
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్ల హోరు కొనసాగుతోంది. ఇప్పటికే దావత్‌ల మీద దావత్‌లు చేసుకుంటున్న సినిమా యూనిట్‌కు ఇది కిక్కిచ్చే వార్త. ఇస్మార్ట్ శంకర్ హిట్టవడంతో పట్టాలు తప్పిన పూరీ జగన్నాథ్, రామ్‌ల ట్రాక్ లైన్‌లోకి వచ్చినట్టైంది. విడుదలై రెండో వారంలో అడుగుపెట్టినా కలెక్షన్స్‌లో మాత్రం జోరు తగ్గడం లేదు.
మాస్ ఎంటర్‌టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్లు రాబట్టగా ఒక్క నైజాంలోనే రూ. 14 కోట్లకు పైగా రాబట్టింది. సీడెడ్‌లో రూ.5 కోట్లు, వైజాగ్‌లో రూ.4 కోట్లు వసూలు చేయగా మిగతా ప్రాంతాల్లోనూ కలెక్షన్లు స్థిరంగానే ఉన్నాయి. ఓవర్సీస్‌లోనూ ఇస్మార్ట్ సత్తా చాటుతున్నాడు. మాస్ ఎలిమెంట్స్‌తో దుమ్ము లేపుతున్న ఈ చిత్రం రూ.100 కోట్ల మైలు రాయిని చేరుకునేలా ఉంది. ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా.. మణిశర్మ సంగీతాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment