ram goapl varma
-
ఆర్జీవీ మెచ్చిన అందం.. కుర్రకారుకు మత్తెక్కిస్తున్న బ్యూటీ (ఫొటోలు)
-
Vyuham fever @ US : అమెరికాలో వైఎస్సార్సిపి సిద్ధం
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా తీసిన ఆర్జీవీ తీసిన వ్యూహం-శపథం సినిమాల సందర్భంగా అమెరికాలో సందడి నెలకొంది. వ్యూహం, శపథం సినిమాలను చూసిన అమెరికాలోని వైఎస్సార్సిపి నాయకులు, అభిమానులు రాంగోపాల్‌వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా "సిద్ధం" అని ప్రకటించిన ఎన్నారైలు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధించడమే మా "వ్యూహం" అని చాటి చెప్పారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు వ్యూహం సినిమా సందర్భంగా సంబరాలు నిర్వహించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాను అడ్డుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు చివరిదాకా ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతధంగా సినిమా రూపంలో తాను ప్రజల ముందుకు తెచ్చానని రాంగోపాల్‌వర్మ ప్రకటిస్తే.. ఆ విషయాలన్నీ బయటకు వస్తే.. తమకు ఇబ్బందులొస్తాయని టిడిపి, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తి కాగా.. విడుదలను ఆపాలని లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయగా.. డివిజన్ బెంచ్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వ్యూహం-శపథం చిత్రాలను సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న పార్ట్-1 సినిమాగా "వ్యూహం2 విడుదలవుతుంటే.. ఒక వారం గ్యాప్‌లోనే సీక్వెల్‌ను "శపథం" పేరుతో మార్చ్ 1న విడుదల చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించామే తప్ప.. ఎవరినీ కించపరిచేలా తీయలేదన్నారు ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలను ప్రతీ ఒక్కరు చూసుకుంటారనేదే తన ఉద్దేశమని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. “ఏ పార్టీ వాళ్లు కాకుండా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదు. మీరు పబ్లిక్‌గా అందరితో చూడొచ్చు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే మానేయండి” అని అన్నారు ఆర్జీవీ. వారం రోజుల్లో రెండు సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన RGV తన సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి కోపం వస్తాయి.. కానీ చూడడం మాత్రం అందరూ చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని వేర్వేరు నగరాల్లో వ్యూహం, శపథం సినిమాలను వీక్షించిన వైఎస్సార్సిపి నాయకులు.. ఆర్జీవీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మరోసారి ఘనవిజయం సాధిస్తారని, వైనాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు వైఎస్సార్సిపి నాయకులు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) -
ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జీవితంలో 2009-2014 ఎన్నికల వరకు ఏం జరిగింది అనేది వ్యూహంలో చూపించబోతున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ‘జగ గర్జన’ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ తనదైన స్టైల్లో విమర్శలు కురిపించాడు. పవన్‌ను రంగులా రాజా అంటూ సంబోధిస్తూ సూపర్‌స్టార్ అయి ఉండి కూడా చంద్రబాబు చేతిలో బర్రెలాగా మారిపోయాడని ఎద్దేశా చేశాడు. ‘పవన్ కల్యాణ్ ముఖానికి రంగు వేసుకొని సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా.. అది చేస్తా అని సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు చెప్పి వెళ్తే బాగోదు. లేటెస్ట్గా చూస్తే తెలంగాణలో ఊరు, పేరు తెలియని బర్రెలు కాసే అమ్మాయి బర్రెలక్కగా పాపులర్ అయింది. (చదవండి: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!) పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ అయి ఉండి బర్రెలెక్క అయిపోయాడు. బర్రెలక్కకి బర్రెలెక్కకి తేడా ఏంటంటే.. బర్రెలక్క ఒక కాపరి. ఇక్కడ ఈయన(పవన్) ఒక బర్రె. చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే అది చేస్తున్నాడు. నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అది మొత్తం పోయింది. లోకేష్ అనే అతను ఎవరు? చంద్రబాబు కొడుకు కాకపోతే మాములు కార్తకర్త దగ్గర బాయ్‌గా పని చేసే అర్హత కూడా లేదు’ అని ఆర్జీవీ అన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
నేను తన కొరకే డైరెక్టర్ అయ్యాను..!
-
RGV Vyuham Movie Shooting In Vijayawada: విజయవాడ: ప్రకాశం బ్యారేజీపై రామ్ గోపాల్‌వర్మ ‘వ్యూహం’ సినిమా సందడి (ఫోటోలు)
-
స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడు: రాంగోపాల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం, నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యథాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, పవన్ ఏదైనా ఆలోచనతో చేయడని, స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడన్నారు. సినిమాలో నటించే హీరో బయట హీరో కాలేడు. పవన్‌కు తనపైనే తనకు నమ్మకం లేదన్నారు. ఈ సారైనా ప్రజలు తనపై జాలి చూపిస్తారని పవన్ భావిస్తున్నాడన్న ఆర్జీవీ.. విప్లవానికి, పవన్ పార్టీకి ఏం సంబంధం? అంటూ ప్రశ్నించారు. చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో! ‘‘రాజకీయాలను పవన్ సినిమాలా చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నాడు. నిఘా వర్గాలు తమ పని చేసుకోకుండా పవన్‌కు నివేదికలు ఇస్తున్నాయా? ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేయాలనేదే పవన్ ఆలోచన. సినిమాల్లో సీన్స్ రియాక్షన్నే పవన్ బయట చూపిస్తాడు’’ అని ఆర్జీవీ దుయ్యబట్టారు. -
నాకు అమ్మ ప్రేమ బోర్ కొట్టింది..
-
ఆయన మాటలతో ఇక నేను చనిపోయినట్లే: ఆర్జీవీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరవాణి ఆర్జీవీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. అయితే నాకు మాత్రం తొలి ఆస్కార్ రామ్ గోపాల్ వర్మనే అన్నారు. అయితే కీరవాణి ప్రశంసలపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఆయన ఇంటర్వ్యూ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. కీరవాణి అలా మాట్లాడుతుంటే తనకు చనిపోయినా ఫీలింగ్ కలుగుతోందని ఆర్జీవీ అన్నారు. కేవలం చనిపోయిన వారినే అలా పొగుడుతారంటూ ట్వీట్ చేశారు. కీరవాణి ఏమన్నారంటే.. కీరవాణి మాట్లాడుతూ..' నాకు లభించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్ వర్మ. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్. కెరీర్ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించేందుకు నా మ్యూజిక్ క్యాసెట్స్‌ను కొందరికి షేర్ చేశా. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ‘శివ’ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే.. నా కెరీర్లో రామ్‌గోపాల్‌వర్మ ఆస్కార్ రోల్ ప్లే చేశారు. రామ్‌గోపాల్‌వర్మతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం.' అంటూ నాకు అవకాశాలిచ్చారని అన్నారు. Hey @mmkeeravaani I am feeling dead because only dead people are praised like this 😢😩😫 pic.twitter.com/u8c9X8kKQk — Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023 -
కేజీయఫ్-2 ఎఫెక్ట్.. స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై వర్మ షాకింగ్ ట్వీట్
రామ్ గోపాల్ వర్మ.. చిత్ర పరిశ్రమలో ఈ పేరే ఓ సంచలనం. ఆయన ఎప్పుడు, ఎవరిపై, ఏరకమైన కామెంట్స్ చేస్తారో తెలీదు. ట్రెండింగ్ అంశాలను మాట్లాడడం, దాన్ని వివాదాస్పదం చేయడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒక అంశాన్ని మరో అంశంతో ముడిపెడుతూ.. కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా ఆర్జీవీ మరోసారి తనదైన మార్క్ చూపించాడు. అంతా కేజీయఫ్-2 సక్సెస్ గురించి మాట్లాడుకుంటుంటే.. ఆయన మాత్రం స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయాన్ని బయటకు తెచ్చాడు. (చదవండి: అప్పుడే ఓటీటీకి ‘కేజీయఫ్ 2’, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే..!) కేజీయఫ్-2 పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆర్జీవీ వరస ట్వీట్లతో చిత్రయూనిట్‌పై, ముఖ్యంగా ప్రశాంత్ నీల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా కేజీయఫ్ సక్సెస్‌ని స్టార్ హీరోల రెమ్యునరేషన్‌తో ముడిపెడుతూ ట్వీట్ చేసి, ఇండస్ట్రీలో మరో వివాదానికి తెరలేపారు. ‘సినిమా మేకింగ్‌పై ఎంత ఎక్కువ డబ్బులు పెడితే..అంత మంచి చిత్రాలు బయటకు వస్తాయని చెప్పడానికి కేజీయఫ్-2 మూవీయే ఉదాహరణ. మేకింగ్‌లో ఎంత క్వాలిటీ ఉంటే..అంత భారీ సక్సెస్ వస్తుంది. అంతేకానీ స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది వృధా’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. బాలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. కోలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి. అయితే వీటితో పోల్చుకుంటే కన్నడ చిత్రపరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్ చాలా తక్కువనే చెప్పాలి. కేజీయఫ్ లాంటి సినిమాలు మినహాయిస్తే.. అక్కడ చాలా సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. వర్మ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. The MONSTER success of KGF 2 is a clear proof that if money is spent on MAKING and not wasted on STAR RENUMERATIONS bigger QUALITY and BIGGEST HITS will come — Ram Gopal Varma (@RGVzoomin) April 15, 2022 -
‘మా ఇష్టం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
హాట్ హీరోయిన్‌తో వర్మ నాటు స్టెప్పులు!
-
ఉల్లాల.. ఉల్లాల మూవీ ఆడియో లాంచ్
-
ప్రజారాజ్యం కంటే పరమ చెత్తగా...
