![Nata 2023 Convention Will Be Held In Dallas - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/29/Nata%202023%20Convention%20Will%20Be%20Held%20In%20Dallas.jpg.webp?itok=IXI-hdzK)
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా)మహాసభలు ఈనెల 30నుంచి అమెరికాలో ఘనంగా జరగనున్నాయి. డల్లాస్‌లో జూలై 1, 2 తేదిల్లో విమెన్స్ ఫోరం కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యోద్దేశంగా ఉండేలా విభిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నామని నాటా కన్వెన్షన్ 2023 విమెన్స్ ఫోరం ఛైర్‌పర్సన్ స్వాతీ సానపురెడ్డి తెలిపారు. విమెన్స్ ఫోరం అంటే కుట్లు అల్లికలు సరదా ముచ్చట్లు కాదు, మహిళా సాధికారత అని చాటి చెప్పేలా తమ కార్యక్రమాలు విభిన్నంగా, వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి అని పేర్కొన్నారు.
జులై 1న వివిధ రంగాల్లో ప్రముఖులైన ఉపన్యాసాలు, పురాతన చీరల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. జులై2న టాక్ ఆఫ్ ద టౌన్‌తో మొదలై, మహిళా తెలుసుకో సెగ్మెంట్‌లో అలంకరణపరంగా దైనందిన జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సూచనలు, సొగసు చూడతమాలో కనువిందైన వస్త్రధారణ ఉంటుందని తెలిపారు. నాటా సభల్లో వాసిరెడ్డి పద్మ, ఊమా భారతి కోసూరి, అమల దుగ్గిరాల, మణి శాస్త్రి, పద్మ సొంటి, ఉమా దేవిరెడ్డి, వసంత లక్ష్మి అయ్యగారి, వైష్ణవి రంగరాజన్, ప్రేమ రొడ్డం, కీర్తన శాస్త్రి, పల్లవి శాస్త్రి, అపూర్వ చరణ్ మరియు వివేక్ తేజ చేరుపల్లి తదితరులు పోల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment