ప్రజారాజ్యం కంటే పరమ చెత్తగా... | Lion Pawan became Chiru Now RGV Satires | Sakshi
Sakshi News home page

పవన్‌ జనసేనపై వర్మ విసుర్లు

Published Sat, Feb 17 2018 10:24 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Lion Pawan became Chiru Now RGV Satires  - Sakshi

పవన్‌ కళ్యాణ్‌ -రామ్‌ గోపాల్‌ వర్మ (ఫైల్‌ ఫోటోలు)

సాక్షి, సినిమా : సమకాలీన అంశాలపై స్పందించే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సందేశంతో వార్తలో నిలిచాడు. గత రాత్రి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ని ఉద్దేశించి వ్యంగ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశాడు.

‘హైదరాబాద్‌ నోవాటెల్‌లో జనసేన పార్టీని స్థాపించిన సమయంలో పవన్‌ కళ్యాణ్‌ సింహంలా గర్జించాడనిపించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. అతనూ(పవన్‌) చిరంజీవిలా మారిపోతున్నాడేమో అనిపిస్తుంది ’ అంటూ వెటకారంగా ఓ పోస్టు చేశాడు. ఇక ట్విటర్‌లో స్పందిస్తూ...  నెమ్మదిగా చిరులా మారిపోతున్న పవన్‌.. తన జనసేన పార్టీని ప్రజారాజ్యం కంటే చెత్తగా తయారుచేసుకుంటున్నాడని.. ఈ విషయంలో ఏపీ ప్రజల తరపున తాను ప్రార్థిస్తున్నానంటూ వర్మ ఓ ట్వీట్‌ కూడా చేశాడు.

ఇక గతంలో కూడా పవన్‌ రాజకీయ విధానాలపై కూడా ఆర్జీవీ ఇలాగే సెటైర్లు పేల్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement