Ram Pothineni And Puri Jagannadh Double Ismart Is Officially Launched - Sakshi
Sakshi News home page

Puri Jagannadh- Ram: డబుల్‌ 'ఇస్మార్ట్ శంకర్' షురూ

Published Mon, Jul 10 2023 12:46 PM | Last Updated on Mon, Jul 10 2023 1:00 PM

Ram Pothineni And Puri Jagannadh Double Ismart Is Officially Launched - Sakshi

2019లో పూరి జగన్నాథ్‌- రామ్‌ పోతినేని కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' భారీ హిట్‌ అందుకుంది. ఆ సినిమా మాస్‌ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించి వారిద్దరికీ బ్లాక్‌ బస్టర్‌గా నిలించింది. ఈ సినిమా సీక్వెల్‌ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఇస్మార్ట్‌ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ షేర్‌ చేసింది. లైగర్ రిజల్ట్ తనను తీవ్రంగా బాదించినా మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి. తనలో ఉన్న ప్రత్యేకత ఇదేనని చెప్పవచ్చు. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్‌ బేస్‌ పూరికి ఉంది. 

(ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్‌ అయిన హీరోయిన్‌)

నేడు జులై 10న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినట్లు యూనిట్‌ తెలిపింది. అందుకు సంబంధించిన పలు షేర్‌ చేసింది. జులై 12 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. దీనికి   ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌ను కన్ఫామ్‌ చేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో  భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు.  అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్‌ కిక్‌ ఇవ్వడమే కాకుండా.. లైగర్‌తో నష్టపోయిన పూరి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం ఖాయం.

బాలీవుడ్‌ హీరోయిన్‌
రామ్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోక హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తుండగా  ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: అ‍ల్లర్ల మధ్య హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement