iSmart Shankar
-
డబుల్ ఇస్మార్ట్ సాంగ్ గురించి పూరికి నాకు గొడవ అయింది !!
-
నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్
‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట ఓ ట్రెండ్ చూస్తున్నాను. అరే... నీకిది నచ్చిందా? అని అడిగితే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమో అని తోటివారిపైకి తోస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అని చూసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. సాధారణంగా నేను సలహాలివ్వను. నా అనుకున్నవాళ్లు అడిగితే ఇస్తా. మీ అందర్నీ (ఫ్యాన్స్) నా వాళ్లుగా ఫీలై ఇస్తున్నాను’’ అని రామ్ అన్నారు.హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లోనే 2019లో వచ్చిన హిట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘హీరోలు బుల్లెట్స్‌లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. పూరీగారిలాంటి గన్ ప్రతి ఒక్క యాక్టర్‌కి కావాలి. ఛార్మీ కౌర్‌గారు లేకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదు. ఆమె ఓ ఫైటర్. బాస్ లేడీ అని పిలుస్తాను.‘డబుల్ ఇస్మార్ట్’ రేంజ్‌కి తగ్గట్లు, ప్రేక్షకుల అంచనాలను మించేలా మణిశర్మగారు మ్యూజిక్ ఇచ్చారు’’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్‌గారు మా సినిమాలో యాక్ట్ చేసి, కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణసంస్థకు ఛార్మీ కౌర్ ఓ బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నాకోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసిస్తారు. నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజయేంద్రప్రసాద్‌గారు ఫోన్ చేసి, ‘సార్... నాకో హెల్ప్ చేస్తారా?’ అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి? అనుకున్నా. ‘తర్వాతి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? చేసే ముందు ఆ సినిమా కథ నాకోసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం చూడలేను. చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకోసారి చెప్పండి’ అన్నారు. నేను భావోద్వేగానికి గురయ్యాను. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కథను విజయేంద్రప్రసాద్‌గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా’’ అని తెలిపారు పూరి జగన్నాథ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’ను ఆదరించినట్లే ‘డబుల్ ఇస్మార్ట్’నూ ఆదరించండి’’ అన్నారు ఛార్మీ. పూరీ కనెక్ట్స్ సీఈవో విషు రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ ఇస్మార్ట్‌ని ఎంజాయ్ చేస్తారు: సంజయ్ దత్
‘‘తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ‘డబుల్ ఇస్మార్ట్’లో నన్ను భాగం చేసి, బిగ్ బుల్గా చూపిస్తున్న ఆయనకి థ్యాంక్స్. రామ్‌తో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అన్నారు. రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘బిగ్ బుల్...’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘డబుల్ ఇస్మార్ట్’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్గారితో పని చేయడం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సంజయ్ బాబాకి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని పూరి జగన్నాథ్ చె΄్పారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్, పూరి కనెక్ట్స్ సీఈవో విష్, నటుడు అలీ మాట్లాడారు. -
ఫైట్స్ చేయడం సవాల్‌గా అనిపించింది: కావ్యా థాపర్
‘‘నేనిప్పటివరకూ వైవిధ్యమైన పాత్రలు చేశాను. తొలిసారి ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేశాను. మొదటిసారి ఫైట్స్ చేయడం, పాటల్లో ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసే అవకాశం రావడం సవాల్‌గా అనిపించింది’’ అని హీరోయిన్ కావ్యా థాపర్ అన్నారు. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కావ్యా థాపర్ పంచుకున్న విశేషాలు. పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో నటించాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’కి నా ఆడిషన్స్ నచ్చి పూరి సార్, ఛార్మీగారు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరీగారు గొప్ప డైరెక్టర్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే చిన్న అమాయకత్వం కూడా ఉంటుంది. రామ్‌గారితో సాంగ్ షూట్లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. అయినా సెట్‌కి వెళ్లాను. ఛార్మీగారు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్చార్జ్ అయ్యాను... నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. మణిశర్మగారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘డబుల్ ఇస్మార్ట్’ నేరుగా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నాకు యాక్షన్ రోల్స్, అడ్వంచరస్ మూవీస్ చేయాలని ఉంది. ప్రస్తుతం గోపీచంద్‌గారితో ‘విశ్వం’ చిత్రంలో నటిస్తున్నాను. మరికొన్నిప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి. -
డబ్బింగ్ డన్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్ర పోషించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన హిందీ వెర్షన్ డబ్బింగ్‌ని పూర్తి చేశారు సంజయ్ దత్. హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్ ’(2019)కి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄÷ందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా చేశారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
ఇస్మార్ట్ శంకర్‌కు ఐదేళ్లు.. రామ్ పోతినేని స్పెషల్ పోస్ట్!
టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని-పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.అయితే 2019 జూలై 18 ఇస్మార్ట్ శంకర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ మూవీ అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.20 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్ స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. 'ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మెంటల్ మాస్ మ్యాడ్నెస్.. ఇస్మార్ట్ శంకర్' అంటూ పోస్ట్ చేశారు. ఆగస్టు 15న డబుల్ మ్యాడ్నెస్ను ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 5 Years for this Mental Mass Madness! #iSmartShankar Let’s Celebrate this Double Madness on 15th of August! -USTAAD #DoubleiSmart SHANKAR pic.twitter.com/0pSbqTkX6N— RAm POthineni (@ramsayz) July 18, 2024 -
గుమ్మడికాయ కొట్టారు
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు హీరో రామ్. 2019లో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రధారులు.ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. సో.. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ యూనిట్ గుమ్మడికాయ కొట్టింది. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
కౌంట్‌డౌన్ స్టార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఆగష్టు 15న సినిమాని విడుదల చేయనున్నాం. సినిమా రిలీజ్‌కి సరిగ్గా 50 రోజులు ఉంది. అందుకే 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్క్ చేస్తూ రామ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ షూట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
తేదీ తార్ మార్
వచ్చేస్తున్నా అంటూ ఓ డేట్ చెప్పారు. అయితే ఆ డేట్‌కి కాకుండా కాస్త లేట్‌గా వస్తా అంటున్నారు. చెప్పిన డేట్కన్నా ముందే వస్తా అంటున్నవారూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని తెలుగు చిత్రాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ అలా వాయిదాలు పడి, ఫైనల్లీ ఈ 27న థియేటర్స్‌కి వస్తోంది. ఇలా రిలీజ్ డేట్‌ను తారుమారు చేసుకున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. దేవర.. ఓ పెద్ద కథ ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమాని ప్రకటించినప్పుడే విడుదల తేదీ (2024 ఏప్రిల్ 5న)ని కూడా ప్రకటించారు మేకర్స్. కానీ కథ పెద్దది కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ తర్వాత పేర్కొన్నారు. అయితే చిత్రీకరణ ప్లాన్ చేసిన ప్రకారం జరగకపోవడంతో తొలి భాగం విడుదలను అక్టోబరు 10కి వాయిదా వేశారు.కానీ కాస్త ముందుకి వస్తున్నాడు ‘దేవర’. సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన మరో సినిమా సెప్టెంబరు 27న రాకపోవడంతో ఈ తేదీకి ‘దేవర’ రావడానికి రెడీ అయ్యాడట. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కానున్నారు. పుష్పరాజ్... సీన్ రిపీట్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై, మంచి విజయం సాధించింది. హీరో పుష్పరాజ్‌గా టైటిల్ రోల్ చేసిన అల్లు అర్జున్‌కి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. ఇక తొలి భాగం సాధించిన విజయంతో జోష్‌గా మలి భాగం ‘పుష్ప: ది రూల్’ను ఆరంభించారు. కొంత చిత్రీకరణ తర్వాత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు.క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేక ‘పుష్ప: ది రూల్’ రిలీజ్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘పుష్ప: ది రైజ్’ను కూడా తొలుత 2021 ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబరులో విడుదల చేశారు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకుని డిసెంబరు 6కి మార్చారు. తొలి భాగానికి జరిగిన సీన్ రిపీట్ అయింది. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ రెడీ ‘ఇస్మార్ట్ శంకర్’గా హీరో రామ్‌లోని మాస్ యాంగిల్‌ని ఓ రేంజ్లో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం 2019లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథలో సీక్వెల్‌కు స్కోప్ ఉండటంతో రామ్‌తోనే ‘డబుల్ ఇస్మార్ట్’ను ప్రకటించారు పూరి. ఈ సినిమా ప్రకటించిన రోజునే 2024 మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. కానీ విడుదల కాలేదు. ఆ తర్వాత జూలైలో విడుదల కావొచ్చనే ప్రచారం సాగింది. ఈ మూవీ చిత్రీకరణ అనుకున్నట్లుగా సాగలేదట. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌కి రెడీ చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలు. ముందుకు రానున్న లక్కీ భాస్కర్‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘లక్కీ భాస్కర్’ని సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అదే తేదీకి తెరపైకి రానుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ‘దేవర’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారట.దీంతో ఒకే రోజు ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాల విడుదల ఎందుకని భావిస్తున్నారట నాగవంశీ. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్‌ను కాస్త ముందుగానే ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. అయితే ఆగస్టు 15న ఇప్పటికే రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమాలు ఉన్నాయి. సో.. ‘లక్కీ భాస్కర్’ ఏ తేదీన వస్తాడో చూడాలి. ఇక దుల్కర్ సూపర్ హిట్ మూవీ ‘సీతారామం’ 2022 ఆగస్టు తొలివారంలో విడుదలైంది. ఈ సెంటిమెంట్‌ని అనుసరించి, ‘లక్కీ భాస్కర్’ని కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.ఈ కోవలోనే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ముందుకు, వెనక్కు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇస్మార్ట్ మ్యూజిక్
‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరందుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేసి, ‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్‌కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్లో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ చిత్రీకరణ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నది ఫిల్మ్‌నగర్ తాజా కబురు. -
డబుల్ ఇస్మార్ట్‌కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
ముంబైలో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ దత్ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి, సిక్స్ ΄్యాక్తో మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్..
-
ఐదు భాషల్లో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా షురూ అయింది. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారంప్రారంభమైంది. ‘ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ డైలాగ్ చెప్పిన తొలి సీన్‌కి చార్మి క్లాప్ ఇవ్వగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄పొందుతోంది. పూరి జగన్నాథ్ చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ రాశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ఈ సినిమాలో రామ్‌ని మాసియర్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు పూరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న ‘డబుల్ ఇస్మార్ట్’ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి. -
పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్
2019లో పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించి వారిద్దరికీ బ్లాక్ బస్టర్‌గా నిలించింది. ఈ సినిమా సీక్వెల్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఇస్మార్ట్ అప్డేట్ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. లైగర్ రిజల్ట్ తనను తీవ్రంగా బాదించినా మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి. తనలో ఉన్న ప్రత్యేకత ఇదేనని చెప్పవచ్చు. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ బేస్ పూరికి ఉంది. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) నేడు జులై 10న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినట్లు యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన పలు షేర్ చేసింది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ కిక్ ఇవ్వడమే కాకుండా.. లైగర్‌తో నష్టపోయిన పూరి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం ఖాయం. బాలీవుడ్ హీరోయిన్ రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. With the blessings of Lord Shiva 🔱 Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh's#DoubleISMART Pooja ceremony commenced 🪔 Shoot Begins on July 12th❤️🔥 Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/Kj9vDRHiIg — Puri Connects (@PuriConnects) July 10, 2023 (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!) -
ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్!
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రానుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నేడు (మే 15) రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘డబుల్ ఇస్మార్ట్’ని ప్రకటించి, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హై బడ్జెట్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈసారి రెట్టింపు మాస్, రెట్టింపు వినోదాన్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
తగ్గని ‘ఇస్మార్ట్ శంకర్’ హవా.. రామ్ పోతినేని సరికొత్త రికార్డు
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గట్లేదు. యూట్యూబ్‌లో ఈ మూవీ దూసుకెళ్తోంది. తాజాగా 200మిలియన్ల(20 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. 2019లో విడుదలైన ఈ మూవీ హిందీ వెర్షన్‌ని గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో పెట్టారు. టాలీవుడ్ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్ శంకర్‌కి నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 1.9మిలియన్ల లైకులలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆన్లైన్లో డబ్బింగ్ సినిమాల ద్వారా 20 కోట్ల పైగా వ్యూస్ తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. సౌత్ ఇండియా నుంచి నాలుగు సినిమాలను 200 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా రామ్ ఘనతను దక్కించుకొన్నారు .మొత్తానికి ఇస్మార్ట్ హీరో రామ్ నటనకు ఇపుడు సౌత్ ప్రేక్షకులే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారని యూట్యూబ్ రికార్డులే తెలియజేస్తున్నాయి. -
Ram Pothineni: ఆ ఘనత సాధించిన ఏకైక సౌత్ హీరో రామ్ ఒక్కడే
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునన హీరో రామ్ పోతినేని. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్ పుట్టించే యంగ్ హీరోల్లో రామ్‌ఒకరు. నేడు (మే 15) రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత వైవీఎస్ చౌదరీ దర్శకత్వం వహించిన దేవదాస్(2006) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే రామ్ మాత్రం కథలను ఆచితూచి ఎంచుకున్నాడు. రెండో చిత్రం ‘జగడం’ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’చేసి బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి. ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది. ఈ సినిమా తొలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్‌ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్ హీరో. అంతే కాదు ఈ సినిమాను డబ్ చేసి హిందీలో వదిలితే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ‘రెడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అతను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా అతని కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలాగే సినీ కేరీర్ రామ్ దూసుకెళ్తూ మరిన్ని రికార్డుకు క్రియేట్ చేయాలని ‘సాక్షి’ తరపున ఆయనకు బర్త్‌డే విషెష్ అందజేస్తుంది. -
బాలీవుడ్‌కి ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. సంచలనాత్మక విజయం సాధించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని సమాచారం. రామ్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలిసింది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ హిందీ రీమేక్‌ను పూరి జగన్నాథే దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఓ టాక్. -
పవర్ స్టార్ నుంచి ‘గడ్డి తింటావా?’
సంచలనాలకు చిరునామా, వివాదాలకు కేరాఫ్.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’. ఇందులో అచ్చంగా హీరో పవన్ కల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి "గడ్డి తింటావా?" పాట నేడు సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానుంది. ఇక ఈ పాటలో హీరో తన గేదెలు, మొక్కలను ఉద్దేశిస్తూ పాడతాడని ఆర్జీవీ పేర్కొన్నారు. పనిలో పనిగా వర్మ ‘పవర్ స్టార్’ సినిమాలో ఓ క్యారెక్టర్ అంటూ... అతడు ఎవరి పోలికతో అయినా ఉన్నాడా అంటూ ట్వీట్ చేశారు. A character from POWER STAR ..Does he resemble anyone ??? pic.twitter.com/qVKa0nNSlb — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2020 సెటైరికల్ మూవీగా కనిపిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ జూలై 22న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. అయితే ఓ కండీషన్! 25 రూపాయలు చెల్లించిన తర్వాతే ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ట్రైలర్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఇలా ట్రైలర్ చూసేందుకు డబ్బులు వసూలు చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో సినిమా విడుదల కానుంది. ఇక ఇప్పటికే 'పవన్ కళ్యాణ్' సినిమా నుంచి విడుదలైన పలు చిత్రాలు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. (బ్రేకింగ్ న్యూస్) పూరీకి ఆర్జీవీ కంగ్రాట్స్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ విడుదలై శనివారం(జూలై 18)తో ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా పూరీ ట్విటర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. "సరిగ్గా ఏడాది క్రితం ఈరోజు ఒక పండుగ వాతావారణం ఉండేది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ అవడానికి నిర్మాత చార్మీ ఎంతగానో శ్రమించారు. అలాగే హీరోయిన్లు నిధి అగర్వాల్, నభాటేష్తో పాటు టీమ్ అందరికీ నా ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చారు. దీనిపై వర్మ స్పందిస్తూ "మీకు, చార్మీకి శుభాకాంక్షలు. మీ తర్వాతి సినిమా కూడా మరింత బ్లాక్బాస్టర్ అవాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. (‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది) -
‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది
‘‘సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా మేం ఏ సెలబ్రేషన్స్ చేయటంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరం ఇంటిపట్టునే ఉంటున్నాం. హీరో రామ్ ఫ్యాన్స్ కూడా కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చార్మి. రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి కనెక్ట్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి చార్మి ఓ నిర్మాత. శనివారం (జులై 18)తో ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చార్మి చెప్పిన విశేషాలు. రామ్, పూరి జగన్నాథ్ ► పూరీగారితో పాటు టీమ్ అందరం సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూశాం. సక్సెస్ అనే ఆకలి తీరాలనుకున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించి మా ఆకలిని తీర్చారు పూరి. ఈ సినిమా కథను రామ్ కోసమే రాశారు పూరీగారు. ఆయన కథ చెప్పినప్పుడు రామ్ ఏ ఎనర్జీతో ఉన్నారో షూటింగ్ జరుగుతున్నంత సేపు అదే ఎనర్జీ, అదే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. రామ్ హీరోగా పూరీగారి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. అది ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెలా, మరో సినిమానా అనేది ఇప్పుడే చెప్పలేను. ► విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్యాన్ ఇండియా చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్‌నే ఫిక్స్ చేశాం. మిగతా భాషలన్నింటికీ కలిపి ఒకే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇకనుంచి మా బ్యానర్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలనుకుంటున్నాం. ► ఓటీటీకి కంటెంట్ క్రియేట్ చేయడానికి మా పూరి కనెక్ట్స్ సంస్థ కూడా ప్రిపేర్ అవుతోంది. భవిష్యత్‌లో రెగ్యులర్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి కూడా సినిమాలు చేసుకుంటూ వెళతాం. దాదాపు అన్ని స్క్రిప్ట్‌లు పూరీగారు రాసినవే ఉంటాయి. ఓటీటీపై రూపొందించే చిత్రాల ద్వారా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ► ఈ లాక్డౌన్ టైమ్‌లో పూరీగారికి రైటింగ్ తప్ప వేరే వ్యాపకమే లేదు. నాలుగు నెలలుగా పూరీగారు రైటింగ్ సైడే దృష్టి పెట్టారు. భవిష్యత్‌లో పూరి కనెక్ట్స్ నుంచి హృదయానికి ఆనందం ఇచ్చే కథలను ప్రేక్షకులు చూడబోతున్నారు. నటిగా ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఇప్పుడు నటించాలనే ఇంట్రస్ట్ లేదు. మా పూరి కనెక్ట్స్ ద్వారా మంచి సినిమాలు తీసే ప్లానింగ్‌లో ఉన్నాం. మరో పదేళ్లకు సరిపడా ప్రొడక్షన్‌ను ఎలా ప్లాన్ చేయాలి, ఎలాంటి కథలు చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి. -
‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’
నిన్న హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు. అభిమానులు, సహ నటులు సోషిల్ మీడియా వేదికగా రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే లాక్డౌన్ నేథ్యంలో అభిమానులు తన పుట్టిన రోజుకు వేడుకలకు దూరంగా ఉండాలంటూ రామ్ పిలుపునిచ్చారు. ఇక తమ అభిమాన హీరో పిలుపు మేరకు అభిమానులు బర్త్‌డే వేడుకలకు దూరంగా ఉన్నారు. కానీ రామ్ పేరు మీద పూజలు, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తన మీద ఇంత అభిమానం చూపుతున్న ఫ్యాన్స్‌కు రామ్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.(అదే మీరు నాకిచ్చే అసలైన కానుక : రామ్) ‘మీరో చాలా మంది తినకుండా, రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారని విన్నాను. మీరు నా మీద చూపిస్తోన్న ప్రేమకు గర్వంగా ఫీలవుతున్నాను. మీ లాంటి అభిమానలను కలిగి ఉండటం నిజంగా నా అదృష్టం. ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటూ రామ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ‘డింఛక్’ అనే మాస్ సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ కంపోజ్ చేయగా సాకేత్, కీర్తనలు పాడారు. To my dearest fans, I’ve heard that many of you haven’t eaten or slept all night💔.. just to show me the kind of love you have for me to the entire World!..I’m truly touched & blessed to have all of you! ISTA! MOTHAM TIRIGICHESTA! 🔥 Cuz I.. Love you all more..❤️#RAPO pic.twitter.com/9GPuIJYrnL — RAm POthineni (@ramsayz) May 15, 2020 -
‘ఇస్మార్ట్ శంకర్’.. హవా మామూలుగా లేదు!
‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గలేదు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో గతేడాది వచ్చిన ఈ సినిమా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. తాజాగా 100 మిలియన్ల(10 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. ఫిబ్రవరి 16న యూట్యూబ్‌లో పెట్టిన హిందీ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా లైకులు కూడా తెచ్చుకుంది. ఆన్లైన్లో డబ్బింగ్ సినిమాల ద్వారా 10 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైకులు తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. ఈ ఘనత సాధించిన మొదటి హీరో రామ్ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కూడా ఇటీవల 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ని దాటింది. ఈ సందర్భంగా అభిమానులకు హీరో రామ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన ‘రెడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 9 విడుదల చేయాలనుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా లాక్డౌన్ ప్రకటించడంతో విడుదల వాయిదా పడింది. (100 మిలియన్ మార్కును దాటిన 'ఇస్మార్ట్' పాట)