ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జీవితంలో 2009-2014 ఎన్నికల వరకు ఏం జరిగింది అనేది వ్యూహంలో చూపించబోతున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ‘జగ గర్జన’ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ తనదైన స్టైల్లో విమర్శలు కురిపించాడు. పవన్‌ను రంగులా రాజా అంటూ సంబోధిస్తూ సూపర్‌స్టార్ అయి ఉండి కూడా చంద్రబాబు చేతిలో బర్రెలాగా మారిపోయాడని ఎద్దేశా చేశాడు.
‘పవన్ కల్యాణ్ ముఖానికి రంగు వేసుకొని సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా.. అది చేస్తా అని సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు చెప్పి వెళ్తే బాగోదు. లేటెస్ట్‌గా చూస్తే తెలంగాణలో ఊరు, పేరు తెలియని బర్రెలు కాసే అమ్మాయి బర్రెలక్కగా పాపులర్ అయింది.
(చదవండి: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!)
పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ అయి ఉండి బర్రెలెక్క అయిపోయాడు. బర్రెలక్కకి బర్రెలెక్కకి తేడా ఏంటంటే.. బర్రెలక్క ఒక కాపరి. ఇక్కడ ఈయన(పవన్) ఒక బర్రె. చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే అది చేస్తున్నాడు. నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అది మొత్తం పోయింది. లోకేష్ అనే అతను ఎవరు? చంద్రబాబు కొడుకు కాకపోతే మాములు కార్తకర్త దగ్గర బాయ్‌గా పని చేసే అర్హత కూడా లేదు’ అని ఆర్జీవీ అన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment