Ram Gopal Varma Reacts on MM Keeravani Praise of Him - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: మరణించినా వారినే అలా పొగుడుతారు: ఆర్జీవీ

Published Sun, Mar 26 2023 8:53 AM | Last Updated on Sun, Mar 26 2023 10:41 AM

Ram Gopal Varma Reacts On MM Keeravani Praise Of him - Sakshi

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరవాణి ఆర్జీవీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. అయితే నాకు మాత్రం తొలి ఆస్కార్ రామ్ గోపాల్ వర్మనే అన్నారు. 

అయితే కీరవాణి ప్రశంసలపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఆయన ఇంటర్వ్యూ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. కీరవాణి అలా మాట్లాడుతుంటే తనకు చనిపోయినా ఫీలింగ్ కలుగుతోందని ఆర్జీవీ అన్నారు. కేవలం చనిపోయిన వారినే అలా పొగుడుతారంటూ ట్వీట్ చేశారు. 

కీరవాణి ఏమన్నారంటే..

కీరవాణి మాట్లాడుతూ..' నాకు లభించిన తొలి ఆస్కార్‌ రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించేందుకు నా మ్యూజిక్‌ క్యాసెట్స్‌ను కొందరికి షేర్‌ చేశా. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్‌ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్‌ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మ నాకు ఛాన్స్‌ ఇచ్చారు. ఆయన కెరీర్‌లో ‘శివ’ ఆస్కార్‌ రోల్‌ ప్లే చేస్తే.. నా కెరీర్‌లో రామ్‌గోపాల్‌వర్మ ఆస్కార్‌ రోల్‌ ప్లే చేశారు. రామ్‌గోపాల్‌వర్మతో వర్క్‌ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం.' అంటూ నాకు అవకాశాలిచ్చారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement