
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా తీసిన ఆర్జీవీ తీసిన వ్యూహం-శపథం సినిమాల సందర్భంగా అమెరికాలో సందడి నెలకొంది. వ్యూహం, శపథం సినిమాలను చూసిన అమెరికాలోని వైఎస్సార్‌సిపి నాయకులు, అభిమానులు రాంగోపాల్‌వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా "సిద్ధం" అని ప్రకటించిన ఎన్నారైలు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఘన విజయం సాధించడమే మా "వ్యూహం" అని చాటి చెప్పారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు వ్యూహం సినిమా సందర్భంగా సంబరాలు నిర్వహించారు.
దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాను అడ్డుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు చివరిదాకా ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతధంగా సినిమా రూపంలో తాను ప్రజల ముందుకు తెచ్చానని రాంగోపాల్‌వర్మ ప్రకటిస్తే.. ఆ విషయాలన్నీ బయటకు వస్తే.. తమకు ఇబ్బందులొస్తాయని టిడిపి, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు.
(అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ)
ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తి కాగా.. విడుదలను ఆపాలని లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయగా.. డివిజన్ బెంచ్‍లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వ్యూహం-శపథం చిత్రాలను సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేషన్ ఇచ్చింది.
ఫిబ్రవరి 23న పార్ట్-1 సినిమాగా "వ్యూహం2 విడుదలవుతుంటే.. ఒక వారం గ్యాప్‌లోనే సీక్వెల్‌ను "శపథం" పేరుతో మార్చ్ 1న విడుదల చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించామే తప్ప.. ఎవరినీ కించపరిచేలా తీయలేదన్నారు ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలను ప్రతీ ఒక్కరు చూసుకుంటారనేదే తన ఉద్దేశమని రామ్‍గోపాల్ వర్మ అన్నారు. “ఏ పార్టీ వాళ్లు కాకుండా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదు. మీరు పబ్లిక్‍గా అందరితో చూడొచ్చు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే మానేయండి” అని అన్నారు ఆర్జీవీ. వారం రోజుల్లో రెండు సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన RGV తన సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి కోపం వస్తాయి.. కానీ చూడడం మాత్రం అందరూ చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
అమెరికాలోని వేర్వేరు నగరాల్లో వ్యూహం, శపథం సినిమాలను వీక్షించిన వైఎస్సార్‌సిపి నాయకులు.. ఆర్జీవీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మరోసారి ఘనవిజయం సాధిస్తారని, వైనాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు వైఎస్సార్‌సిపి నాయకులు.
Comments
Please login to add a commentAdd a comment