Sanjay Dutt (actor)
-
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
షూటింగ్లో పేలుడు.. సంజయ్ దత్‌కి గాయాలు? అసలు నిజమిదే
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కన్నడ సినిమా ‘కేడీ’ షూటింగ్లో గాయపడ్డారంటూ బుధవారం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ధృవ సర్జా హీరోగా జోగి ప్రేమ్ దర్శకత్వంలో ‘కేడీ: ది డెవిల్’ చిత్రం రూపొందుతోంది. బెంగళూరు సమీపంలోని మాగడి వద్ద వేసిన సెట్లో ఇటీవల ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ సీన్స్ తీస్తుండగా సంజయ్ దత్‌కి గాయాలైనట్లు వార్త గుప్పుమంది. అయితే ఈ వార్త నిజం కాదని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ‘‘నాకు గాయాలైనట్లు వచ్చిన వార్త అవాస్తవం. నేను ప్రస్తుతం ‘కేడీ’ షూటింగ్లో పాల్గొంటున్నాను. యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అన్నారు సంజయ్ దత్. There are reports of me getting injured. I want to reassure everyone that they are completely baseless. By God’s grace, I am fine & healthy. I am shooting for the film KD & the team's been extra careful while filming my scenes. Thank you everyone for reaching out & your concern. — Sanjay Dutt (@duttsanjay) April 12, 2023 -
కేజీఎఫ్ 2కు కోట్లల్లో కలెక్షన్లు, రెమ్యునరేషన్ కూడా కోట్లల్లోనే!
'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్..' కేజీఎఫ్ 2లోని పాపులార్ డైలాగ్ ఇది. రీల్ లైఫ్‌లోని డైలాగ్ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఇదిగో ఇలా మారిపోయింది.. 'రికార్డ్స్, రికార్డ్స్, రికార్డ్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ రికార్డ్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్' అనేలా తయారైంది పరిస్థితి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.268 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లకు పైగా రాబట్టింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2లో నటించిన తారలకు ఎంతమేర పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం రాఖీభాయ్ యశ్ ఈ సినిమాకు రూ.25 - 30 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడట. అధీరాగా నటించిన సంజయ్ దత్ రూ.10 కోట్లు, రవీనా టండన్ రూ.2 కోట్లు, శ్రీనిధి శెట్టి రూ.3-4 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.80-85 లక్షల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ రూ.15-20 కోట్ల దాకా అందుకున్నాడట! చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్ హీరోతో డేటింగ్, కామెంట్ డిలీట్ చేసిన బిగ్‌బీ మనవరాలు -
అలియాకు షాక్.. డిస్‌లైక్‌ల వరద
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’పై పడింది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. అయితే ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది దీన్ని డిస్లైక్ చేశారు. (ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా సడక్2 తెరకెక్కింది. దీనిలో సంజయ్ దత్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.(ఓటీటీలో సడక్ 2) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్లో హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభిమానులు. ఈ కారణంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్‌కు డిస్ లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. -
మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో ఇన్సైడర్, ఔట్‌సైడర్ చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బయటి వ్యక్తిని కావడంతో ఇండస్ట్రీలో పలు అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘పర్దేస్’ డైరెక్టర్ సుభాష్ ఘయ్ తనను తిట్టారని.. కోర్టుకు లాగుతానని బెదిరించారని తెలిపారు. ఆ సమయంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్లు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. మహిమా చౌదరి మాట్లాడుతూ.. ‘సుభాష్ ఘయ్ నన్ను విపరీతంగా తిట్టారు. కోర్టుకు లాగాలని ప్రయత్నించారు. నా ఫస్ట్ షోని రద్దు చేయించాలని చూశారు. నాతో పని చేయవద్దని మిగతా నిర్మాతలకు సందేశాలు పంపారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి చెందిన నలుగురు వ్యక్తులు మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. వారు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, డేవిడ్ ధావన్, రాజ్‌కుమార్ సంతోషి. వీరు మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. డేవిడ్ ధావన్ నన్ను పిలిచి బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఆయన నిన్ను వేధించకుండా చూస్తాము అని ధైర్యం చెప్పారు. వీరు తప్ప మిగతా ఎవ్వరు నాకు ఫోన్ చేయలేదు’ అన్నారు మహిమా చౌదరి. కానీ తాను కొన్ని మంచి అవకాశాలను కోల్పోయినట్లు తెలిపారు. వాటిలో 1998లో వచ్చిన రాంగోపాల్ వర్మ ‘సత్య’ చిత్రం కూడా ఉందన్నారు మహిమా చౌదరి. ('సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు') ఈ చిత్రం కోసం మొదట తననే తీసుకున్నారని.. తర్వాత తన స్థానంలో ఉర్మిళా మండోద్కర్‌ను పెట్టారని తెలిపారు మహిమా చౌదరి. ఇది తాను సంతకం చేసిన రెండవ చిత్రం అన్నారు. అయితే ఈ చిత్రం నుంచి తనను తొలగిస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులన్ని తాను బయటి వ్యక్తిని కావడం వల్లనే ఎదురయ్యాయని.. పరిశ్రమకు చెందిన వ్యక్తి అయితే ఇన్ని కష్టాలు ఉండేవి కాదన్నారు. ఏది ఏమైనా ధైర్యంగా నిలిచి పోరాడాలని తెలిపారు. మహిమా చౌదరి 1997లో వచ్చిన పర్దేస్ చిత్రంతో పరిశ్రమలో అడుగు పెట్టారు. -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సంజయ్‌దత్ (నటుడు), సోనియా దీప్తి (నటి) ఈ రోజు బర్త్‌డే చేసుకొంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించిన అంకె.శని వృత్తికారకుడు. 2015 సంవత్సర సంఖ్య కూడా 8. దీనిని యూనివర్సల్ ఇయర్ అని అంటారు. ఎవరికైనా, వారి సంవత్సర సంఖ్య, యూనివర్సల్ ఇయర్ ఒకటైన సందర్భంలో ఆర్థికంగా, సామాజికంగా... అన్నింటా అభివృద్ధికరంగా ఉంటుంది. గౌరవ సన్మానాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం జీవితంలో ఒక మైలురాయిలాగా గుర్తుండిపోతుంది. మీ పుట్టిన తేదీ 29. ఇది చంద్ర కుజుల కలయిక వల్ల ఏర్పడిన సంఖ్య. ఈ తేదీలో పుట్టిన వారికి 29 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో వృద్ధి ఉంటుంది. చంద్ర మంగళ యోగం వల్ల విదేశీ యానం ఉంటుంది. రాజకీయాలలో ఉన్న వారికి తగిన పదవి, గుర్తింపు లభిస్తాయి. అయితే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఆ ప్రతిపాదనలు విరమించుకోవడం మంచిది. పూర్వికుల ఆస్తి కలిసి వస్తుంది. భర్త ఆస్తిలో వాటా లేదా మనోవర్తి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పక లాభిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల విజయం సాధించగలుగుతారు. లక్కీ నంబర్స్: 2,4,6,8; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, బ్లూ, ఎల్లో, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శనివారాలు; లక్కీ మంత్స్: జనవరి, ఫిబ్రవరి, జూన్, అక్టోబర్, నవంబర్. సూచనలు: ఈశ్వరార్చన, వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయటం, కాకులకు ఆహారం పెట్టడం, బెల్లం, పాలు, బియ్యంతో చేసిన పాయసం లేదా ఇతర తీపి పదార్థాలు పంచిపెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్