున్న వార్తా సంకేతాలు. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా అమెరికాలో కూడా పేదరికం ఉంది, అక్కడక్కడ అడుక్కుతినేవాళ్ళు కనబడతారు. ఇండియాలో ఉన్నా అమెరికా వెళ్లినా ప్రతినిత్యం నేను విధిగా చేస్తున్నది మార్నింగ్ వాక్. అలా అమెరికాలో నేను బయటికి వెళ్తున్నప్పుడల్లా మా అమ్మాయి పర్సులో డబ్బులున్నాయా డాడీ ! అని అడిగేది. నేను షాపింగ్‌కు వెళ్లడం లేదు కదా! అంటే ‘అలా కాదు, కనీస మొత్తం డాలర్లైనా దగ్గరుండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా ఎవరైనా మగ్గర్స్ వచ్చి అడిగితే ఎదురు చెప్పకుండా వాళ్లకు ఉన్నవి ఇచ్చేయడం మంచిది. ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ జాగ్రత్త ! ’ అని హెచ్చరించేది!. నాకు మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఆడా మగా అనకుండా వాకింగ్‌లో చిరునవ్వుతో ‘ హాయ్ ’ అని చెప్పడం నన్ను ముగ్దుణ్ణి చేసిన విషయం ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా లైబ్రరీ ఇంత బాగుంటుందా! అందులోనే..!) -
Vyuham fever @ US : అమెరికాలో వైఎస్సార్సిపి సిద్ధం
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా తీసిన ఆర్జీవీ తీసిన వ్యూహం-శపథం సినిమాల సందర్భంగా అమెరికాలో సందడి నెలకొంది. వ్యూహం, శపథం సినిమాలను చూసిన అమెరికాలోని వైఎస్సార్సిపి నాయకులు, అభిమానులు రాంగోపాల్‌వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా "సిద్ధం" అని ప్రకటించిన ఎన్నారైలు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధించడమే మా "వ్యూహం" అని చాటి చెప్పారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు వ్యూహం సినిమా సందర్భంగా సంబరాలు నిర్వహించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాను అడ్డుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు చివరిదాకా ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతధంగా సినిమా రూపంలో తాను ప్రజల ముందుకు తెచ్చానని రాంగోపాల్‌వర్మ ప్రకటిస్తే.. ఆ విషయాలన్నీ బయటకు వస్తే.. తమకు ఇబ్బందులొస్తాయని టిడిపి, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తి కాగా.. విడుదలను ఆపాలని లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయగా.. డివిజన్ బెంచ్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వ్యూహం-శపథం చిత్రాలను సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న పార్ట్-1 సినిమాగా "వ్యూహం2 విడుదలవుతుంటే.. ఒక వారం గ్యాప్‌లోనే సీక్వెల్‌ను "శపథం" పేరుతో మార్చ్ 1న విడుదల చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించామే తప్ప.. ఎవరినీ కించపరిచేలా తీయలేదన్నారు ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలను ప్రతీ ఒక్కరు చూసుకుంటారనేదే తన ఉద్దేశమని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. “ఏ పార్టీ వాళ్లు కాకుండా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదు. మీరు పబ్లిక్‌గా అందరితో చూడొచ్చు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే మానేయండి” అని అన్నారు ఆర్జీవీ. వారం రోజుల్లో రెండు సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన RGV తన సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి కోపం వస్తాయి.. కానీ చూడడం మాత్రం అందరూ చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని వేర్వేరు నగరాల్లో వ్యూహం, శపథం సినిమాలను వీక్షించిన వైఎస్సార్సిపి నాయకులు.. ఆర్జీవీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మరోసారి ఘనవిజయం సాధిస్తారని, వైనాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు వైఎస్సార్సిపి నాయకులు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) -
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం
అమెరికా, టెక్సాస్‌లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ - ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ఘనంగా ప్రారంబమైంది. ఆంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరై.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ అధ్యక్షుడిగా సత్యేంద్ర వానపల్లిని ఎన్నుకున్నారు. అమెరికాలో వున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ నేషనల్ సంస్థ ఏఏఏ అని, ఆంధ్రప్రదేశ్ విశిష్టతను ఆబాల గోపాలానికి సుపరిచయం చేయడమే తమ ముఖ్యోద్దేశమని సంస్థ సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక చక్కని అవగాహన కలిగించే ప్రదర్శనలను చేయడమే తమ ఆశయమన్నారు. సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలు వివరించారు. ఇంకా సంక్రాంతి సంబరాలతో బాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు హరి మోటుపల్లితో పాటు న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యులు, ఏఏఏ నేషనల్ కోర్ టీమ్, ఆస్టిన్ చాప్టర్ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, పలువురు సంస్థ ప్రతినిధుల పాల్గొని, ప్రసంగించారు. రానున్న రోజుల్లో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి ఈ చాఫ్టర్ మీట్ ఎంతగానో దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. తెలుగు వారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వివరించారు. ఏఏఏసంస్థకు మద్ధతుగా నిలిచి, అండగా ఉంటున్న ప్రతిఒక్కరికి నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!) -
Dallas Bathukamma : డాలస్‌లో సందడి చేసిన టీపాడ్ చిన్నబతుకమ్మ
తెలంగాణ సంస్కృతిని అమెరికా గడ్డపై వికసింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్‌లోని ఆండ్రివ్ బ్రోన్ పార్క్ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది. పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్ పూర్వ అధ్యక్షులు రమణ లష్కర్, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్‌గా గాయత్రి గిరి, కో-చైర్‌గా అనుషా వనం, అడ్వయిజర్‌గా ఇంద్రాణి పంచెర్పుల తమ సేవలందించారు. హరిశంకర్‌రెడ్డి రేసు, ప్రశాంత్ నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధురజ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేయడమే కాకుండా అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్ సిస్టమ్ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్‌లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం కల్పించడం వంటి పనులు చూసుకున్నారు. రవాణా వ్యవహారాలను సంతోష్ రేగొండ, భోజన సదుపాయాలను సంతోష్, సోషల్ మీడియా వ్యవహారాలను మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె చూసుకున్నారు. రిసెప్షన్ బాధ్యతలు మాధవి మెంట, దీపికారెడ్డి చూసుకోగా, శశిరెడ్డి, మాధవి ఓంకార్ డెకరేషన్ దగ్గరుండి చేయించారు. అక్టోబర్ 21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు అక్టోబర్ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసిన టీపాడ్.. అక్టోబర్ 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేస్తున్నది. ఈ వేడుకలకు డాలస్‌లోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. విశేష అతిథిగా సంయుక్తామీనన్, రాఫెల్ ప్రైజ్‌గా బీఎండబ్ల్యూ బైక్ సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్ ప్రైజ్‌లను అందజేయనున్నారు. వీటిలో బీఎండబ్ల్యు బైక్, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ జువెల్లరీతో పాటు గిఫ్ట్ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యు బైక్ మరియు రాఫెల్ ప్రైజ్‌లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి అనౌన్స్ చేశారు. వేడుకల వివరాల కోసం టీపాడ్ వెబ్సైట్ టీపాడ్యూఎస్.ఓఆర్జీను బ్రౌజ్ చేయొచ్చు. -
నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా', 'వంశీ ఇంటర్నేషనల్' అండ్ ' సాంస్కృతిక కళాసారథి- సింగపూర్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "నవరసాల నటసామ్రాట్" (అక్కినేని నటనా వైదుష్యం) అనే విలక్షణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో ఆదివారం 2 గంటల పాటు అద్భుతంగా నిర్వహింపబడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి సందర్భంగా.. అమెరికా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్, భారత్ దేశాల నుంచి 50మంది ప్రఖ్యాత రచయితలు/రచయిత్రులు పాల్గొని, ఆణిముత్యాలైన 50 సినిమాలలో అక్కినేనిగారి నటనా వైదుష్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు అందించారు. నిర్వాహక సంస్థల అధ్యక్షులైన డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్, ప్రముఖ సినీ కవి భువనచంద్ర తమ సందేశాలు అందించగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించారు. ప్రముఖ అవధాని డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, రచయిత్రులు కె.వి కృష్ణకుమారి, గంటి భానుమతి, డా తెన్నేటి సుధాదేవి, తిరునగరి దేవకీదేవి, గాయని సురేఖ మూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డా టి గౌరీశంకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా సూర్య ధనంజయ్ మొదలైనవారు ఈ కార్యక్రమంలో ప్రసంగించగా, "మనం" సినిమా మాటల రచయిత అయిన సినీ నటుడు హర్షవర్ధన్ మనం సినిమాపై విశ్లేషణ వ్యాసం అందించారని నిర్వాహకులు డా వంశీ రామరాజు తెలియజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ అక్కినేని గారి అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను, తనకు వారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గురించి పంచుకున్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భగ్న ప్రేమిక, హాస్య భరిత, భక్త పాత్రలలో దేనిలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి చిత్రం ఆసాంతం ఆకట్టుకునేలా నటించగలిగే అద్వితీయ ప్రతిభ అక్కినేనిగారిది. దానిని నిరూపించే విధంగా ఉన్న 50 సినిమాలలో వారి నట విశ్వరూపాన్ని విశ్లేషిస్తూ ఏడు దేశాల నుంచి 50 మంది వక్తలు మాట్లాడటం ఇదే తొలిసారి అని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. అనితర సాధ్యమైన నటనతో, అతి స్పష్టమైన ఉచ్చారణతో, కళ్ళతోనే అనేక భావాలు పలికించగలిగే అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి వారి శతజయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి అండ్ కల్చరల్ టీవి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. సుమారు వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాల నుంచి వీక్షించారు. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?
ఒకప్పుడు అమెరికాకు వచ్చే ప్రవాసాంధ్రులంటే ఎంతో గౌరవం. అక్కడి సమాజం హర్షించేలా హుందాగా ఉండేవారు. తెలివితేటల్లో మిన్నగా ఉంటూ ప్రతిభను చాటేవారు. అమెరికాలోని ఏ నగరానికి వెళ్లినా .. తెలుగు వాళ్లంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి తరచుగా దిగజారుతోంది. చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెల్లువెత్తుతోన్న ప్రవాసాంధ్రుల్లో.. చాలా మంది కొన్నాళ్ల పాటు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. ఎందుకీ జాడ్యం తొలుత వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగాలకు పరిమితమయిన ప్రవాసాంధ్రులు.. ఇప్పుడు కంపెనీలు నెలకొల్పారు, విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో పేరాశ వీపరీతంగా పెరిగింది. డబ్బు సంపాదనతో ఆగిపోకుండా.. దాన్ని ఎగ్జిబిట్.. అంటే ప్రదర్శనకు తహతహలాడుతున్నారు. అమెరికన్ల తరహాలో హుందాగా వీక్ డేస్ లో కనిపించే ప్రవాసాంధ్రులు.. వీకెండ్ లో పార్టీ కల్చర్ వీపరీతంగా పెంచుకుని.. అక్కడ తమ స్థాయి, దర్పాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లుతున్నారు. కనీసం కేజీ బంగారం శరీరంపై వేసుకుంటే తప్ప కన్వెన్షన్ కు హాజరు కాలేని పరిస్థితి చాలా మంది తెలుగు కుటుంబాల్లో ఉంది. ఆరంభంలో తమ కెరియర్ పై దృష్టి పెట్టిన చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వైపు తొంగి చూస్తున్నారు. టిడిపి ఎంట్రీతో మారిన సీన్ అక్కడ బాగా సంపాదించిన వారు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం పరిపాటి అయింది. దీన్నే అక్కడ హెలికాప్టర్ క్యాండిడేట్స్ అని సరదాగా చెప్పుకుంటారు. ఇలాంటి అభ్యర్థులంటే తెలుగుదేశం పార్టీకి పండగే. టికెట్ల కోసం ఎంతయినా ఖర్చు పెట్టడం, ఓటుకు కోట్లు గుప్పించడం ఇలాంటి వారి వల్ల చాలా సులభమని చంద్రబాబు నమ్ముతారు. చాలా మంది ప్రవాసాంధ్రులు వ్యాపారాల వైపు మళ్లారు. అయితే వీరేమి గొప్ప వ్యాపారాలు చేయడం లేదు. పేరాశ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్, హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ తో పాటు టెక్సాస్ లాంటి చాలా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అంతా మన వాళ్ల చేతిలోనే ఉంది. తనకు అనుకూలమైన కొందరిని విదేశాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంచడం చంద్రబాబుకు బాగా అబ్బిన కళ. అక్కడి నుంచి రకరకాల ఫేక్ స్టోరీలను వండి తెలుగు రాజకీయాలపై వదలడం బాబు కోటరీకి వెన్నతో పెట్టిన విద్య. పేరులో కులాలను మార్చి.. ప్రత్యర్థులపై దాడి చేయడం బాగా అలవాటుగా మారింది. ఇందులో కొందరు ఎన్నారైలు పావులైపోతున్నారు. డబ్బు కోసం విలువలు మరిచి.. ఇదే సమయంలో మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో ఇండియా నుంచి ప్రముఖ అమ్మాయిలను తెప్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'గంటకు ఇంత అంటూ' అనైతిక కార్యక్రమాలకు దిగి అక్కడి పోలీసులకు దొరికిపోయి మొత్తం తెలుగు ప్రజలకే చెడ్డ పేరు తెస్తున్నారు. షికాగో వేదికగా ఐదారేళ్ల కింద కొందరు పట్టుబడడం వల్ల చాలా మంది తెలుగు వాళ్లు ఇబ్బంది పడ్డారు. అసలు మాది తెలుగు అని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డారు. వీసా ఇంటర్వ్యూలకు సినీ తారలు వెళ్తే అనుమానించే పరిస్థితి ఎదురయిందని కొందరు ప్రవాసాంధ్రులు తెలిపారు గ్రూపులు.. వర్గాలు ఇక ఏ ఈవెంట్ జరిగినా.. రెండుగా చీలడం పరిపాటయింది. ఇటీవల టెక్సాస్ లో బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బాహటంగానే తన్నుకున్న విషయం ప్రవాసాంధ్రుల మదిలోంచి ఇంకా పోలేదు. ఒక్క తెలుగుదేశంలోనే చాలా వర్గాలున్నాయి. అమెరికాకు 40, 50 ఏళ్ల కిందనే రావడంతో టిడిపి ఎన్నారైలలో ప్రాంతీయ అభిమానం బాగా పెరిగిపోయింది కులాల పేరుతో సంఘాలు, సినీ నటుల పేర్లతో అభిమాన సంఘాలు బాగా పెరిగిపోయాయి. ఇక ప్రాంతాల వారీగా ఇది మరింత ముదిరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్తా.. జిల్లాల పేరుతో మీటింగ్ లు, భేటీలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఘన చరిత్ర ఉన్న ప్రవాసాంధ్రులు కాస్తా.. ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం కాస్తా ఇబ్బందికరమేనని వాపోతున్నారు. చదవండి: తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
డల్లాస్‌లో నాటా మహాసభలు.. ఘనంగా ఏర్పాట్లు పూర్తి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా)మహాసభలు ఈనెల 30నుంచి అమెరికాలో ఘనంగా జరగనున్నాయి. డల్లాస్‌లో జూలై 1, 2 తేదిల్లో విమెన్స్ ఫోరం కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యోద్దేశంగా ఉండేలా విభిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నామని నాటా కన్వెన్షన్ 2023 విమెన్స్ ఫోరం ఛైర్పర్సన్ స్వాతీ సానపురెడ్డి తెలిపారు. విమెన్స్ ఫోరం అంటే కుట్లు అల్లికలు సరదా ముచ్చట్లు కాదు, మహిళా సాధికారత అని చాటి చెప్పేలా తమ కార్యక్రమాలు విభిన్నంగా, వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి అని పేర్కొన్నారు. జులై 1న వివిధ రంగాల్లో ప్రముఖులైన ఉపన్యాసాలు, పురాతన చీరల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. జులై2న టాక్ ఆఫ్ ద టౌన్‌తో మొదలై, మహిళా తెలుసుకో సెగ్మెంట్లో అలంకరణపరంగా దైనందిన జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సూచనలు, సొగసు చూడతమాలో కనువిందైన వస్త్రధారణ ఉంటుందని తెలిపారు. నాటా సభల్లో వాసిరెడ్డి పద్మ, ఊమా భారతి కోసూరి, అమల దుగ్గిరాల, మణి శాస్త్రి, పద్మ సొంటి, ఉమా దేవిరెడ్డి, వసంత లక్ష్మి అయ్యగారి, వైష్ణవి రంగరాజన్, ప్రేమ రొడ్డం, కీర్తన శాస్త్రి, పల్లవి శాస్త్రి, అపూర్వ చరణ్ మరియు వివేక్ తేజ చేరుపల్లి తదితరులు పోల్గొననున్నారు. -
ఏయ్ బిడ్డా.. ఇది మా అడ్డా.. నాటా వేడుకలకు డాలస్ రెడీ
(అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) టెక్సాస్ : అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది. ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉండే డాలస్‌లో ఈ వేడుకలు జరగనుండడం.. మరింత ఊపు తెచ్చింది. (NATA నాటా కార్యవర్గ బృందం) కనివినీ ఎరుగని రీతిలో సభలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఘనంగా ఈ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది కమిటీ. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, నాయకులు, కళాకారులు హాజరు కానున్నారు. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అద్భుతమైన రీతిలో ప్రదర్శించడానికి అత్యున్నతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటా అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కాబోయే అధ్యక్షుడు హరి వేల్కూర్, పూర్వాధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణరెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి దర్గారెడ్డి తమవంతుగా వేడుకల కోసం కృషి చేస్తున్నారు. (ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిసిన NATA బృందం) నాయకులకు వెల్కం అంగరంగ వైభవంగా జరిపేందుకు తలపెట్టిన ఈ మహా వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసింది నాటా బృందం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను సన్మానించిన నాటా సభ్యులు.. మహాసభలకు సంబంధించిన విశేషాలను పంచుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఇక ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. సినిమా సందడే సందడి నాటా తెలుగు మహాసభల్లో టాలీవుడ్ సందడి కనిపించనుంది. స్పెషల్ అట్రాక్షన్‌గా రాంగోపాల్ వర్మ, బెస్ట్ మ్యూజిక్ ట్రయో దేవీ శ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రూబెన్స్, అలాగే గేయ రచయిత అనంత శ్రీరాం, సింగర్ ఎస్పీ శైలజ, మధు ప్రియ తదితరులు హాజరు కానున్నారు. సినీ ప్రముఖులు శ్రీనివాసరెడ్డి, అలీ, లయ గోర్తి, పూజ ఝువాల్కర్, స్పందన పల్లి, అనసూయ, ఉదయభాను, రవి, రోషన్, రవళి తదితర ప్రముఖులతో ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ దుస్తుల డిజైనర్ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌షో, సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్ పర్యవేక్షణలో పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు టీన్ నాటా, మిస్ నాటా, మిసెస్ నాటా పోటీలు కూడా జరగనున్నాయి. ధ్యాన సందేశం ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్‌ను ఆహ్వానించింది నాటా కార్యవర్గం. గురు రవిశంకర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించే అవకాశాన్ని ప్రవాసాంధ్రులకు కల్పించింది. సూపర్ వెన్యూ డాలస్ డాలస్ అనగానే గుర్తొచ్చేది అమెరికాలో తెలుగు కాపిటల్ అని. అలాంటి చోట.. అది కూడా డౌన్టౌన్లో అందరికీ అనుకూలమైన K బెయిలీ హచిసన్ కన్వెన్షన్ సెంటర్ (#KBHCCD)లో నాటా సభలు జరగనున్నాయి. పది లక్షల స్క్వేర్ ఫీట్ ఎగ్జిబిట్ స్పేస్, మూడు భారీ బాల్రూంలు, 88 మీటింగ్ రూంలు, ఒక భారీ థియేటర్ డాలస్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు. 1957లో నిర్మించిన ఈ కన్వెన్షన్‌ను అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చారు. 2013లో అమెరికా మాజీ సెనెటర్ K.బెయిలీ పేరును ఈ కన్వెన్షన్ సెంటర్‌కు పెట్టారు. అన్నింటికీ అనుకూలం డాలస్ కన్వెన్షన్ సెంటర్ డౌన్ టౌన్లో ఉండడం వల్ల సులువుగా చేరుకోవచ్చు. ఈ కన్వెన్షన్‌లో భారీ పార్కింగ్ సెంటర్లున్నాయి. అన్నీ రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం అయి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుగుణంగా ఆమ్ట్రాక్, ట్రినిటీ రైల్వేలకు సమీపంలో ఉంది ఈ కన్వెన్షన్ సెంటర్. అలాగే కన్వెన్షన్‌తో నేరుగా స్కైవే బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయ్యేలా రెండు హోటళ్లు హయత్ రీజెన్సీ, షెరటాన్ హోటల్ ఉన్నాయి. (NATA వేడుకలు జరగనున్న డాలస్ కన్వెన్షన్) మూడు రోజులు డాలస్‌కు పండగ కళ జూన్ 30 శుక్రవారం ప్రారంభమయ్యే వేడుకలు.. జూలై 2 ఆదివారం వరకు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా బాంకెట్ డిన్నర్ ఏర్పాటు చేశారు, ఇక్కడ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని నాటా ఎక్సలెన్స్ అవార్డులతో గుర్తించి సన్మానిస్తారు. ఇదే కార్యక్రమంలో అనూప్ రూబెన్స్ టీం సంగీత విభావరితో ఊర్రూతలూగించనున్నారు. జూలై 1, జులై2 రోజంతా సందడే సందడి. ఆట, పాట, మాట, మంతి.. ఒకటేంటి.. పండుగ వాతావరణంలో ప్రవాసాంధ్రులంతా ఒక్క చోట చేరి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించనున్నారు. జులై 2న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరుడి కళ్యాణ వేడుక పద్మావతి అమ్మవారితో అంగరంగవైభవంగా జరగనుంది. మహాసభల ఏర్పాట్లను నాటా కార్యవర్గ సభ్యులు ఆర్య బొమ్మినేని, జయ తెలక్, మాధవి లోకిరెడ్డి, నంద కొర్వి, రేఖ కరణం, సుప్రియ టంగుటూరి, బ్రహ్మ బీరివెరా, హరి సూరిశెట్టి, సతీష్ సీరం, సలహాదారులు హరి వేల్కూర్, రామిరెడ్డి ఆళ్ల, ఉషారాణి చింత, సుజాత వెంపరాల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు నాటా వెబ్సైట్ https://nataconventions.org/conference-registration.php లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు నాటా PR&మీడియా డీవీ కోటి రెడ్డి (9848011818)ని సంప్రదించాలని తెలిపారు. -
డల్లాస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA బోర్డు సమావేశం
-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా టోర్నమెంట్
-
అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్విల్లే రైజర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2023 వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. 9 జట్ల మధ్య పోరు ఈ కార్యక్రమంలో 9 మహిళా జట్లు పాల్గొనగా.. సుమారు 300 మంది ప్రేక్షకులు వారి ఆటను తిలకించారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కో-ఆర్డినేటర్లు క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్‌రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్‌రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేత ఎవరంటే ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నాష్విల్లే రైజర్స్ నిలిచింది. పవర్ గర్ల్స్ రన్నరప్, TNMM రెండో రన్నరప్గాన నిలిచాయి. విజేతలకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి, క్రీడ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందజేశారు. ఆటా నాష్విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్ -
అమెరికాలో " గాడ్ ఫాదర్ " సక్సెస్ సెలబ్రేషన్స్
-
వర్జీనియాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్ట్ 15న అమెరికా వర్జీనియాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ప్రతి నిధులు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా అధ్యక్షురాలు సుధారాణి కొండపు మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టి పెరిగిన మన భావితరాలు ఆనందించేలా మన భారతీయతను ప్రతిబింబించే జెండా రంగులలోని కాషాయరంగు ,తెలుపు, ఆకుపచ్చ వర్ణాల అలంకరణతో పార్క్ ఏరియా కళకళలాడుతుందని అన్నారు. పిల్లలకు చాక్లెట్లను, బహుమతులను పంచుతూ తమ కార్యవర్గసభ్యులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, ట్రస్టీలు, గోపాల్ నున్న , వెంకట్ కొండపోలు కార్యవర్గసభ్యులు సతీష్ వడ్డి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి , పార్ధ బైరెడ్డి ,హరీష్ కొండమడుగు , రామచంద్ర ఏరుబండి , రాజు గొడుగు, సతీష్ సుంకనపల్లి,రమణారెడ్డి, ఉదయ్ , సాయి, రంగా, కౌశిక్ , విష్ణు, వినీత్ , కృష్ణకిశోర్, సంధ్య, రాధిక, అవని, లావణ్య, సుప్రజ ,విజయ,హరిత తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
కోదాడ మహిళకు సూపర్ ఉమెన్ ఇన్ సర్వీస్ అవార్డు
వాషింగ్టన్: కరోనా సమయంలో చేసిన సేవకు గాను కోదాడ మండలానికి చెందిన చింతా నవ్య స్మృతికి అమెరికాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ " ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారి ఆధ్వర్యం లో "సూపర్ వుమన్ ఇన్ సర్వీస్ అవార్డు" పురస్కారాన్ని, 500 డాలర్ల రివార్డ్‌ను అందచేశారు. చింతా నవ్య స్మృతి అమెరికాలో ని "మేరీల్యాండ్ "లో ప్రాంతంలో నివసిస్తూ.. కరోనా సమయంలో తన వంతు బాధ్యతగా మెడికల్ హెల్ప్, డాక్టర్స్ సంప్రదింపులు, బ్లడ్ ప్లాస్మా డొనేషన్స్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ , పీపీఈ కిట్ల డిస్ట్రిబ్యూషన్ పలు గ్రామాలకు అందచేయడం లో కోఆర్డినేట్ చేశారు. అంతేకాకుండా కాన్సర్ హాస్పిటల్స్ లో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు.తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలకి తన వంతు సహాయంగా దాతలతో కలిసి కాలేజీలకు ఫీజులను చెల్లించారు. ఫీస్లు కాలేజీ కి కట్టడానికి దాతలతో కలిసి సహాయం చేయగలిగారు. చింతా నవ్య స్మృతి సామాజిక కార్యక్రమంలో తన సేవలు అందిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), ఆధ్వర్యంలో 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ వాషింగ్టన్ డీసీ లో శనివారం ఎంతో ఉల్లాసంగా నిర్వహించారు. హెర్నడోన్ నగరంలో క్రౌన్ ప్లాజా హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.మొట్టమొదటి సారిగా ఆటా కాన్ఫరెన్స్ అమెరికా రాజధానిలో 2022 సంవత్సరంలో జులై 1,2,3 తేదీలలో వాల్టర్ యీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు . కాపిటల్ ఏరియా తెలుగు సంఘం కాట్స్ కో-హోస్ట్‌గా వ్యవహరించనుంది. శనివారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఆటా 17వ మహా సభల థీమ్ సాంగ్, లోగోను ఆవిష్కరించారు. ఆటా జాయింట్ సెక్రటరీ రామకృష్ణ ఆలా సభ కార్యక్రమాలకు అతిథుల్ని ఆహ్వానించారు. ఎంబసీ అఫ్ ఇండియాలో కౌన్సిలర్ అన్షుల్ శర్మ ముఖ్య అతిధిగా విచ్చేసారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా అమెరికాలో భారత సంతతి వారికీ సేవ చేయడంలో ఆటా సంస్థ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కమిటీలను ప్రకటించారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి తర్వాత అందరిని కలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొట్టమొదటిసారిగా డీసీలో కనెన్షన్ నిర్వహిస్తున్నామని అమెరికాలోని తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమం లో 12000 మందికి పైగా పాల్గొననున్నారు. అందుకోసం సకలసౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఆటా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబడిన మధు బొమ్మినేని మహిళలు కాన్ఫరెన్స్ లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఆటా 17వ మహా సభల కన్వీనర్ గా సుధీర్ బండారు, కోఆర్డినేటర్ గా కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా కేకే రెడ్డి, కో-కన్వీనర్‌గా సాయి సుదిని, కో-కోర్డినేటర్‌గా రవి చల్ల, కో-డైరెక్టర్‌గా రవి బొజ్జ , కాట్స్ ప్రెసిడెంట్ సుధా కొండపు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అడ్విసోరీ కమిటీ చైర్‌గా జయంత్ చల్ల, రీజినల్ కోఆర్డినేటర్‌గా శ్రావణ్ పాదురు వ్యవహరించనున్నారు. 70 కమిటీలను ప్రకటించారు. డీసీ తెలుగు కమ్యూనిటీలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులను ఈ కమ్యూనిటీలో సభ్యులుగా ప్రకటించారు. 17వ మహా సభల కన్వీనర్ సుధీర్ బండారు వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల లోని తెలుగు వారందరు కాన్ఫరెన్స్ గొప్పగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించాలని అభ్యర్ధించారు. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఆటా తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు ఎన్నో సేవ కార్యకమాలు కూడా నిర్వహిస్తోందని తెలియచేశారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రారంభ సమావేశంలోనే ఈ సంఖ్యలో తెలుగు వారు పాల్గొనడం శుభసూచకమన్నారు. అడ్విసోరీ కమిటీ అధ్యక్షులు జయంత్ చల్ల కాన్ఫరెన్స్ విజయవంతం చెయ్యటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. తానా, నాట, టీడీఫ్, నాట్స్, టాటా ,జీడబ్ల్యూసీటీఎస్, వారధి, తాం, ఉజ్వల, ఎన్నో సంస్థలు కాన్ఫరెన్స్‌కి తమ సంఘీభావం ప్రకటించాయి. అమెరికా నలుమూల నుంచి ఎంతో మంది ఆటా కార్యవర్గ, ఎగ్జిక్యూటివ్, వాలంటీర్స్ ఈ కార్యక్రంలో పాల్గొనటానికి విచ్చేశారు. 100 మంది ఆటా, కాట్స్ సభ్యులు కన్వెన్షన్ సెంటర్ టూర్లో పాలుపంచుకొని ఎటువంటి ఏర్పాట్లపై ఆలోచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు అందరిని అలరింపచేశాయి. యువ గాయని గాయకుల పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఫండ్ రైసింగ్ కార్యక్రమం లో 750 వేల డాలర్ల విరాళాలు సేకరించారు. పూర్వ ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, కరుణాకర్ అసిరెడ్డి లోకల్ టీం, మీడియా మిత్రుల సహకారాన్ని కొనియాడారు. -
'వీధి అరుగు'లో శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు
ఆన్ లైన్ వేదికపై ఈనెల 25న 'వీధి అరుగు' ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భారతీయ వైద్య రంగం - శాంతా రంగంలో తమ అనుభావాల్ని పంచుకోవడానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. జి.వి. పూర్ణచంద్ విశిష్ట అతిథిగా పాల్గొనున్నారు. స్వదేశీ పరిజ్ఞానముతో భారతదేశంలో బయోఫార్మారంగం ఎలా అభివృద్ధి చెందింది, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరియు టెక్నోక్రాట్లకు ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి. ఆధునిక జీవితంలో మన ఆయుర్వేదం పాత్ర ఏమిటి? మానవుడు దైనందిక జీవితంలో ఎటువంటి కట్టుబాట్లు-నియమాలను పాటించాలి. కరోనా సంహారంకు ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలిస్తారని నిర్వహాకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నిర్వహకులు విడుదల చేశారు.నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ లో నివసిస్తున్న గాయకుడు కార్తీక్ మద్దెల పాటతో కార్యక్రమం ప్రారంభం కానుంది -
విజయవంతంగా ఆటా పాటల పోటీలు
అమెరికాలోని తెలుగుసంఘం(ఆటా) ఆధ్వర్యంలో ‘ఝుమ్మందినాదం’ సీనియర్ క్లాసికల్ పాటల పోటీలు జూలై 12 నుంచి 19 తేదీల్లో ఆన్లైన్ జూమ్ ద్వారా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 65మంది గాయని గాయకులు అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందినవారు ఆసక్తితో పాల్గొన్నారు. ‘ఝుమ్మంది నాదం’ కార్యక్రమాన్ని ఆల రామ కృష్ణారెడ్డి బోర్డు ఆఫ్ ట్రస్టీ, శారదా సింగిరెడ్డి నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అమెరికా, భారత్ నుంచి సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీనిహాల్ కొండూరి, ప్లేబ్యాక్ సింగర్ కుమారి, నూతన మోహన్, ప్లేబ్యాక్ సింగర్ వేణు శ్రీరంగం, సింగర్, ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ పీవీఎస్ఎన్ రోహిత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆటా సంస్థ సీనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులుగా అపరాజిత పమిడిముక్కల, చైత్ర ఆర్ని, జ్యోత్స్నా ఆకుంది, కార్తిక్ స్వామి, మైన ఏదుల, ప్రణవ్ అర్కటాల, ప్రణవ్ బార్ల, ప్రియాంక కొలనుపాక, శృతి శేఖర్, శ్రీప్రజ్ఞ వెల్లంకి, సుదార్చిత్ సొంటి, తేజశ్రీ మేక, వాదిరాజ్ గర్లపాడ్ ఫైనలిస్ట్స్గా ఎంపిక చేశారు. వీరు వాషింగ్టన్, న్యూజెర్సీ, టెక్సాస్, నార్త్ క్యారలిన్, జార్జీయా, ఆరిజోనా,క్యాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా, మిన్నిసోటా రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్‌రెడ్డి భుజాల.. బోర్డు ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్మన్లు, రీజనల్ డైరెక్టర్లు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వన్షన్ బృందం, ‘ఝుమ్మంది నాదం’ బృందం, సోషల్ మీడియా టీం, ఫైనలిస్ట్స్‌కు అభినందనలు తెలియజేశారు. పోటీలో పాల్గొన్న గాయని, గాయకులు, వారి తల్లిదండ్రులు.. ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణమని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీరెడ్డి అన్నారు. ఆటా ‘ఝమ్మంది నాదం’ సెమీ ఫైనల్స్ పాటల పోటీలు ఆగస్ట్2, 2020న, ఫైనల్స్‌ను ఆగస్ట్ 8, 2020 నుంచి 9 వరకు కొనసాగనున్నాయి. ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవీ, మన టీవీ ఇంటర్నేషనల్, టీవీ5, జీఎన్ఎన్, ఏబీఆర్ ప్రొడక్షన్స్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, టోరీ రేడియో ఇతర మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఝుమ్మంది నాదం పాటల పోటీ విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి అభినందనలు తెలిపారు.