ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు | American Telugu Association Dc Convention 2022 Kick Off In Virginia | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు

Published Tue, Jul 27 2021 9:37 PM | Last Updated on Tue, Jul 27 2021 9:53 PM

American Telugu Association Dc Convention 2022 Kick Off In Virginia - Sakshi

వాషింగ్టన్‌: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), ఆధ్వర్యంలో 17వ  ఆటా  కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ వాషింగ్టన్ డీసీ లో శనివారం ఎంతో ఉల్లాసంగా నిర్వహించారు. హెర్నడోన్  నగరంలో క్రౌన్ ప్లాజా హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.మొట్టమొదటి సారిగా ఆటా కాన్ఫరెన్స్ అమెరికా రాజధానిలో 2022 సంవత్సరంలో జులై 1,2,3 తేదీలలో  వాల్టర్ యీ కన్వెన్షన్ సెంటర్లో  నిర్వహించనున్నారు . కాపిటల్  ఏరియా  తెలుగు  సంఘం కాట్స్ కో-హోస్ట్‌గా వ్యవహరించనుంది. శనివారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఆటా 17వ మహా సభల థీమ్ సాంగ్, లోగోను ఆవిష్కరించారు.

ఆటా జాయింట్ సెక్రటరీ రామకృష్ణ ఆలా సభ కార్యక్రమాలకు అతిథుల్ని ఆహ్వానించారు. ఎంబసీ అఫ్ ఇండియాలో కౌన్సిలర్ అన్షుల్ శర్మ ముఖ్య అతిధిగా విచ్చేసారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా అమెరికాలో భారత సంతతి వారికీ సేవ చేయడంలో ఆటా సంస్థ ముందంజలో ఉందని పేర్కొన్నారు.

ఆటా ప్రెసిడెంట్  భువనేశ్ బుజాల ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని  ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కమిటీలను ప్రకటించారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల మాట్లాడుతూ కోవిడ్‌-19 మహమ్మారి తర్వాత అందరిని కలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొట్టమొదటిసారిగా డీసీలో కనెన్షన్ నిర్వహిస్తున్నామని అమెరికాలోని తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమం లో 12000 మందికి పైగా పాల్గొననున్నారు. అందుకోసం సకలసౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 

ఆటా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబడిన మధు బొమ్మినేని మహిళలు కాన్ఫరెన్స్ లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఆటా 17వ మహా సభల కన్వీనర్ గా  సుధీర్ బండారు, కోఆర్డినేటర్ గా కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా కేకే రెడ్డి, కో-కన్వీనర్‌గా సాయి సుదిని,  కో-కోర్డినేటర్‌గా రవి చల్ల, కో-డైరెక్టర్‌గా రవి బొజ్జ , కాట్స్ ప్రెసిడెంట్ సుధా కొండపు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అడ్విసోరీ కమిటీ చైర్‌గా జయంత్ చల్ల, రీజినల్ కోఆర్డినేటర్‌గా శ్రావణ్ పాదురు వ్యవహరించనున్నారు. 70 కమిటీలను ప్రకటించారు. డీసీ తెలుగు కమ్యూనిటీలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులను ఈ కమ్యూనిటీలో సభ్యులుగా ప్రకటించారు.

17వ మహా సభల కన్వీనర్ సుధీర్ బండారు వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల లోని తెలుగు వారందరు కాన్ఫరెన్స్ గొప్పగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించాలని అభ్యర్ధించారు. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఆటా తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు ఎన్నో సేవ కార్యకమాలు కూడా నిర్వహిస్తోందని తెలియచేశారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ కృష్ణ రెడ్డి  మాట్లాడుతూ.. ప్రారంభ సమావేశంలోనే  ఈ సంఖ్యలో తెలుగు వారు పాల్గొనడం శుభసూచకమన్నారు. అడ్విసోరీ కమిటీ అధ్యక్షులు జయంత్ చల్ల కాన్ఫరెన్స్ విజయవంతం చెయ్యటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. తానా, నాట, టీడీఫ్, నాట్స్, టాటా ,జీడబ్ల్యూసీటీఎస్‌, వారధి, తాం, ఉజ్వల,  ఎన్నో సంస్థలు కాన్ఫరెన్స్‌కి తమ సంఘీభావం ప్రకటించాయి.

అమెరికా నలుమూల నుంచి ఎంతో మంది ఆటా కార్యవర్గ, ఎగ్జిక్యూటివ్, వాలంటీర్స్ ఈ కార్యక్రంలో పాల్గొనటానికి విచ్చేశారు. 100 మంది ఆటా,  కాట్స్ సభ్యులు కన్వెన్షన్ సెంటర్ టూర్లో పాలుపంచుకొని ఎటువంటి ఏర్పాట్లపై ఆలోచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు అందరిని అలరింపచేశాయి. యువ గాయని గాయకుల పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఫండ్ రైసింగ్ కార్యక్రమం లో 750 వేల డాలర్ల విరాళాలు సేకరించారు. పూర్వ ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, కరుణాకర్ అసిరెడ్డి లోకల్ టీం,  మీడియా మిత్రుల సహకారాన్ని కొనియాడారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement