
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన పూరి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇస్మార్ట్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ ఇప్పటికే కొత్త కారు కొన్న పూరి ఇప్పుడు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఆనందాన్ని మరింత మందికి పంచేందుకు రెడీ అవుతున్నారు.
సినిమా బతకాలంటే దర్శకుడు బాగుండాలనే సిద్ధాంతాన్ని నమ్మిన పూరీ, గతంలో దర్శకత్వ శాఖలో పనిచేసి ప్రస్తుతం అవకాశాలు లేని వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన వంతుగా 20 మంది ఈ ఏడాది ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు పరిస్థితులు అనుకూలిస్తే ప్రతీ ఏడాది ఇలాగే సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న పూరీ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.