సాక్షి, సినిమా : సమకాలీన అంశాలపై స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సందేశంతో వార్తలో నిలిచాడు. గత రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వ్యంగ్యంగా ఫేస్బుక్లో ఓ పోస్టు చేశాడు. ‘హైదరాబాద్ నోవాటెల్‌లో జనసేన పార్టీని స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ సింహంలా గర్జించాడనిపించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. అతనూ(పవన్) చిరంజీవిలా మారిపోతున్నాడేమో అనిపిస్తుంది ’ అంటూ వెటకారంగా ఓ పోస్టు చేశాడు. ఇక ట్విటర్లో స్పందిస్తూ... నెమ్మదిగా చిరులా మారిపోతున్న పవన్.. తన జనసేన పార్టీని ప్రజారాజ్యం కంటే చెత్తగా తయారుచేసుకుంటున్నాడని.. ఈ విషయంలో ఏపీ ప్రజల తరపున తాను ప్రార్థిస్తున్నానంటూ వర్మ ఓ ట్వీట్ కూడా చేశాడు. ఇక గతంలో కూడా పవన్ రాజకీయ విధానాలపై కూడా ఆర్జీవీ ఇలాగే సెటైర్లు పేల్చిన విషయం తెలిసిందే. I pray for the people of AP that @PawanKalyan realises before it’s too late that he’s slowly becoming a Chiranjeevi and he’s making janasena into becoming worse than prajarajyam 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 16 February 2018 -
రొమాన్స్-కామెడీ-సెక్స్... పిచ్చి వర్మ
సాక్షి, సినిమా : విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పై ఎట్టకేలకు సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. జీఎస్టీతో తన సంగీతాన్ని వర్మ మరో మెట్టు ఎక్కించాడంటూ కీరవాణి పొగడ్తలు కురిపించారు. పొర్న్ స్టార్ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన వీడియోకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ‘‘సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో 'రొమాన్స్'ను, 1992లో 'కామెడీ'ని, 2018లో 'సెక్స్'ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి(వర్మను ఉద్దేశించి) కృతజ్ఞతలు’’ అంటూ కీరవాణి ఓ ట్వీట్ చేశారు. కాగా, కీరవాణి కంటే ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్మ ఓ ట్వీట్ చేశాడు. వివాదాలు చుట్టు ముట్టినా.. మియా మల్కోవా స్వగతం వీడియో ఆన్లైన్లో విడుదలై ట్రెండ్ సెట్ చేసింది. Love @RGVzoomin for uplifting my music in the process of showcasing his brilliance in various kinds of celluloid aesthetics. Romance in 1991, Comedy in 1992, and Sex in 2018. Horror and Violence to follow soon this year, Thanks to the mad movie maker for believing in me. — mmkeeravaani (@mmkeeravaani) 28 January 2018 -
‘వంగవీటి’ తర్వాత తెలుగు సినిమా చేయను!
రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ళ క్రితం పరిటాల రవి కథతో ‘రక్త చరిత్ర’. నిన్న... గంధపు చెక్కల స్మగ్లర్ వీర ప్పన్పై ‘కిల్లింగ్ వీరప్పన్’... మరి ఇప్పుడు? విజయవాడకు చెందిన రాధా, రంగాల జీవి తంపై తీస్తున్న ‘వంగవీటి’! దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు! ‘‘ ‘వంగవీటి’ చిత్రం తర్వాత నేను తెలుగులో సినిమాలు తీయను’’ అని ఆయన తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. విజయవాడ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వంగవీటి’ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ- ‘‘నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా నిజంగా పుట్టింది, పెరిగింది విజయవాడలోనే. నాకు బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు, చంపుకోవడాల గురించి తెలిసింది విజయవాడలోనే. అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ‘రక్తచరిత్ర’కి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్లో తీయబోతున్న ‘వంగవీటి’కి ఉన్న తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడానే. 30 ఏళ్ల క్రితం విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు రౌడీయిజం రూపాన్ని, ఆంతర్యాన్ని చూశాను. అక్కడి రౌడీయిజం గురించి నా కంటే ఎక్కువ తెలిసినవారు విజయవాడలో కూడా లేరు. చలసాని వెంకటరత్నాన్ని రాధా చంపడంతో ప్రారంభమైన విజయవాడ రౌడీయిజం రంగాను చంపడంతో ఎలా అంతమైందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘శివ’తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం ‘వంగవీటి’తో ముగించాలనుకోవడానికి కారణం ఉంది. ‘వంగవీటి’ కంటే నిజమైన గొప్ప కథ మళ్లీ నాకు జీవితంలో దొరకదని కచ్చితంగా తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని తెలిపారు. -
జోరుగా... హుషారుగా...
మంచు మనోజ్ మంచి జోరుగా.. హుషారుగా ఉన్నారనే చెప్పాలి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ నటించిన ‘ఎటాక్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ‘శౌర్య’లో హీరోగా నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘మిరపకాయ్’, ‘శ్రీమన్నారాయణ’, ‘పైసా’ చిత్రాల నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించనున్న చిత్రంలో మనోజ్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి సాగర్ పసల దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కమర్షియల్ పంథాలో సాగే ఎంటర్టైనర్ ఇది. మనోజ్‌ను సరికొత్తగా చూపించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-స్క్రీన్‌ప్లే: కిశోర్.