సంజయ్ దత్, పూరి జగన్నాథ్, రామ్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరీల కాంబినేషన్‌లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది.
హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్‌తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment