రామ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పూరిజగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసింది. ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఇందుకోసం భారీ సెట్ వేశారు. మణిశర్మ స్వరకర్త. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తన పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణయాసలో ఉండే ఈ సాంగ్‌లో రామ్ వేసే డ్యాన్స్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా విధంగా ఉంటాయట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment