ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌ | Ram Pothineni Special Workouts For Ismart Shankar | Sakshi
Sakshi News home page

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

Jul 17 2019 11:11 AM | Updated on Jul 17 2019 11:17 AM

Ram Pothineni Special Workouts For Ismart Shankar - Sakshi

ట్రైనర్‌ వెంకట్‌తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రామ్‌

శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లొ కొట్టావే డోలుబాజా’ అంటూ తెలుగు కుర్రాళ్ల ప్రతినిధిగా తెరమీద సందడి చేసే లవర్‌బాయ్‌ ఇప్పుడు పదునైన మాస్‌ డైలాగుల్తో స్క్రీన్‌పై మెరిసిపోనున్నాడు. ఫైట్స్‌తో ఇరగదీయనున్నాడు. తల వెంట్రుకల దగ్గర్నుంచి కాలివేళ్ల దాకా టాప్‌ టు బాటమ్‌ ఫిజిక్‌ను కూడా మార్చేసుకున్నాడు. త్వరలో తెరపై తళుక్కుమననున్న తన డ్రీమ్‌ ఫిజిక్‌  కోసం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చేసిన కృషి, పడిన శ్రమ ఎలాంటిది? టార్క్‌ ఫిట్‌నెస్‌ స్టూడియో ట్రైనర్‌ వెంకట్‌ మాడమాల మాటల్లో..!

రామ్‌ గారికి గతంలో అడపాదడపా వర్కవుట్‌ గైడెన్స్‌ ఇచ్చిన అనుభవం నాకు ఉంది. అయితే ఈ సినిమా కోసం ఆయన పూర్తి ట్రాన్స్‌ఫార్మేషన్‌ కావాలి... అది కూడా చాలా తక్కువ టైమ్‌లో అన్నప్పుడు కొంచెం సర్‌ప్రైజ్‌ అనిపించింది. ఎందుకంటే ఆయన బేసిగ్గా జిమ్‌ లవర్‌ కాదు. హెవీ వెయిట్స్‌ చేయరు. అటువంటì ది ఫుల్‌ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ అంటే చిన్న విషయం కాదు.. అయితే ఆయన పట్టుదలగా ఉన్నారు. సో స్టార్ట్‌ చేశాం. జిమ్‌ లవర్‌ కాదు. కాబట్టి క్రమ క్రమంగా మోటివేట్‌ చేసుకుంటూ పుష్‌ చేస్తూ ఆయన ట్రైనింగ్‌ సాగింది.

ప్లాన్డ్‌.. ప్యాక్డ్‌...
రామ్‌కి ప్రత్యేకంగా తన పర్సనల్‌ జిమ్‌లు రెండున్నాయి. అక్కడే వర్కవుట్‌ చేసేవాళ్లం. ఆయన శరీరపు తత్వం ఎక్టోమార్ఫ్‌ టైప్‌. తొలి నుంచి లీన్‌గానే ఉండేవారు. అయితే అబ్డామిన్‌ ప్రాంతంలో కొంచెం ఫ్యాట్‌ ఉండేది. అందుకని అబ్డామినల్‌ ఫ్యాట్‌ని తగ్గిస్తూ లీన్‌ మజిల్‌ మాస్‌ని పెంచుకుంటూ వెళ్లాలి.ఆయనకి సరైన ట్రైనింగ్‌ మొదలై ట్రాన్స్‌ఫార్మేషన్‌ పూర్తవడానికి పూర్తిగా నాలుగు నెలలు పట్టింది. రోజుకు 3 నుంచి 4 గంటల సమయం శిక్షణ ఇచ్చాం. షూటింగ్‌ టైమ్‌లో మాత్రం గంటా రెండు గంటలు... అలా చేశాం. అత్యధిక సమయం నేను ట్రైన్‌ చేశాను. చివర్లో వేరే ట్రైనర్‌ ఇచ్చారు.

వర్కవుట్‌ 4 విన్‌
గతంలో కూడా రామ్‌తో వర్కవుట్‌  చేసినా... ఇంత సీరియస్‌నెస్‌ ఆయనలో ఎప్పుడూ చూడలేదు. తొలిరోజుల్లో హెవీ వెయిట్‌ చేసేవారు కాదు.కాని నెలలోనే బాగా మార్పు వచ్చింది. రోజూ పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. ఉదయం 100 పుషప్స్, సాయంత్రం 100 పులప్స్‌ చొప్పున ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున రోజుకి 2 మజిల్‌ గ్రూప్స్‌కి వర్కవుట్‌ చేసేవారు. దీనికి ముందు కనీసం 100 కేలరీలు ఖర్చయ్యేలా ట్రెడ్‌మిల్‌ మీద పరుగులు... ఒక్కో మజిల్‌కి 6 వేరియేషన్స్‌ ఒక్కో వేరియేషన్‌ 10 నుంచి 15 చొప్పున  నాలుగు నాలుగు సెట్స్‌... ఉదయం అబ్డామిన్‌ క్రంచెస్, సాయంత్రం అబ్డామిన్, సైడ్స్‌కి... ఇలా సాగింది ఆయన వర్కవుట్‌.

డైట్‌... రైట్‌..
ఎంతో యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉండే రామ్‌ ఫుడ్‌ విషయంలో కాంప్రమైజ్‌ అవడం కలిసొచ్చింది. ట్రాన్స్‌ఫార్మేషన్‌ టైమ్‌లో డైట్‌ చాలా సీరియస్‌గా ఫాలో అయ్యేవారు. చివర్లో బాగా కేలరీస్‌ తగ్గించి లో ఫ్యాట్‌ డైట్‌ మాత్రమే వినియోగించారు. తొలి నెల రోజులు చికెన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత అంతా ఫిష్, ఎగ్స్‌ మాత్రమే. కార్బొహైడ్రేట్స్‌ కోసం బ్రౌన్‌రైస్, చిరుధాన్యాలు లేదా ఓట్స్‌... క్వినోవా రైస్‌ ఆహారంలో భాగం చేశారు. అలాగే ఆహారంలో పీచు పదార్థాల కోసం స్టీమ్డ్‌ వెజిటబుల్స్, ఆల్మండ్స్, వాల్‌ నట్స్‌ వినియోగించారు.  వీటికి తోడుగా వే ప్రొటీన్, మల్టీ విటమిన్‌అదనం. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కోసం మొత్తం 5 నుంచి 6 డైట్‌ ప్లాన్స్‌ మార్చడం జరిగింది.  – ఎస్‌.ఎస్‌.బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement