KGF Chapter 2 Movie Actors And Full Cast Remuneration Details - Sakshi
Sakshi News home page

KGF 2 Actors Remuneration: యశ్‌ నుంచి ప్రకాశ్‌ రాజ్‌ దాకా.. కేజీఎఫ్‌ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే?

Published Fri, Apr 22 2022 1:36 PM | Last Updated on Fri, Apr 22 2022 3:04 PM

KGF Chapter 2 Movie Yash And Full Cast Remuneration Details - Sakshi

'వయలెన్స్‌.. వయలెన్స్‌.. వయలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌, ఐ అవాయిడ్‌.. బట్‌ వయలెన్స్‌ లైక్స్‌ మీ, ఐ కాంట్‌ అవాయిడ్‌..' కేజీఎఫ్‌ 2లోని పాపులార్‌ డైలాగ్‌ ఇది. రీల్‌ లైఫ్‌లోని డైలాగ్‌ రియల్‌ లైఫ్‌లోకి వచ్చేసరికి ఇదిగో ఇలా మారిపోయింది.. 'రికార్డ్స్‌, రికార్డ్స్‌, రికార్డ్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌, ఐ అవాయిడ్‌. బట్‌ రికార్డ్స్‌ లైక్స్‌ మీ, ఐ కాంట్‌ అవాయిడ్‌' అనేలా తయారైంది పరిస్థితి. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్‌ 2 బాక్సాఫీస్‌ దగ్గర దూసుకుపోతోంది. ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.268 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లకు పైగా రాబట్టింది. 

ఈ క్రమంలో కేజీఎఫ్‌ 2లో నటించిన తారలకు ఎంతమేర పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం రాఖీభాయ్‌ యశ్‌ ఈ సినిమాకు రూ.25 - 30 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడట. అధీరాగా నటించిన సంజయ్‌ దత్‌ రూ.10 కోట్లు, రవీనా టండన్‌ రూ.2 కోట్లు, శ్రీనిధి శెట్టి రూ.3-4 కోట్లు, ప్రకాశ్‌ రాజ్‌ రూ.80-85 లక్షల మేర రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రశాంత్‌ నీల్‌ రూ.15-20 కోట్ల దాకా అందుకున్నాడట!

చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్‌-2 ఎడిటర్‌

హీరోతో డేటింగ్‌, కామెంట్‌ డిలీట్‌ చేసిన బిగ్‌బీ మనవరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement