సాక్షి, హైదరాబాద్: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం, నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యథాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, పవన్ ఏదైనా ఆలోచనతో చేయడని, స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడన్నారు. సినిమాలో నటించే హీరో బయట హీరో కాలేడు. పవన్‌కు తనపైనే తనకు నమ్మకం లేదన్నారు. ఈ సారైనా ప్రజలు తనపై జాలి చూపిస్తారని పవన్ భావిస్తున్నాడన్న ఆర్జీవీ.. విప్లవానికి, పవన్ పార్టీకి ఏం సంబంధం? అంటూ ప్రశ్నించారు.
చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో!
‘‘రాజకీయాలను పవన్ సినిమాలా చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నాడు. నిఘా వర్గాలు తమ పని చేసుకోకుండా పవన్‌కు నివేదికలు ఇస్తున్నాయా? ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేయాలనేదే పవన్ ఆలోచన. సినిమాల్లో సీన్స్ రియాక్షన్‌నే పవన్ బయట చూపిస్తాడు’’ అని ఆర్జీవీ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment