ఇస్మార్ట్‌ శంకర్‌కు ఐదేళ్లు.. రామ్ పోతినేని స్పెషల్ పోస్ట్! | Tollywood Hero Ram Pothineni's Special Post On iSmart Shankar | Sakshi
Sakshi News home page

Ram Pothineni: /ఆ రోజు డబుల్‌ మ్యాడ్‌నెస్‌'.. రామ్ స్పెషల్ పోస్టర్!

Published Thu, Jul 18 2024 3:43 PM | Last Updated on Thu, Jul 18 2024 3:54 PM

Tollywood Hero Ram Pothineni's Special Post On iSmart Shankar

టాలీవుడ్‌ మాస్‌ హీరో రామ్ పోతినేని-పూరి జగన్నాధ్‌ కాంబోలో వస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‍అయితే 2019లో విడుదలైన ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

అయితే 2019 జూలై 18 ఇస్మార్ట్‌ శంకర్‌ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్‌ మూవీ అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.20 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్ స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. 'ఫైవ్ ఇయర్స్‌ ఆఫ్ మెంటల్‌ మాస్ మ్యాడ్‌నెస్‌.. ఇస్మార్ట్‌ శంకర్' అంటూ పోస్ట్ చేశారు. ఆగస్టు 15న డబుల్‌ మ్యాడ్‌నెస్‌ను ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement