
చార్మి, పూరి జగన్నాథ్, నభా నటేశ్, రామ్
ఇస్మార్ట్ శంకర్ తనకు అప్పగించిన పని పూర్తిచేసేశాడు. పనైపోయిందని గుమ్మడికాయ కూడా కొట్టేశాడు. మరి అతనికి అప్పజెప్పిన పనేంటి? అలాగే అతను చేసిన అల్లరేంటో స్క్రీన్ మీద తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డబుల్ ధిమాక్ హైదరాబాదీ అన్నది క్యాప్షన్. నభా నటేశ్, నిధీ అగర్వాల్ కథానాయికలు. పూరి జగన్నాథ్, చార్మీ నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం పూర్తయింది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 18న రిలీజ్‌కు రెడీ అయింది.
Comments
Please login to add a commentAdd a comment