సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సందేశాన్ని భావితరానికి తెలియజేయడంతో పాటు వారిలో సామాజిక స్ఫూర్తిని రగిలించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ తాజాగా ప్లోరిడాలోని టంపాబే లో అనాథ పిల్లల కోసం పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మిడిల్ స్కూల్ పిల్లలు 10 మంది పెద్దలు కలిసి అనాథ పిల్లల కోసం శాండ్‌విచ్‌లను తయారు చేశారు.. ఇలా చేసిన వాటిని టంపా లోని అనాధశ్రమానికి అందించింది. నిరాశ్రయులైన అనాథ పిల్లలకు మనం కూడా సామాజిక బాధ్యతగా ఏదో ఒక్కటి చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, నాట్స్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ సేవాభావాన్ని చాటారు.
నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ అచ్చిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమం నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment