డబ్బింగ్‌ డన్‌ | Ram Pothineni and Sanjay Dutt join Puri Jagannadh in stunning poster | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ డన్‌

Published Thu, Jul 25 2024 4:04 AM | Last Updated on Thu, Jul 25 2024 4:04 AM

Ram Pothineni and Sanjay Dutt join Puri Jagannadh in stunning poster

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్ర పోషించిన చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన హిందీ వెర్షన్‌ డబ్బింగ్‌ని పూర్తి చేశారు సంజయ్‌ దత్‌. హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హిట్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌ ’(2019)కి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రూ΄÷ందింది. 

ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ విలన్‌గా చేశారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement