ఫైట్స్‌ చేయడం సవాల్‌గా అనిపించింది: కావ్యా థాపర్‌ | Kavya Thapar Interesting Comments About Double Smart Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

ఫైట్స్‌ చేయడం సవాల్‌గా అనిపించింది: కావ్యా థాపర్‌

Published Wed, Aug 7 2024 12:04 AM | Last Updated on Wed, Aug 7 2024 1:37 PM

Kavya Thapar About Double Smart movie

‘‘నేనిప్పటివరకూ వైవిధ్యమైన పాత్రలు చేశాను. తొలిసారి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ చేశాను. మొదటిసారి ఫైట్స్‌ చేయడం, పాటల్లో ఫుల్‌ జోష్‌తో డ్యాన్స్‌ చేసే అవకాశం రావడం సవాల్‌గా అనిపించింది’’ అని హీరోయిన్‌ కావ్యా థాపర్‌ అన్నారు. రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కావ్యా థాపర్‌ పంచుకున్న విశేషాలు. 

పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో నటించాలని ఉండేది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి ఆడిషన్‌ ఇచ్చాను కానీ కుదరలేదు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కి నా ఆడిషన్స్‌ నచ్చి పూరి సార్, ఛార్మీగారు చాన్స్‌  ఇచ్చారు. ఇప్పుడు డబుల్‌ ఫన్, ఎంటర్‌టైన్మెంట్‌ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరీగారు గొప్ప డైరెక్టర్‌. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.  

ఈ మూవీలో నా క్యారెక్టర్‌ చాలా బోల్డ్‌ అండ్‌ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే చిన్న అమాయకత్వం కూడా ఉంటుంది. రామ్‌గారితో సాంగ్‌ షూట్‌లో ఫస్ట్‌ డే మార్నింగ్‌ సిక్‌ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్‌ కావాల్సిన సాంగ్‌ అది. అయినా సెట్‌కి వెళ్లాను. ఛార్మీగారు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్‌ ఎనర్జీతో డిస్‌చార్జ్‌ అయ్యాను... నా బెస్ట్‌ డ్యాన్స్‌ ఇచ్చాను.  

మణిశర్మగారు లెజండరీ కంపోజర్‌. ఆయన సాంగ్స్‌కి డ్యాన్స్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నేరుగా హిందీలో రిలీజ్‌ కావడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నాకు యాక్షన్‌ రోల్స్, అడ్వంచరస్‌ మూవీస్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం గోపీచంద్‌గారితో ‘విశ్వం’ చిత్రంలో నటిస్తున్నాను. మరికొన్నిప్రాజెక్ట్స్‌ చర్చల్లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement