
రామ్, నిధీ అగర్వాల్
ఇస్మార్ట్ శంకర్ మస్తు మాసు. అట్లని హీరోయిన్లతో అన్నీ మాస్ పాటలే పాడుకుంటాడా ఏందీ? మెలోడీలు కూడా పాడుకుంటాడు. తన ప్రేయసిని ప్రేమగా ఉండిపోమంటాడు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇ స్మార్ట్ శంకర్’. డబుల్ దిమాక్ హైదరాబాద్ అన్నది క్యాప్షన్. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. చార్మీ, పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ కంపోజ్ చేసిన ‘ఉండిపో ఉండిపో..’ అనే మెలోడీ సాంగ్‌ను శనివారం రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట..
Comments
Please login to add a commentAdd a comment