
రామ్
ఇస్మార్ట్ శంకర్ తన టెంపర్, డబుల్ ధిమాక్ తెలివిని చూపియనీకి రెడీ అయుండు. ఈ డబుల్ ధిమాక్ హైదరాబాదీని కలవాలంటే జూలై 12 వరకూ వేచి ఉండండి అంటోంది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రబృందం. రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ట్యాగ్‌లైన్ డబుల్ ధిమాక్ హైదరాబాదీ. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ఈ సినిమాను జూలై 12న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రామ్ టెరిఫిక్‌గా ఉన్నాడని అభినందిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తయింది. 3 పాటలు మినహా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట.
Comments
Please login to add a commentAdd a comment