
ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే సినిమాల్లో జంటగా నటించారు రామ్, అనుపమా పరమేశ్వరన్. ఈ జోడికి ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. నేడు అనుపమా పుట్టినరోజు సందర్భంగా అభిమానులే కాదు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రామ్ సోషల్ మీడియాలో అనుపమాకి బర్త్‌డే విషెస్ చెబుతూ.. ‘హ్యాపి బర్త్‌డే స్వీట్ లిటిల్ సౌల్.. ఈ ఏడాదంతా నీకు బాగుండాలి.. ఉప్మా.. హగ్స్’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి అనుపమా సమాధానం ఇస్తూ.. ‘ఈ సారి నేను ఉప్మా కేక్ చేయాలేమో.. థాంక్యూ.. మిస్ యూ రామ్’ అని ట్వీట్ చేశారు. రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
🙈may be I should cut an UPMA cake this time 😂 Thanku .. miss u #RAPO https://t.co/4teejnjqlX
— Anupama Parameswaran (@anupamahere) February 18, 2019