
పూరి జగన్నాథ్
హీరోయిజాన్ని సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే హీరోలందరూ ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటుంటారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే పూరిజగన్నాథ్, ఛార్మి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో టిపికల్ హైదరాబాదీ కుర్రాడిగా రామ్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.