Ram Gopal Varma Shocking Comments on Star Heroes Remuneration - Sakshi
Sakshi News home page

KGF 2: స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌పై రామ్‌ గోపాల్‌ వర్మ షాకింగ్‌ ట్వీట్‌

Published Fri, Apr 15 2022 7:09 PM | Last Updated on Fri, Apr 15 2022 7:47 PM

Ram Gopal Varma Shocking Comments On Star Heroes Remuneration - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ.. చిత్ర పరిశ్రమలో ఈ పేరే ఓ సంచలనం. ఆయన ఎప్పుడు, ఎవరిపై, ఏరకమైన కామెంట్స్‌ చేస్తారో తెలీదు. ట్రెండింగ్‌ అంశాలను మాట్లాడడం, దాన్ని వివాదాస్పదం చేయడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒక అంశాన్ని మరో అంశంతో ముడిపెడుతూ.. కామెంట్స్‌ చేస్తుంటాడు. తాజాగా ఆర్జీవీ మరోసారి తనదైన మార్క్‌ చూపించాడు. అంతా కేజీయఫ్‌-2 సక్సెస్‌ గురించి మాట్లాడుకుంటుంటే.. ఆయన మాత్రం స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌ విషయాన్ని బయటకు తెచ్చాడు.

(చదవండి:  అప్పుడే ఓటీటీకి ‘కేజీయఫ్‌ 2’, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ అంటే..!)

కేజీయఫ్‌-2 పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆర్జీవీ వరస ట్వీట్లతో చిత్రయూనిట్‌పై, ముఖ్యంగా ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా కేజీయఫ్‌ సక్సెస్‌ని స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌తో ముడిపెడుతూ ట్వీట్‌ చేసి, ఇండస్ట్రీలో మరో వివాదానికి తెరలేపారు. ‘సినిమా మేకింగ్‌పై ఎంత ఎక్కువ డబ్బులు పెడితే..అంత మంచి చిత్రాలు బయటకు వస్తాయని చెప్పడానికి కేజీయఫ్‌-2 మూవీయే ఉదాహరణ. మేకింగ్‌లో ఎంత క్వాలిటీ ఉంటే..అంత భారీ సక్సెస్‌ వస్తుంది. అంతేకానీ స్టార్‌ హీరోలకు భారీ రెమ్యునరేషన్‌ ఇవ్వడం అనేది వృధా’అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు.

బాలీవుడ్‌, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌ భారీగానే ఉంటుంది. కోలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి. అయితే వీటితో పోల్చుకుంటే కన్నడ చిత్రపరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్‌ చాలా తక్కువనే చెప్పాలి. కేజీయఫ్‌ లాంటి సినిమాలు మినహాయిస్తే.. అక్కడ చాలా సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. వర్మ ట్వీట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement