
నిధీ అగర్వాల్
‘దిమాక్ ఖరాబ్..’ అంటూ నిధీ అగర్వాల్ అట్టహాసంగా డ్యాన్స్ చేస్తే అబ్బాయిల దిమాక్ ఖరాబ్ కావడం ఖాయం. ‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘దిమాక్ ఖరాబ్..’ పాటలోనే నిధి ఇలా హాట్‌గా కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరో, హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ‘దిమాక్ ఖరాబ్..’ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. తెలంగాణ యాసలో సాగే ఈ పాట చిత్రీకరణ సమయంలో దర్శకుడు సుకుమార్ లొకేషన్‌కి వెళ్లారు. సాంగ్ మేకింగ్, రామ్ లుక్‌ని సుక్కు అభినందించారు. మేలో ఈ చిత్రం రిలీజ్.
Comments
Please login to add a commentAdd a comment