
ఆంధ్రాపోరీ, మెహబూబా అంటూ తన తనయుడిని హీరోగా లాంచ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే ఈ సారి పూరి జగన్నాథ్ కథను అందించి తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మరోసారి తన తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈ మూవీకి ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు పూరి జగన్నాథ్ అందించగా.. తన శిష్యుడు అనిల్ పాడురిని దర్శకుడిగా పరిచయం చేయబోతోన్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా అయినా ఆకాష్‌కు కలిసి వస్తుందో లేదో చూడాలి. పూరి కనెక్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం పూరి రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’తో బిజీగా ఉన్నాడు.
#romantic @ActorAkashPuri @Charmmeofficial #AnilPaduri #shootbegins pic.twitter.com/hubvghGZc0
— PURIJAGAN (@purijagan) February 11, 2019
Comments
Please login to add a commentAdd a comment