
చాలా కాలం తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధించటంతో పూరీ టీం సంబరాల్లో మునిగిపోయింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా అభిమానులను స్వయంగా కలుస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు చిత్రయూనిట్.
తాజాగా ప్రమోషన్‌లో భాగంగా హన్మకొండకు వెళ్లిన ఇస్మార్ట్ శంకర్ టీంకు ప్రభాకర్ అనే అభిమాని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఏకంగా పూరీ ముఖాన్ని తన ఛాతీ మీద పచ్చబోట్టుగా వేయించుకున్నాడు. ప్రభాకర్, పూరీని కలిసి తన టాటూను చూపిస్తున్న వీడియోను నటి, నిర్మాత చార్మీ తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పూరీ త్వరలో కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
Tattoo of @purijagan by a die hard fan Prabhakar.. thank u sooooo much 💖💖💖 u touched my heart ❣#ismartshankar
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2019
ISMART BLOCKBUSTER 💪🏻💪🏻 pic.twitter.com/hHbMWF2vr2