
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి తో కలిసి చార్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నబా నటేష్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పూరి మార్క్ మాస్‌తో పాటు రామ్ ఎనర్జితో ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ఇద్దరి కెరీర్‌కు ఈసినిమా కీలకం కావటంతో ఇస్మార్ట్ శంకర్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పూరి కూడా ఈ సారి మరింత జాగ్రత్తగా సినిమాను రూపొందించాడు. ట్రైలర్ మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు రామ్ యాటిట్యూడ్ ఆకట్టుకునేలా ఉంది. మరి ఇస్మార్ట్ శంకర్.. రామ్, పూరిల కెరీర్‌ణు గాడిలో పెడుతుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment