
రామ్
పేరు శంకర్.. ఇస్మార్ట్ శంకర్.. పక్కా హైదరాబాదీ. డబుల్ ధిమాక్ ఉన్నోడు. ఇప్పటి వరకూ ‘ఇస్మార్ట్ శంకర్’ గురించి మనకు ఈ డీటైల్స్ మాత్రమే తెలుసు. మే 15 నుంచి శంకర్ ఎలాంటోడో చిన్న శాంపిల్ చూపిస్తాం అంటున్నారు పూరి జగన్నాథ్ అండ్ టీమ్. రామ్, నభా నటేశ్, నిధీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మీ, పూరి నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తయింది. నాలుగు పాటలు మిగిలున్నాయి. ఈనెల 15 రామ్ బర్త్‌డే. ఆ రోజే చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మిగిలిన నాలుగు పాటల్లో రెండు పాటల్ని హైదరాబాద్‌లో, ఒక పాటను గోవాలో, మరో పాటను యూరప్‌లో చిత్రీకరించబోతున్నారని తెలిసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట.
Comments
Please login to add a commentAdd a comment