మాల్దీవుల్లో రొమాన్స్‌ | ismart shankar romantic song shooting in maldives | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో రొమాన్స్‌

Published Sat, Jun 15 2019 12:37 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

ismart shankar romantic song shooting in maldives - Sakshi

రామ్

రామ్, ని«ధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం మాల్దీవుల్లో రామ్, నిధి అగర్వాల్‌పై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మణిశర్మ స్వరకర్త. ‘‘రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌కు, దిమాక్‌ ఖరాబ్‌ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. పునీత్‌ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రాజ్‌ తోట కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement