
ఇస్మార్ట్ శంకర్ సినిమా చాలా మంది కెరీర్‌లకు మంచి బూస్ట్ ఇచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్‌తో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్‌కు కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. అంతేకాదు హీరోయిన్ నభా నటేష్‌కు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కలిసొచ్చినట్టుగానే ఉంది. ఈ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటిస్తున్నసాయి ధరమ్ తేజ్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో కలిసి సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. బీవీయస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా హీరోయిన్‌గా నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అక్కినేని నట వారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రంలోనూ హీరోయిన్‌గా నభా పేరునే పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment