చెప్పింది చేసుకుంటూ వెళ్లడమే! | Actress Nabha Natesh Class Role In Solo Brathuke So Better | Sakshi
Sakshi News home page

చెప్పింది చేసుకుంటూ వెళ్లడమే!

Published Tue, Dec 22 2020 11:16 AM | Last Updated on Tue, Dec 22 2020 2:04 PM

Actress Nabha Natesh Class Role In Solo Brathuke So Better - Sakshi

సాయితేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బుని దర్శకునిగా పరిచయం చేస్తూ, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో విలువలు పాటించే అమ్మాయి పాత్ర నాది. నా పాత్రను ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు సుబ్బు. నా గత చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో మాస్‌ అమ్మాయిగా నటించాను. ‘సోలో బ్రతుకే..’లో క్లాస్‌ అమ్మాయి పాత్ర చేశాను. డైరెక్టర్‌ చెప్పింది చెప్పినట్లు చేస్తూ కష్టపడటమే నాకు తెలుసు.

ఈ సినిమాలో యంగ్‌ నటీనటులతో పాటు సీనియర్‌ నటులు రాజేంద్రప్రసాద్, నరేశ్‌గార్లతో నటించటం ఆనందంగా ఉంది. హీరో తేజ్‌ నాకు మంచి స్నేహితుడు, మంచి కో–స్టార్‌. తమన్‌ చక్కని ట్యూన్‌లు ఇవ్వటంతో పాటలు హిట్టయ్యాయి. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎలా ఎంజాయ్‌ చేస్తారో చూడాలని ఆసక్తిగా ఉంది. ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో మా సినిమా మొదట ఓటీటీలో విడుదలవుతుందనుకున్నాను. దాంతో కొంచెం టెన్షన్‌ పడ్డాను. ఈలోపు థియేటర్లు ఓపెన్‌ అవ్వటం, మా మేకర్స్‌ థియేటర్‌లో సినిమా విడుదల చేస్తానని చెప్పటం చకచకా జరిగిపోయాయి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement